Mukesh Ambani: టాటా కంపెనీలో రిలయన్స్ పెట్టుబడులు.. ముకేష్ అంబానీ భారీ స్కెచ్..!

ఈ చర్చలు సఫలమైతే టాటా గ్రూప్, అంబానీ జాయింట్ వెంచర్‌లో భాగస్వామ్యం కావడం ఇదే మొదటిసారి. ఇది టాటా ప్లే ప్లాట్‌ఫారమ్‌లో జియో సినిమా పరిధిని కూడా విస్తరిస్తుంది. టాటా ప్లే ఐపీవో సమయంలో డిస్నీ తన షేర్లను విక్రయించాలని చూస్తోంది. కానీ లిస్టింగ్ వాయిదా పడింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, డిస్నీ, టాటా సన్స్ ప్రతినిధులు వ్యాఖ్యానించడానికి నిరాకరించారని తెలుస్తోంది. మాసెక్ కంపెనీలో తన 20 శాతం వాటాను విక్రయించడానికి..

Mukesh Ambani: టాటా కంపెనీలో రిలయన్స్ పెట్టుబడులు.. ముకేష్ అంబానీ భారీ స్కెచ్..!
Mukesh Ambani And Ratan Tata
Follow us
Subhash Goud

|

Updated on: Feb 15, 2024 | 12:35 PM

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత, వ్యాపారవేత్త ముఖేష్‌ అంబానీ తన వ్యాపారంలో మరింతగా దూసుకుపోతున్నారు. క్రమ క్రమంగా తన బిజినెస్‌ను విస్తరించుకుంటున్నారు. తన వ్యాపార రంగంలో మార్క్‌ను చాటుటున్నారు అంబానీ. ఇప్పుడు తాజాగా మరో డీల్‌ కుదుర్చుకునేందుకు భారీ స్కెట్‌ వేస్తున్నారు. అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) వాల్ట్ డిస్నీ నుండి టాటా ప్లేలో 29.8 శాతం వాటాను కొనుగోలు చేయడాన్ని పరిశీలిస్తోంది. భారతదేశ టెలివిజన్ పంపిణీ రంగంలో తన ఉనికిని బలోపేతం చేయడానికి రిలయన్స్‌ ఇండస్ట్రీస్ ఈ చర్య తీసుకుంది. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని బిజినెస్ స్టాండర్డ్ సోర్సెస్ అందించింది. అయితే టాటా గ్రూప్‌కు చెందిన హోల్డింగ్ కంపెనీ టాటా సన్స్ ప్రస్తుతం శాటిలైట్ టీవీ బ్రాడ్‌కాస్టర్‌లో 50.2 శాతం వాటాను కలిగి ఉంది. డిస్నీ కాకుండా, మిగిలిన షేర్లు సింగపూర్ ఆధారిత ఫండ్ టెమాసెక్ వద్ద ఉన్నాయి.

ఈ చర్చలు సఫలమైతే టాటా గ్రూప్, అంబానీ జాయింట్ వెంచర్‌లో భాగస్వామ్యం కావడం ఇదే మొదటిసారి. ఇది టాటా ప్లే ప్లాట్‌ఫారమ్‌లో జియో సినిమా పరిధిని కూడా విస్తరిస్తుంది. టాటా ప్లే ఐపీవో సమయంలో డిస్నీ తన షేర్లను విక్రయించాలని చూస్తోంది. కానీ లిస్టింగ్ వాయిదా పడింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, డిస్నీ, టాటా సన్స్ ప్రతినిధులు వ్యాఖ్యానించడానికి నిరాకరించారని తెలుస్తోంది.

టెమాసెక్ కంపెనీలో తన 20 శాతం వాటాను విక్రయించడానికి టాటా గ్రూప్‌తో గత సంవత్సరం నుంచే చర్చలు జరుపుతోంది. దీని విలువ సుమారు $1 బిలియన్. అయితే ఎలాంటి ఒప్పందం కుదరలేదు. టాటా ప్లే వాటాను కొనుగోలు చేయడంతో రిలయన్స్ తన మొత్తం జియోసినిమా కంటెంట్ బకెట్‌ను టాటా ప్లే సబ్‌స్క్రైబర్‌లకు అందించాలని యోచిస్తోందని నివేదికలు చెబుతున్నాయి. బ్యాంకర్లు ప్రస్తుతం టాటా ప్లేలో డిస్నీ వాటా విలువను అంచనా వేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

శాటిలైట్ టెలివిజన్ ప్రసారకులు అనేక సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుంది. ప్రధానంగా నెట్‌ఫ్లిక్స్, హాట్ స్టార్, జియో సినిమా, అమెజాన్ ప్రైమ్ వంటి స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌ల మధ్య గట్టి పోటీ ఉంది. మార్చి 31, 2023తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో టాటా ప్లే రూ. 4,499 కోట్ల ఆదాయంపై రూ. 105 కోట్ల నష్టాన్ని నివేదించింది. కాగా, గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ.4,741 కోట్ల ఆదాయంపై రూ.68.60 కోట్ల లాభాన్ని నమోదు చేసింది.

వాల్ స్ట్రీట్ జర్నల్ ఇటీవలి నివేదిక ప్రకారం.. వాల్ట్ డిస్నీ భారతదేశంలో తన టీవీ, కంటెంట్, OTT వ్యాపారంలో 60 శాతాన్ని $3.9 బిలియన్ల విలువతో రిలయన్స్‌కు విక్రయించడానికి ప్రాథమిక ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి