RBI: యూపీఐ వినియోగదారులకు శుభవార్త.. క్రెడిట్ కార్డ్ పద్ధతిలో లోన్‌ సౌకర్యం

యూపీఐ ద్వారా చెల్లింపులు చేయాలంటే బ్యాంకు ఖాతా నుంచి నగదు బదిలీ చేయాల్సి ఉంటుంది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కొత్త ప్రతిపాదన ప్రకారం..UPI ఖాతాకు బ్యాంక్ నుంచి స్థిరమైన క్రెడిట్ లైన్ లభిస్తుంది. అంటే యూపీఐ వాలెట్ నిర్ణీత మొత్తంలో లోన్ డబ్బుతో ముందే లోడ్ చేస్తారు. ఈ మేరకు ఆర్‌బీఐ సర్క్యులర్‌ జారీ చేసింది. మీరు ప్రస్తుతం మీ సేవింగ్స్ ఖాతా, ఓవర్‌డ్రాఫ్ట్ ఖాతా, ప్రీపెయిడ్ వాలెట్, క్రెడిట్ కార్డ్‌లను యూపీఐకి లింక్ చేయవచ్చు. ఇప్పుడు క్రెడిట్ లైన్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది..

RBI: యూపీఐ వినియోగదారులకు శుభవార్త.. క్రెడిట్ కార్డ్ పద్ధతిలో లోన్‌ సౌకర్యం
Upi
Follow us
Subhash Goud

|

Updated on: Sep 05, 2023 | 4:12 PM

యూపీఐ ఇప్పుడు అత్యంత ప్రజాదరణ పొందిన చెల్లింపు ప్లాట్‌ఫారమ్‌గా మారింది. చాలా మంది భారతీయులు యూపీఐ ద్వారా చెల్లింపులు చేయడం అలవాటు చేసుకున్నారు. టెక్నాలజీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు యూపీఐ చెల్లింపులకు ముందుంటున్నారు. బ్యాంకులకు వెళ్లే పని లేకుండా ఇంట్లోనే హాయిగా కూర్చుని మొబైల్‌ ఫోన్‌ ల ద్వారా వివిధ రకాల చెల్లింపులు చేసుకునే వెలసుబాటు అందుబాటులోకి వచ్చింది. యూపీఐ కూడా కొత్త ఫీచర్‌లను పరిచయం చేయడం ద్వారా మరింత ప్రజలకు అనుకూలమైనదిగా మారింది. యూజర్ ఫ్రెండ్లీగా మారుతోంది. అదే సమయంలో క్రెడిట్ కార్డ్ వంటి యూపీఐలో క్రెడిట్ లైన్ (ముందస్తు-మంజూరైన క్రెడిట్ లైన్) సౌకర్యాన్ని అందించడానికి RBI ఒక ఫీచర్‌ను తీసుకురాబోతోంది.

ఇప్పుడున్న విధానంలో యూపీఐ ద్వారా చెల్లింపులు చేయాలంటే బ్యాంకు ఖాతా నుంచి నగదు బదిలీ చేయాల్సి ఉంటుంది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కొత్త ప్రతిపాదన ప్రకారం..UPI ఖాతాకు బ్యాంక్ నుంచి స్థిరమైన క్రెడిట్ లైన్ లభిస్తుంది. అంటే యూపీఐ వాలెట్ నిర్ణీత మొత్తంలో లోన్ డబ్బుతో ముందే లోడ్ చేస్తారు. ఈ మేరకు ఆర్‌బీఐ సర్క్యులర్‌ జారీ చేసింది. మీరు ప్రస్తుతం మీ సేవింగ్స్ ఖాతా, ఓవర్‌డ్రాఫ్ట్ ఖాతా, ప్రీపెయిడ్ వాలెట్, క్రెడిట్ కార్డ్‌లను యూపీఐకి లింక్ చేయవచ్చు. ఇప్పుడు క్రెడిట్ లైన్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది.

ఈ క్రెడిట్ లైన్‌లో డబ్బు పరిమితి ఎంత, ఎంత సమయం తిరిగి చెల్లించాలి? గడువు ముగిసిపోతే ఎంత వడ్డీ వసూలు చేస్తారు. తదితర అంశాలను బ్యాంకులు నిర్ణయం తీసుకుంటుందని గుర్తించుకోండి. ఏప్రిల్ నెలలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ఫీచర్‌ను ప్రతిపాదించింది. బ్యాంకులు యూపీఐపై డిపాజిట్ ఖాతాతో పాటు ముందుగా మంజూరు చేసిన క్రెడిట్ లైన్‌ను అందించాలని ఆర్‌బీఐ పేర్కొంది. ప్రస్తుతం మన క్రెడిట్ కార్డ్‌ని యూపీఐ ఖాతాకు లింక్ చేసే ఆప్షన్ ఉంది. అన్ని క్రెడిట్ కార్డ్‌లను లింక్ చేయడం సాధ్యం కాదు. ప్రస్తుతం రూపే క్రెడిట్ కార్డ్ మాత్రమే యూపీఐకి లింక్ చేసే సదుపాయం ఉంది.

ఇవి కూడా చదవండి

ఇప్పుడు యూపీఐ వినియోగదారులందరూ తమ బ్యాంకుల నుంచి క్రెడిట్ లైన్ పొందినట్లయితే వారు మరింత ప్రయోజనం పొందుతారు. ఆగస్టులో జరిగిన రూ. 1,000 కోట్ల లావాదేవీలలో భారతదేశంలో యూపీఐని ఉపయోగించి 996.5 కోట్ల రూపాయల నగదు బదిలీలు జరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. దీనితో పాటు డిజిటల్ లావాదేవీలలో భారత దేశం అగ్రస్థానంలో ఉంది. ఇప్పుడు యూపీఐ కి క్రెడిట్ లైన్ లభిస్తే లావాదేవీ పరిమాణం మరింత పెరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదనే చెప్పాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..
135 ఏళ్ల తర్వాత సరికొత్త రికార్డు.. డెబ్యూ మ్యాచ్​లోనే..
135 ఏళ్ల తర్వాత సరికొత్త రికార్డు.. డెబ్యూ మ్యాచ్​లోనే..
మీరూ ఈ తప్పు చేస్తున్నారా.? జిరాక్స్ షాపుకెళ్లి ఆ పని మాత్రం..
మీరూ ఈ తప్పు చేస్తున్నారా.? జిరాక్స్ షాపుకెళ్లి ఆ పని మాత్రం..
ఇక 10 నిమిషాల డెలివరీ రంగంలో ఓలా..ఎంత డిస్కౌంట్‌ ఇస్తుందో తెలుసా?
ఇక 10 నిమిషాల డెలివరీ రంగంలో ఓలా..ఎంత డిస్కౌంట్‌ ఇస్తుందో తెలుసా?