SBI Scheme: సేవింగ్స్ ఖాతాకన్నా అధిక వడ్డీనిచ్చే ఎస్బీఐ పథకమిదే.. నెలనెలా రాబడి..
అధిక భద్రతతో కూడిన బ్యాంకు పథకాలలో పెట్టుబడి పెట్టేందుకు ప్రజలు మొగ్గుచూపుతారు. ఒకవేళ మీరూ అలాంటి ఆలోచనలతోనే ఉంటే.. ఈ కథనం మీ కోసమే. దేశంలోని అతి పెద్ద రుణదాత అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) అధిక రాబడినిచ్చే పథకాన్ని ప్రవేశపెట్టింది.

ప్రజలు స్టాక్ మార్కెట్ లేదా క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలంటే కాస్త ఆందోళన చెందుతారు. ఎందుకంటే ఇవి మార్కెట్ ఒడిదొడుకులకు లోనవుతాయి. కచ్చితమైన రాబడికి గ్యారంటీ లేదు. రిస్క్ తో కూడుకున్నది. అందుకే అధిక భద్రతతో కూడిన బ్యాంకు పథకాలలో పెట్టుబడి పెట్టేందుకు ప్రజలు మొగ్గుచూపుతారు. ఒకవేళ మీరూ అలాంటి ఆలోచనలతోనే ఉంటే.. ఈ కథనం మీ కోసమే. దేశంలోని అతి పెద్ద రుణదాత అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) అధిక రాబడినిచ్చే పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇది సాధారణ సేవింగ్స్ ఖాతాకన్నా అధిక రాబడిని అందిస్తుంది. ఆ పథకం పేరు ఎస్బీఐ యాన్యూటి డిపాజిట్ స్కీమ్. దీనిలో వడ్డీ రేట్లు సాధారణం సేవింగ్స్ ఖాతా కన్నా అధికంగా ఉంటాయి. అలాగే సంప్రదాయ డిపాజిట్ స్కీమ్ల కన్నా మెరుగైన రాబడిని అందిస్తాయి. ఎస్బీఐ యాన్యుటీ స్కీమ్ గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఇదీ పథకం..
ఎస్బీఐ యాన్యుటీ డిపాజిట్ స్కీమ్ కింద ఒక పెట్టుబడిదారుడు నిర్ణీత కాలానికి అధిక మొత్తంలో డబ్బును డిపాజిట్ చేయాలి. వడ్డీతో కూడిన మొత్తం ప్రతి నెలా సమానమైన నెలవారీ వాయిదాలలో పెట్టుబడిదారుడికి తిరిగి ఇవ్వబడుతుంది. కాంపౌండింగ్ ఆధారంగా ఖాతాలో జమ చేసిన మొత్తంపై ప్రతి త్రైమాసికంలో వడ్డీ లెక్కింపు జరుగుతుంది. కస్టమర్లు తమ పెట్టుబడి కాలాన్ని ఎంచుకోవచ్చు. వడ్డీ రేటు సాధారణ కస్టమర్లకు 5% నుంచి 6.5% మధ్య ఉంటుంది. సీనియర్ సిటిజన్ల మాత్రం వడ్డీ రేటు మొత్తం పెట్టుబడి వ్యవధిని బట్టి 5.5% నుండి 7.5% మధ్య మారుతూ ఉంటుంది.
ఇది గుర్తుపెట్టుకోండి..
అయితే, ప్రతి నెలా చెల్లింపుల కారణంగా ప్రిన్సిపల్ అమౌంట్ తగ్గుతూ ఉంటుంది. దీని కారణంగా వడ్డీ కూడా ప్రతి నెలా తగ్గుతూనే ఉంటుందని కస్టమర్‌లు తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఈ పథకం ముగింపునకు వచ్చే సమయానికి పెట్టుబడిదారుని మొత్తం సొమ్ము వడ్డీతో సహా ఈఎంఐల వారీగా తీసేసుకుంటారు. చెల్లింపులు మీరు ఖాతా ప్రారంభించిన తర్వాత నెల నుంచి మొదలువుతుంది.
ఎంత డబ్బు డిపాజిట్ చేయవచ్చు?
ఈ పథకంలో గరిష్ట డిపాజిట్‌పై ఎటువంటి స్థిర పరిమితి లేదు. కానీ, కనీస డిపాజిట్ నెలకు రూ. 1,000 ఉండాలి. కస్టమర్‌కు యూనివర్సల్ పాస్‌బుక్ జారీ చేయబడుతుంది. ఈ పథకం కింద పెట్టుబడులు 36, 60, 84 లేదా 120 నెలల కాలానికి చేయవచ్చు. అలాగే ఈ పథకం ఖాతాలోని బ్యాలెన్స్ మొత్తంలో 75% వరకు ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యాన్ని కూడా అందిస్తుంది.
ఎలా ప్రారంభించాలి..
మీరు ఎస్బీఐ యాన్యుటీ డిపాజిట్ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టాలనుకుంటే, మీరు సమీపంలోని ఏదైనా ఎస్బీఐ బ్రాంచ్‌కి వెళ్లి ఖాతా ప్రారంభించవచ్చు. ఒకసారి తెరిచిన తర్వాత, మీరు ఈ పథకం కింద ఖాతాను ఒక శాఖ నుండి మరొక శాఖకు బదిలీ చేయవచ్చు. ఈ పథకంలో వ్యక్తిగత నామినేషన్ సౌకర్యం అందుబాటులో ఉంది. ఇది సింగిల్ లేదా జాయింట్ హోల్డింగ్ ఖాతా తెరవచ్చు. డిపాజిటర్ మరణించిన సందర్భంలో ఛార్జీలు లేకుండా పథకాన్ని ముందస్తుగా క్లోజ్ చేయొచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..