RJPL IPO: రిలయన్స్ గ్రూప్ నుంచి రెండు భారీ ఐపీఓలు..! RIL AGM సమావేశంలో వెల్లడించే అవకాశం..!

రిలయన్స్‌ గ్రూప్‌ నుంచి రెండు భారీ ఐపీఓలు రానున్నట్లు వార్తలు వస్తున్నాయి. రిలయన్స్ జియో, రిలయన్స్ రిటైల్ వెంచర్స్ కోసం ప్రారంభ పబ్లిక్ ఆఫర్లను (IPO) ప్రారంభించేందుకు ముకేశ్ అంబానీ సిద్ధమవుతున్నారని ఒక నివేదిక తెలిపింది...

RJPL IPO: రిలయన్స్ గ్రూప్ నుంచి రెండు భారీ ఐపీఓలు..! RIL AGM సమావేశంలో వెల్లడించే అవకాశం..!
Mukesh Ambani
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Apr 29, 2022 | 4:34 PM

రిలయన్స్‌ గ్రూప్‌ నుంచి రెండు భారీ ఐపీఓలు రానున్నట్లు వార్తలు వస్తున్నాయి. రిలయన్స్ జియో, రిలయన్స్ రిటైల్ వెంచర్స్ కోసం ప్రారంభ పబ్లిక్ ఆఫర్లను (IPO) ప్రారంభించేందుకు ముకేశ్ అంబానీ సిద్ధమవుతున్నారని ఒక నివేదిక తెలిపింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) ఛైర్మన్ కంపెనీ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో దీనికి సంబంధించి ఒక ముఖ్యమైన ప్రకటన చేయవచ్చని నివేదిక పేర్కొంది. ముఖేష్ అంబానీ మెగా ప్లాన్‌లో భాగంగా రిలయన్స్ రిటైల్‌ వెంచర్స్ (Reliance Retail Ventures-RRVL)‌, రిలయన్స్‌ జియో ప్లాట్‌ఫారం (Reliance Jio Platform-RJPL)లను ఐపీఓలుగా తీసుకొచ్చే అవకాశం ఉందని నివేదిక వెల్లడించింది.

భారత మార్కెట్లతో పాటు రిలయన్స్ రిటైల్, జియో కంపెనీలను అంతర్జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజీలలోనూ నమోదు చేసేందుకు రిలయన్స్ వర్గాలు యోచిస్తున్నట్లు తెలుస్తుంది. టెక్‌ కంపెనీలకు ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్‌ అయిన అమెరికాలోని నాస్డాక్‌లో జియోను లిస్ట్‌ చేసే అవకాశం ఉందని సమాచారం. ఈ ఐపీఓలు తీసుకొస్తే దేశంలోనే అతిపెద్ద ఐపీఓలుగా నిలవనున్నాయి.ఇప్పటి వరకు 2021లో జరిగిన Paytm IPO భారతదేశంలో రూ. 18,300 కోట్లతో అతిపెద్ద IPOగా ఉంది. 2010లో కోల్ ఇండియా దాదాపు రూ. 15,500 కోట్లు, 2008లో రిలయన్స్ పవర్ రూ. 11,700 కోట్లతో ఆ తర్వాత స్థానంలో ఉంది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (LIC) IPO Paytmని అధిగమించి.. అతిపెద్ద ప్రారంభ వాటా విక్రయం కావడానికి సిద్ధంగా ఉంది. ప్రైస్ బ్యాండ్ ఎగువన, LIC IPO ద్వారా ప్రభుత్వం దాదాపు రూ. 21,000 కోట్లను పొందుతుంది.

నిత్యావసరాలు, దుస్తులు, పాదరక్షలు, కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌కి సంబంధించిన వ్యాపారాలను రిలయన్స్ రిటైల్‌ నిర్వహిస్తోంది. దీనికి దేశవ్యాప్తంగా 14,500 స్టోర్లు ఉన్నాయి. జియోమార్ట్‌ పేరిట భారత్‌లో అతిపెద్ద ఈ-కామర్స్ వేదికను కూడా నడుపుతోంది. డిసెంబరు 2021తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ రూ.50,654 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. రిటైల్‌లో 2020 సెప్టెంబరులో ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థ సిల్వర్‌ లేక్‌ 1.75 శాతం వాటాను సొంతం చేసుకుంది. 420 మిలియన్ల సబ్‌స్క్రైబర్లతో రిలయన్స్‌ జియో (RJPL) భారత్‌లో అతిపెద్ద టెలికాం సర్వీస్‌ ప్రొవైడర్‌గా కొనసాగుతోంది.

Read  Also.. Money Safety Tips: ఇలా చేస్తే మీ పొదుపు ఖాతాల్లో డబ్బులు సేఫ్‌గా ఉన్నట్లే.. ఈ విషయాలు తెలుసుకోండి!