AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kisan Vikas Patra: ఈ పథకంలో పెట్టుబడి పెడితే మీ డబ్బులు డబల్ అవ్వడం ఖాయం.. పూర్తి భద్రత, భరోసా

పోస్ట్‌ ఆఫీసుల్లో అనేక పెట్టుబడి పథకాలు అందుబాటులో ఉంటాయి. కానీ వాటిల్లో కొన్ని పథకాలు మాత్రం అధిక జనాదరణ పొందుతాయి. అలాంటి వాటిల్లో ఈ కిసాన్‌ వికాస్‌ పత్ర(కేవీపీ) ఒకటి. ప్రభుత్వం మద్దతుతో ఉండే ఈ పథకం స్మాల్‌ సేవింగ్స్‌ స్కీమ్‌. దీనిలో మీరు పెట్టుబడి పెడితే.. తొమ్మిది సంవత్సరాల, ఏడు నెలల్లో (మొత్తం 115 నెలలు) డబ్బును రెట్టింపు చేస్తుంది.

Kisan Vikas Patra: ఈ పథకంలో పెట్టుబడి పెడితే మీ డబ్బులు డబల్ అవ్వడం ఖాయం.. పూర్తి భద్రత, భరోసా
మీరు వ్యాపారం ప్రారంభించాలంటే పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మనలో ఉన్న చిన్న టాలెంట్‌తో కూడా లక్షల్లో సంపాదించవచ్చు.
Madhu
|

Updated on: Jul 01, 2024 | 3:07 PM

Share

పోస్ట్‌ ఆఫీసుల్లో అనేక పెట్టుబడి పథకాలు అందుబాటులో ఉంటాయి. కానీ వాటిల్లో కొన్ని పథకాలు మాత్రం అధిక జనాదరణ పొందుతాయి. అలాంటి వాటిల్లో ఈ కిసాన్‌ వికాస్‌ పత్ర(కేవీపీ) ఒకటి. ప్రభుత్వం మద్దతుతో ఉండే ఈ పథకం స్మాల్‌ సేవింగ్స్‌ స్కీమ్‌. దీనిలో మీరు పెట్టుబడి పెడితే.. తొమ్మిది సంవత్సరాల, ఏడు నెలల్లో (మొత్తం 115 నెలలు) డబ్బును రెట్టింపు చేస్తుంది. ఈ త్రైమాసికానికి అంటే జూలై నుంచి సెప్టెంబర్‌ వరకూ ఈ పథకంతో సహా స్మాల్‌ సేవింగ్స్‌ స్కీమ్స్‌ అన్నింటికి వర్తించే వడ్డీ రేట్లలో ఎటువంటి మార్పు లేదని ఇండియా పోస్ట్ వెబ్‌సైట్ ఇప్పటికే ప్రకటించింది. ప్రస్తుతం, కిసాన్ వికాస్ పత్ర ఏడాదికి 7.5 శాతం వడ్డీని అందిస్తుంది. ఈ పథకంలో నిర్దిష్ట పరిమితులకు లోబడి పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకం కనీసం రూ. 1,000 డిపాజిట్‌ని ప్రారంభించొచ్చు. రూ. 100 గుణిజాలలో ఎంతైనా పెట్టుబడిగా పెట్టొచ్చు.

ఖాతా ప్రారంభించేందుకు అర్హతలు ఇవే..

పోస్ట్ ఆఫీస్ కిసాన్ వికాస్ పత్ర పెట్టుబడిని అందరూ ప్రారంభించొచ్చు. అయితే ఈ పథకం పేరులో ఉన్నట్లు ఈ పథకం ప్రారంభించిన కొత్త రైతులకు మాత్రమే అందుబాటులో ఉండేది. అయితే ఆ తర్వాత కామన్‌గా అందరికీ కొన్ని నిర్ధిష్ట అర్హతా ప్రమాణాల మేరకు అందిస్తోంది.

  • మేజర్‌ అయిన ఎవరైనా ఈ ఖాతా తెరవచ్చు.
  • ఉమ్మడి ఖాతాను ముగ్గురు పెద్దలు కలిసి తెరవవచ్చు.
  • మైనర్ తరపున ఖాతా తెరవడానికి సంరక్షకుడికి అవకాశం ఉంటుంది.
  • 10 ఏళ్లు పైబడిన మైనర్లు వారి సొంతత పేరు మీద ఖాతాను తెరవవచ్చు.

దరఖాస్తు కోసం పత్రాలు..

కిసాన్ వికాస్ పత్ర ఖాతా ప్రారంభించేందుకు ఫారం A, దరఖాస్తును ఏజెంట్ ద్వారా సమర్పించినట్లయితే ఫారమ్ A1, కేవైసీ పత్రాలు (ఆధార్ కార్డ్/పాస్‌పోర్ట్/పాన్ కార్డ్/ఓటర్ ఐడీ) సమర్పించాలి. వీటిని పోస్ట్‌ ఆఫీసులో సమర్పించినప్పుడు మీకు కేవీపీ ప్రమాణ పత్రాన్ని అందిస్తారు. మీరు ఈ ప్రమాణపత్రాన్ని పోగొట్టుకున్నా లేదా పాడు చేసినా, మీరు దాని నకిలీ కాపీని అభ్యర్థించవచ్చు. దీని మెచ్యూరిటీ సమయం తొమ్మిది సంవత్సరాల, ఏడు నెలల్లో (మొత్తం 115 నెలలు). ఈ సమయంలో మీరు ఎంత పెట్టుబడి పెడతారో అంతే మొత్తంలో తిరిగి పొందుకుంటారు. అంటే రూ. 10,000 పెట్టుబడిగా పెడితే 115నెలల తర్వాత మెచ్యూరిటీ సమయానికి మీకు రూ. 20,000 వస్తాయి.

ముందుగా ఖాతాను మూసేయవచ్చు..

ఖాతాను నిర్ధిష్ట కాలవ వ్యవధికన్నా ముందే మూసేయవచ్చు. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అదే సాధ్యమవుతుంది.

  • ఖాతాదారు మరణించిన సందర్భంలో..
  • ఎవరైనా లేదా జాయింట్ అకౌంట్ హోల్డర్లందరూ మరణిస్తే..
  • న్యాయస్థానం ఆదేశించినప్పుడు..
  • డిపాజిట్ తేదీ నుంచి రెండు సంవత్సరాల ఆరు నెలల తర్వాత..

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..