Home Loan EMI: హోమ్‌లోన్‌ ఈఎంఐ కట్టడం మిస్సయారా? ఇక ఆ చార్జీల మోయాల్సిందే..!

గృహాలను కొనుగోలు చేసేటప్పుడు చాలా మంది గృహరుణాలను ఎంపిక చేసుకుంటున్నారు. గృహ రుణాలను ప్రతి నెలా ఈక్వేటెడ్ మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్స్ (ఈఎంఐ)ల రూపంగా చెల్లించాలి. కానీ నగదు కొరత, మెడికల్ ఎమర్జెన్సీ లేదా ఇతర కారణాల వల్ల చాలా మంది రుణగ్రహీతలు తమ ఈఎంఐ చెల్లించడంలో ఒక్కోసారి విఫలమవుతున్నారు. అయితే ఎప్పుడైనా ఓ సారి ఈఎంఐ చెల్లింపులో విఫలమైతే కొన్ని చర్యలతో సరిదిద్దవచ్చు.

Home Loan EMI: హోమ్‌లోన్‌ ఈఎంఐ కట్టడం మిస్సయారా? ఇక ఆ చార్జీల మోయాల్సిందే..!
Home Loan
Follow us
Srinu

|

Updated on: Aug 15, 2023 | 4:30 PM

ప్రస్తుత రోజుల్లో పెరిగిన ఖర్చుల నేపథ్యంలో సొంతింటి కలను నిజం చేసుకోవాలనుకునే వారికి గృహ రుణాలు మంచి ఎంపికగా మారాయి. సుదీర్ఘ పదవీకాలంతో పాటు పన్ను ప్రయోజనాలతో, గృహాలను కొనుగోలు చేసేటప్పుడు చాలా మంది గృహరుణాలను ఎంపిక చేసుకుంటున్నారు. గృహ రుణాలను ప్రతి నెలా ఈక్వేటెడ్ మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్స్ (ఈఎంఐ)ల రూపంగా చెల్లించాలి. కానీ నగదు కొరత, మెడికల్ ఎమర్జెన్సీ లేదా ఇతర కారణాల వల్ల చాలా మంది రుణగ్రహీతలు తమ ఈఎంఐ చెల్లించడంలో ఒక్కోసారి విఫలమవుతున్నారు. అయితే ఎప్పుడైనా ఓ సారి ఈఎంఐ చెల్లింపులో విఫలమైతే కొన్ని చర్యలతో సరిదిద్దవచ్చు. కానీ మీరు ఇన్‌స్టాల్‌మెంట్‌ను పదేపదే చెల్లించకపోతే మీ ఆర్థిక స్థితిపై ప్రతికూల ప్రభావాలు ఉండవచ్చు.  కాబట్టి గృహ రుణ ఈఎంఐల చెల్లింపులో ఫెయిల్‌ అయితే ఎలాంటి ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుందో? ఓసారి తెలుసుకుందాం.

క్రెడిట్ స్కోర్ తగ్గుదల

పెండింగ్‌లో ఉన్న ఈఎంఐ చెల్లింపుల వల్ల రుణగ్రహీత క్రెడిట్ స్కోర్‌ తగ్గిపోతుంది. అంటే భవిష్యత్‌లో అనుకూలమైన వడ్డీ రేట్లలో వ్యక్తిగగత రుణాలు, క్రెడిట్ కార్డులను పొందే అవకాశం తక్కువగా ఉంటుంది. చాలా ఆర్థిక సంస్థలు 750 కంటే ఎక్కువ స్కోర్‌ను మంచివిగా పరిగణిస్తాయి. ఈఎంఐ చెల్లింపులో విఫలమైతే రుణగ్రహీత క్రెడిట్ స్కోర్ పడిపోవచ్చు

అదనపు పెనాల్టీలు

ఈఎంఐ చెల్లింపులో విఫలమైన ప్రతి నెలా ఈఎంఐ చెల్లించడం కోసం రుణగ్రహీతలు పెండింగ్ మొత్తానికి అదనంగా పెనాల్టీలు, ఆలస్య రుసుమును డిపాజిట్ చేయాలి. జరిమానాలు సాధారణంగా రుణ మొత్తంలో 1 నుండి 2 శాతం వరకు ఉంటాయి. సాధారణ వడ్డీ కంటే ఎక్కువ జరిమానా వడ్డీ కూడా విధించే అవకాశం ఉంది. ఈ ఛార్జీలు రుణగ్రహీతపై ఆర్థిక భారాన్ని పెంచుతాయి.

ఇవి కూడా చదవండి

వేలం

రుణగ్రహీతలు ఏదైనా పెండింగ్ బకాయిలను తిరిగి చెల్లించడానికి గ్రేస్ పీరియడ్ పొందుతారు. ఆ సమయంలోపు సొమ్మును కట్టకపోతే రుణదాత మన రుణాన్ని నాన్-పెర్ఫార్మింగ్ అసెట్ (ఎన్‌పీఏ)గా వర్గీకరిస్తారు. ఇది బకాయిలను రికవరీ చేయడానికి 2002లో ఎస్‌ఏఆర్‌ఎఫ్‌ఏఈఎస్‌ఐ చట్టం ఫ్రేమ్‌వర్క్ ప్రకారం రుణగ్రహీతకు చెందిన ఆస్తిని లేదా తాకట్టును వేలం వేయడానికి ఆర్థిక సంస్థకు చట్టపరమైన హక్కును ఇస్తుంది. కాబట్టి మనం రుణం తీసుకున్న సంస్థ మన ఆస్తిని వేలం వేసే అవకాశం ఉంటుంది.

ఈ జాగ్రత్తలు తీసుకుంటే సమస్య నుంచి రక్షణ

బడ్జెట్‌ను రూపొందించడం

అన్ని బకాయిలను తిరిగి చెల్లించడానికి తగినంత నిధులు ఉన్నాయని నిర్ధారించుకోవాలి. ఖర్చులు, ఆదాయాల బడ్జెట్‌ను రూపొందించాలి. అలాగే అనవసరమైన లావాదేవీలను తగ్గించాలి. ఇది ఈఎంఐ చెల్లింపు కోసం డబ్బును ఆదా చేయడంలో సహాయపడుతుంది.

చెల్లింపులను ఆటోమేట్ చేడం

హోమ్ లోన్ ఈఎంఐలో ఆటోమేటిక్ డెబిట్ ఎంపికను ప్రారంభించండి. ఇది చెల్లింపులు మిస్ కాకుండా ఉండేలా చూస్తుంది.

రుణాన్ని రీఫైనాన్స్ చేయడం

ఉద్యోగం కోల్పోవడం లేదా ఏదైనా అత్యవసర పరిస్థితి కారణంగా ఒక వ్యక్తి వారి ఈఎంఐ చెల్లింపును చేయలేకపోతే వారు రుణదాతను సంప్రదించి వారి ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని నిబంధనలను మార్చమని అభ్యర్థించాలి. అలా చేస్తే వారురుణాన్ని రీఫైనాన్స్ చేసే అవకాశం ఉంటుంది. ఇలా చేయడం ద్వారా మనకు ఈఎంఐ చెల్లించడానికి కొన్ని రోజుల వ్యవధి దొరుకుతుంది. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి