Train Cleaning: రైళ్లను శుభ్రపరిచే స్టైల్ మారింది.. వీడియోను చూస్తే మీరు కూడా సూపర్ అంటారు..
రైల్వే మంత్రిత్వ శాఖ ఓ వీడియోను షేర్ చేసింది. ఇందులో భారతీయ రైల్వే రైళ్లను శుభ్రపరిచే విధానం చూపించింది. ఈ వీడియోపై ప్రశంసలు కురుస్తున్నాయి.
ఇండియన్ రైల్వేస్ ద్వారా ప్రతిరోజూ లక్షల మంది ప్రయాణిస్తుంటారు. దీని కారణంగా రైళ్ల కోచ్‌లు మురికిగా మారతాయి. అయితే ఈ రైళ్లను ఎలా శుభ్రం చేస్తారు..? ఏ సమయంలో ఈ పనిని పూర్తి చేస్తారు..? ఎక్కడ చేస్తారు..? ఇందుకోసం ఎంత మంది పని చేస్తారు..? ఎంత సమయం తీసుకుంటారు..? ఎలాంటి కెమికల్స్ వినియోగిస్తారు..? ఇలాంటి ప్రశ్నలు మనలో చాలా మందికి వస్తుంటాయి. మనకు ఇచ్చే ఇలాంటి ప్రశ్నలకు చెక్ పెట్టే ప్రయత్నం చేసిన రైల్వే శాఖ. వారు చేస్తున్న పనిని సోషల్ మీడియాలో పోస్టు చేసింది.
రైళ్లను శుభ్రపరిచే పద్ధతిని చూపించే వీడియోను రైల్వే మంత్రిత్వ శాఖ షేర్ చేసింది. గతంలో రైళ్లను ఎలా క్లీన్ చేసేవారు.. ఇప్పుడు ఎంత మారిపోయిందో కూడా వీడియోలో చూపించారు. రైల్వే కోచ్ వాషింగ్ ప్లాంట్‌లో రైళ్లను శుభ్రం చేస్తారు. రైల్వే మంత్రిత్వ శాఖ వీడియో మొదటి భాగంలో.. ముందుగా రైళ్లను ఎలా శుభ్రం చేశారో చూపించింది.
రైలును చేతి, గుడ్డ సహాయంతో శుభ్రం చేస్తున్నారు. అయితే, వీడియో రెండవ భాగంలో.. ఆటోమేటెడ్ రైల్వే కోచ్ వాషింగ్ ప్లాంట్‌లో రైళ్లను శుభ్రం చేస్తున్నారు. దీనిలో రైలు పొడవైన స్క్రబ్బర్‌ల గుండా వెళుతుంది. శుభ్రం చేస్తున్నారు. వీడియోను షేర్ చేస్తూ, రైల్వే మంత్రిత్వ శాఖ ట్విట్టర్‌లో ‘హ్యాండ్ ప్రెస్ నుంచి సిస్టమాటిక్ స్విచ్ వరకు అని రాసింది.
ఈ వీడియోను 6 లక్షల మందికి పైగా..
రైళ్లను శుభ్రపరిచే వీడియో ట్విట్టర్‌లో వైరల్‌గా మారింది. 17 17 సెకన్ల ఈ వీడియోను ఇప్పటివరకు 6.2 లక్షల మంది చూశారు. ఇప్పటివరకు ఈ వీడియోను 16.4 వేల మందికి పైగా లైక్ చేసారు. యూజర్లు దానిపై నిరంతరం వ్యాఖ్యానిస్తున్నారు. ఈ వీడియోను చూసి జనాలు ఈ కొత్త టెక్నాలజీని కొనియాడుతున్నారు.
From hand press to systematic switch. pic.twitter.com/J9jaTnmUrJ
— Ministry of Railways (@RailMinIndia) February 26, 2023
మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం