MG Windsor EV: ఎంజీ మూడో ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది.. చూస్తే.. వావ్ ‘విండ్సర్’ అనాల్సిందే మరి..

ప్రపంచ దిగ్గజ కార్ల బ్రాండ్లలో ఒకటైన మోరిస్ గ్యారేజెస్(ఎంజీ) నుంచి కొత్త ఉత్పత్తి భారతీయ ఆటో మార్కెట్లో అడుగు పెట్టింది. ఎలక్ట్రిక్ వేరియంట్లో ఎంజీ దీనిని లాంచ్ చేసింది. ఈ ఈవీ పేరు ఎంజీ విండ్సర్. ఎంజీ బ్రాండ్ నుంచి వస్తున్న మూడో ఎలక్ట్రిక్ కారు ఇది. ఇంతకు ముందు ఎంజీ నుంచి కామెట్, జెడ్ఎస్ ఈవీలు మన దేశీయ మార్కెట్లో ఉన్నాయి.

MG Windsor EV: ఎంజీ మూడో ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది.. చూస్తే.. వావ్ ‘విండ్సర్’ అనాల్సిందే మరి..
Mg Windsor Ev
Follow us
Madhu

|

Updated on: Sep 12, 2024 | 3:22 PM

ప్రపంచ దిగ్గజ కార్ల బ్రాండ్లలో ఒకటైన మోరిస్ గ్యారేజెస్(ఎంజీ) నుంచి కొత్త ఉత్పత్తి భారతీయ ఆటో మార్కెట్లో అడుగు పెట్టింది. ఎలక్ట్రిక్ వేరియంట్లో ఎంజీ దీనిని లాంచ్ చేసింది. ఈ ఈవీ పేరు ఎంజీ విండ్సర్. ఎంజీ బ్రాండ్ నుంచి వస్తున్న మూడో ఎలక్ట్రిక్ కారు ఇది. ఇంతకు ముందు ఎంజీ నుంచి కామెట్, జెడ్ఎస్ ఈవీలు మన దేశీయ మార్కెట్లో ఉన్నాయి. కాగా ఈ కొత్త ఎంజీ విండ్సర్ ఈవీ ధర రూ. 9.9లక్షలు(ఎక్స్ షోరూం)గా ఉంది. అయితే ఈ ధర బ్యాటరీ రెంటల్ కాకుండా ఉంటుంది. దీనికి అధనంగా బ్యాటరీ రెంట్ కిలోమీటర్ కు రూ. 3.5గా ఉంటుంది. మీరు ఏడాదికి 50,000 కిలోమీటర్లు తిరిగినా.. అది మీకు రూ. 2లక్షల లోపే ఉంటుంది. ఈ మొత్తం మీరు కారు షోరూం ధరకు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ కారు మూడు ట్రిమ్ లలో, నాలుగు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. ఈ కారుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

ఎక్స్‌టీరియర్ ఇలా..

ఈ కారు వెలుపలి వైపున, విండ్సర్ సిగ్నేచర్ కౌల్, హెడ్‌ల్యాంప్‌ల వంటి డిజైన్ ఎలిమెంట్‌లను కలిగి ఉంటుంది. కారుకు 18-అంగుళాల క్రోమ్ అల్లాయ్ వీల్స్, ఫ్లోటింగ్ రూఫ్‌లైన్,పాప్-అవుట్ డోర్ హ్యాండిల్స్ ఉన్నాయి. వెనుక వైపు గ్లాస్‌హౌస్ కింద కనెక్ట్ చేసిన టెయిల్‌ల్యాంప్‌లు, క్రోమ్ గార్నిష్‌లను చూడవచ్చు.

ఇంటీరియర్ డిజైన్ ఇలా..

కారు లోపల క్యాబిన్‌ను లేత గోధుమరంగుపై నలుపు రంగుతో కలిపి ఇచ్చారు. సీట్లు క్విల్టెడ్ ప్యాటర్న్‌ను పొందుతాయి. మీరు కామెట్‌ కారులో పొందే ఓఎస్ నే ఇందులోని ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ లో వాడారు. ఇక్కడ 15.6-అంగుళాల భారీ డిస్‌ప్లే ముందు భాగంలో హైలైట్ గా నిలుస్తోంది. రెండవ వరుసకు వెళ్తే.. ప్రధాన హైలైట్ సీట్‌బ్యాక్, ఇది ఎలక్ట్రికల్‌గా 135 డిగ్రీల వరకు వంగి ఉంటుంది. ఇది బిజినెస్ క్లాస్ సీటింగ్ అనుభవాన్ని అందిస్తుంది. యూఎస్బీ చార్జింగ్ పోర్టులు, వెనుక వైపు ఏసీ వెంట్లు, కప్ హోల్డర్‌లతో కూడిన సెంటర్ ఆర్మ్‌రెస్ట్‌ను కూడా పొందుతారు. మీరు అదనపు యాక్సెసరీస్ తీసుకుంటే సీట్‌బ్యాక్ స్క్రీన్‌లను కూడా అందిస్తుంది.

ఎంజీ విండ్సర్ ఫీచర్లు ఇవి..

విండ్సర్ టాప్-స్పెక్ వేరియంట్‌లో, వైర్‌లెస్ ఫోన్ మిర్రరింగ్, వైర్‌లెస్ ఛార్జర్, 360-డిగ్రీ కెమెరా, వెనుక ఏసీ వెంట్‌లతో క్లైమేట్ కంట్రోల్, కనెక్ట్ చేసిన కార్ టెక్నాలజీ, రిక్లైనింగ్ రియర్ సీట్, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లను అందిస్తోంది. బహుళ భాషలలో వాయిస్ నియంత్రణ, జియోయాప్‌లు, కనెక్టివిటీ, టీపీఎంఎస్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఈబీడీతో కూడిన ఏబీఎస్, ఫుల్ ఎల్ఈడీ లైట్ ప్యాకేజీ ఉంటుంది.

పవర్ ట్రైన్..

ఎంజీ విండ్సర్ ఈవీ 38కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ తో ఉంటుంది. ఇది 331 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. ఇది 134బీహెచ్పీ/200ఎన్ఎం టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. దీనిలో ఎంజీ విండ్సర్ ఎకో, ఎకో ప్లస్, నార్మల్, స్పోర్ట్స్ నాలుగు డ్రైవ్ మోడ్ లను కలిగి ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!