AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ton Split AC: ఎయిర్ కండీషనర్‌లో టన్ అంటే ఏంటో తెలుసా.. ఏసీ కొనేముందు ఇలా చేయండి..

ఎండలు దంచికొడుతున్నాయి. ఈ వేసవి తాపం నుంచి బయట పడేందుకు షాపింగ్ మొదలు పెట్టారు. వెంటనే ఏసీ కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇక్కడే అసలు సమస్య.. ఎన్ని టన్నుల ఏసీ కొనుగోలు చేయాలనేది అందరిలో మెదలుతున్న ప్రశ్న.

Ton Split AC: ఎయిర్ కండీషనర్‌లో టన్ అంటే ఏంటో తెలుసా.. ఏసీ కొనేముందు ఇలా చేయండి..
Air Conditioner
Sanjay Kasula
|

Updated on: Feb 27, 2023 | 9:35 PM

Share

ఈసారి వేసవి కాలం ఇప్పటికే వచ్చేసింది. ఇళ్లలో మూసి ఉంచిన ఏసీ ఇప్పుడు మళ్లీ మొదలైంది. ఇంతలో సోషల్ మీడియాలో ఓ చర్చ వైరల్‌గా మారింది. ఏసీలో టన్ను అంటే ఏంటో మీకు తెలుసా అని ఒక వినియోగదారు అడిగారు. ఈ ప్రశ్నకు సమాధానంగా, ప్రజలు చాలా విషయాలు రాస్తున్నారు. ఇక్కడ టన్ను అంటే ఏంటో తెలుసుకుందాం. నిజానికి టన్ను అంటే ఏంటి? అనేది మనలో చాలా మందికి వచ్చే ప్రశ్న.

వాస్తవానికి, ప్రజలు ఏసీ కొనడానికి లేదా అద్దెకు తీసుకురావడానికి వెళ్లినప్పుడు.. దుకాణదారు, షోరూమ్‌లో ఎన్ని టన్నుల ఏసీ కావాలని అడుగుతారు. ఇక్కడ టన్ను అంటే ఏంటి..? అది ఎలా పని చేస్తుందనేది మనలో చాలా మంది అయోమయం చెందుతారు. నిజానికి టన్ను అంటే ఏసీ సామర్థ్యం. ఏదైనా ఏసీ టన్ను ఒక గంటలో ఎయిర్ కండీషనర్ ద్వారా వెలికితీసే వేడిని తెలియజేస్తుంది.

ఏ ఏసీ ఎంత ఎక్కువ చల్లబరుస్తుంది లేదా ఏసీ శీతలీకరణ సామర్థ్యం టన్నుపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా చిన్న బెడ్‌రూమ్‌ల కోసం ఒక టన్ను ఏసీ సిఫార్సు చేయబడింది. అయితే పెద్ద విస్తీర్ణం గల గదులకు ఎక్కువ టన్ను అవసరం. అదే సమయంలో, టన్ను అంటే ఒక టన్ను ఏసీ ఒక రోజులో వెయ్యి కిలోల నీటిని మంచుగా మారుస్తుందని కూడా చెప్పబడింది.

ఈ విధంగా, నీటిని మంచుగా మార్చడానికి ఒక రోజులో నీటిని బయటకు తీయాల్సిన శక్తిని టన్ అంటారు. ప్ర స్తుతం దీనికి స మాధానాలన్నీ సోష ల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కానీ ఏ ఏసీ కెపాసిటీ మాత్రం టన్ అంటారు. ప్రస్తుతం వేసవి కాలం వచ్చిందంటే చాలు ఏసీలు వేసేందుకు జనం సన్నాహాలు చేసుకున్నారు.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్టింగ్ న్యూస్