AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Business Ideas: ఎండాకాలంలో మంచి లాభాలు.. ఈ వ్యాపారాలు మొదలుపెడితే.. నెలకు రూ. లక్ష వరకు గ్యారంటీ.!

ఈ సమ్మర్ సీజన్‌లో కూల్‌గా డబ్బులు సంపాదించవచ్చు. మరి ఆ వ్యాపారాలు ఏంటో.? ఎలా ఆదాయం సంపాదించాలో ఇప్పుడు తెలుసుకుందామా..!

Business Ideas: ఎండాకాలంలో మంచి లాభాలు.. ఈ వ్యాపారాలు మొదలుపెడితే.. నెలకు రూ. లక్ష వరకు గ్యారంటీ.!
Money Image Credit source: TV9 Telugu
Follow us
Ravi Kiran

|

Updated on: May 09, 2023 | 8:46 PM

మీరు కూడా ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటున్నారా.? తక్కువ పెట్టుబడితో.. ఎక్కువ లాభాలు ఆర్జించవచ్చు. ఈ సమ్మర్ సీజన్‌లో కూల్‌గా డబ్బులు సంపాదించవచ్చు. మరి ఆ వ్యాపారాలు ఏంటో.? ఎలా ఆదాయం సంపాదించాలో ఇప్పుడు తెలుసుకుందామా..! ఎండాకాలంలో ప్రజలందరూ కూడా చల్లటి పదార్ధాలను సేవించేందుకు మొగ్గు చూపుతారు. ఇక ఈ వేసవి కోసం ప్రత్యేకంగా కొన్ని వ్యాపారాలు పుట్టుకొస్తాయి. వాటిల్లో ముఖ్యమైనవి కూల్ డ్రింక్స్, లస్సీ, మజ్జిగ, జ్యూస్ వ్యాపారాలు. మరి వాటి ద్వారా ఎంత ఆర్జించవచ్చో చూద్దాం..

కూల్‌డ్రింక్స్ బిజినెస్:

వేసవిలో కూల్‌డ్రింక్స్‌కు భారీ డిమాండ్ ఉంటుంది. మాంచి రద్దీ ప్లేస్‌లో మీరు ఈ వ్యాపారాన్ని మొదలుపెడితే.. నెలకు రూ. లక్ష లేదా లక్షన్నర వరకు సంపాదించవచ్చు.

లస్సీ, మజ్జిగ బిజినెస్:

లస్సీ, మజ్జిగ లాంటి చల్లటి పదార్ధాలు శరీరానికి చల్లదనం అందించడంతో పాటు ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగకరం. ఈ వ్యాపారం మొదలుపెట్టేందుకు పెట్టుబడి తక్కువే.. దీనిలో రోజుకు రూ. 1000 నుంచి రూ. 1500 వరకు సంపాదించవచ్చు.

జ్యూస్ బిజినెస్:

ఈ వేసవిలో జ్యూస్ బిజినెస్ కూడా భారీగానే లాభాలు తెచ్చిపెడుతుంది. దీని ద్వారా రూ. 500 నుంచి రూ. 800 వరకు లేదా అంతకంటే ఎక్కువే సంపాదించవచ్చు.

ఐస్‌క్రీమ్ బిజినెస్:

పిల్లల నుంచి పెద్దల వరకు ఈ వేసవిలో ఒక్కసారైనా కచ్చితంగా ఐస్‌క్రీమ్ తింటారు. భానుడి భగభగ పెరిగే కొద్దీ.. ఈ బిజినెస్ డిమాండ్ విపరీతంగా పెరుగుతూపోతుంది. దీని ద్వారా నెలకు రూ.80 వేల నుంచి రూ.90 వేల వరకు సంపాదించవచ్చు.