AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Toyota Cars: టయోటా సంచలన నిర్ణయం.. అగ్ని ప్రమాదాల నివారణకు ఆ మోడల్‌ కార్ల రీకాల్‌

ఈ మోడల్‌ వాహనాల్లో అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉండడంతో వాహనాలను రీకాల్‌ చేస్తుంది. ముఖ్యంగా ఫ్యూయల్‌ ట్యూబ్‌ విషయంలో వచ్చిన ఇబ్బంది కారణంగానే కంపెనీ ఈ కార్లను రీకాల్‌ చేస్తున్నట్లు మార్కెట్‌ నిపుణులు పేర్కొంటున్నారు. అయితే ఈ కార్లు ప్రస్తుతం యూఎస్‌ మాత్రమే రీకాల్‌ చేశారు. యూఎస్‌లో ప్రస్తుతం 1.68 లక్షల కార్లను రీకాల్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Toyota Cars: టయోటా సంచలన నిర్ణయం.. అగ్ని ప్రమాదాల నివారణకు ఆ మోడల్‌ కార్ల రీకాల్‌
Toyota
Nikhil
|

Updated on: Aug 15, 2023 | 4:00 PM

Share

జపాన్‌కు చెందిన ఆటోమోటివ్ దిగ్గజం టయోటా అగ్ని ప్రమాదం కారణంగా యుఎస్‌లో ఇటీవల తయారు చేసిన దాదాపు 1,68,000 వాహనాలను రీకాల్ చేసింది. రీకాల్‌లో నిర్దిష్ట 2022, 2023 మోడల్ టయోటా టండ్రా, టండ్రా హైబ్రిడ్ వాహనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ మోడల్‌ వాహనాల్లో అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉండడంతో వాహనాలను రీకాల్‌ చేస్తుంది. ముఖ్యంగా ఫ్యూయల్‌ ట్యూబ్‌ విషయంలో వచ్చిన ఇబ్బంది కారణంగానే కంపెనీ ఈ కార్లను రీకాల్‌ చేస్తున్నట్లు మార్కెట్‌ నిపుణులు పేర్కొంటున్నారు. అయితే ఈ కార్లు ప్రస్తుతం యూఎస్‌ మాత్రమే రీకాల్‌ చేశారు. యూఎస్‌లో ప్రస్తుతం 1.68 లక్షల కార్లను రీకాల్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కార్ల వల్ల వచ్చే ఇబ్బందులు ఏంటి? రీకాల్‌ సమయంలో కస్టమర్లకు ఎలాంటి ఆఫర్లు ఇస్తున్నారో? ఓ సారి తెలుసుకుందాం.

టయోటా టండ్రా కార్లు ప్లాస్టిక్ ఫ్యూయల్ ట్యూబ్‌తో అమర్చి ఉంటాయి, ఇవి బ్రేక్ లైన్‌కు వ్యతిరేకంగా కదులుతాయి. అందువల్ల ఇంధనం లీకయ్యే అవకాశం అధికంగా ఉంది. అనుకోని పరిస్థితుల్లో ఇంధనం లీక్ అయితే అగ్ని ప్రమాదం జరగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ కార్లను ప్రస్తుతం టయోటా డీలర్లు ఇంధన ట్యూబ్‌ను మెరుగైన భాగంతో భర్తీ చేస్తారు. అలాగే వినియోగదారులకు ఎటువంటి ఖర్చు లేకుండా అదనపు క్లాంప్‌లను అందిస్తారు. ప్రస్తుతం ఈ రీకాల్ కోసం నివారణ భాగాలను సిద్ధం చేస్తున్నట్లు టయోటా ప్రతినిధులు పేర్కొంటున్నారు. తుది రెమెడీ భాగాలు అందుబాటులోకి వచ్చే వరకు కస్టమర్లు రక్షిత పదార్థాలను అందించడంతో ఇంధన ట్యూబ్‌పై బిగింపును తాత్కాలికంగా చేస్తారు. నివారణా బాగాలు పూర్తి స్థాయిలో సిద్ధమయ్యాక అక్టోబర్ 2023 నాటికి అన్ని కార్లను అధునాతనంగా తీర్చిదిద్దుతామని మేకర్లు పేర్కొంటున్నారు. 

ఇవి కూడా చదవండి

గత సంవత్సరం, టయోటాతో సహా ఎనిమిది ఆటోమేకర్లు లోపభూయిష్ట భాగాలను సరిచేయడానికి 1,00,000 కంటే ఎక్కువ వాహనాలను స్వచ్ఛందంగా రీకాల్‌ చేశౠరని గణాంకాలు చెబుతున్నాయి. టయోటా, కియా, ఫోర్డ్ సేల్స్ అండ్ సర్వీస్ కొరియా, ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్ కొరియా, జాగ్వార్ ల్యాండ్ రోవర్ కొరియా, బీఎమ్‌డబ్ల్యూ కొరియా, దాసన్ హెవీ ఇండస్ట్రీస్ కో, మోటోస్టార్ కొరియా అనే ఎనిమిది సంస్థలు మొత్తం 52 రకాల మోడళ్లలో 1,02,169 యూనిట్లను రీకాల్ చేశాయి.

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!