AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Most Affordable Cars: మీరు కారు కొనాలని చూస్తున్నారా? రూ.5 లక్షలలోపు బెస్ట్‌ కార్లు ఇవే!

ఈ రోజుల్లో సామాన్యులు సైతం కారును కొంటున్నారు. ఈఎంఐలో కొత్త కారును కొనుగోలు చేస్తున్నారు. అయితే సామాన్యులకు అందుబాటులో ఉండేవి మారుతి సుజుకీ కార్లు. ఈ కంపెనీ మోడల్‌ కార్లు కాస్త తక్కువ ధరల్లో లభిస్తాయి. వాటి నిర్వహణ కూడా పెద్దగా ఉండదు. మీరు రూ.5 లక్షల్లోపు (ఎక్స్ షోరూమ్) ధర గల కారు కోసం చూస్తున్నట్లయితే

Most Affordable Cars: మీరు కారు కొనాలని చూస్తున్నారా? రూ.5 లక్షలలోపు బెస్ట్‌ కార్లు ఇవే!
Alto K 10
Subhash Goud
|

Updated on: Jul 01, 2024 | 3:23 PM

Share

ఈ రోజుల్లో సామాన్యులు సైతం కారును కొంటున్నారు. ఈఎంఐలో కొత్త కారును కొనుగోలు చేస్తున్నారు. అయితే సామాన్యులకు అందుబాటులో ఉండేవి మారుతి సుజుకీ కార్లు. ఈ కంపెనీ మోడల్‌ కార్లు కాస్త తక్కువ ధరల్లో లభిస్తాయి. వాటి నిర్వహణ కూడా పెద్దగా ఉండదు. మీరు రూ.5 లక్షల్లోపు (ఎక్స్ షోరూమ్) ధర గల కారు కోసం చూస్తున్నట్లయితే మారుతి సుజుకీలో మంచి మోడల్‌ కార్లు ఉన్నాయి. కేవలం మూడు కార్లు మాత్రమే రూ.5 లక్షల్లోపు ధరకు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో మారుతి సుజుకి ఆల్టో కే10 (Maruti Suzuki Alto K10), మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో (Maruti Suzuki S-Presso), రెనాల్ట్ క్విడ్ (Renault Kwid).

మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో:

Maruti Suzuki S Presso

Maruti Suzuki S Presso

మారుతి సుజుకి నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. అదే ఎస్-ప్రెస్సో (S-Presso) కారు. దీని ధర రూ.4.26 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభం అవుతుంది. ఆల్టో కే10 కారులో వాడే ఇంజిన్ నే ఇందులోనూ వాడుతున్నారు. బేస్ వేరియంట్ విత్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ కారు మాత్రమే రూ.5 లక్షల (ఎక్స్) కంటే తక్కువ ధరకు లభిస్తుంది.

ఇవి కూడా చదవండి

రెనాల్ట్ క్విడ్ ధరెంతంటే..

Renault Kwid

Renault Kwid

ఇక మరో మోడల్‌ కారు రెనాల్ట్ క్విడ్ (Renault Kwid). ఈ కారు ప్రస్తుతం తక్కువ ధరకు అందుబాటులో ఉంది. ఒకప్పుడు 0.8 లీటర్లు, 1.0 లీటర్ల పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లతో వచ్చిన రెనాల్ట్ క్విడ్.. ఇప్పుడు పెద్ద ఇంజిన్ మాత్రమే కొనసాగిస్తుంది. ఇక ధర విషయానికొస్తే రూ.4.69 లక్షలు (ఎక్స్ షోరూమ్) ఉంది. 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్ కారు మాత్రమే రూ.5 లక్షల్లోపు ధరకు లభిస్తుంది ఈ కారు.

మారుతి సుజుకి ఆల్టో కే10:

Alto K 10

Alto K 10

ఇక ఇండియాలో అత్యంత విశ్వసనీయమైన బ్రాండ్లలో మారుతి సుజుకి ఆల్టో ఒకటి. దేశంలో అత్యధికంగా అమ్ముడైన కారు కూడా ఇదే. మొదట్లో అందుబాటులో ఉన్న ఆల్టో800 కారును మారుతి డిస్ కంటిన్యూ చేసింది. ప్రస్తుతం మారుతి సుజుకి ఆల్టో కే10 మాత్రమే లభిస్తోంది. మారుతి సుజుకి ఆల్టో కే10 కారు రూ.3.99 లక్షలు (ఎక్స్ షోరూమ్) పలుకుతుంది. మీరు మాన్యువల్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్ (5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్) కారు మాత్రమే రూ.5 లక్షల్లోపు తీసుకోవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి