MG Comet: స్టన్నింగ్ కలర్‌తో ఎంజీ కామెట్ నయా ఎడిషన్.. ధర ఎంతో తెలుసా?
భారతదేశంలో ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ముఖ్యంగా పెరుగుతున్న పెట్రోల్ ధరల దెబ్బకు సామాన్యూలు ఈవీ వాహనాల కొనుగోలుకు ముందుకు వస్తున్నారు. అయితే కార్ల విషయానికి వస్తే మైలేజ్ అనుమానాలతో పెద్దగా ఈవీ వాహనాల అమ్మకాలు సాగడం లేదు. ఇటీవల కాలంలో ప్రముఖ కంపెనీ ఎంజీ రిలీజ్ చేసిన కామెట్ ఫోర్ వీలర్ ఈవీ ప్రియులను ఆకర్షిస్తుంది.

ఎంజీ కంపెనీ తన కామెట్ ఈవీ కారుకు సంబంధించి బ్లాక్‌స్టార్మ్ ఎడిషన్‌ను తాజాగా భారతదేశంలో లాంచ్ చేసింది. ఈ ప్రత్యేక ఎడిషన్ టాప్-ఎండ్ ఎక్స్‌క్లూజివ్ వేరియంట్ ఆధారంగా రూపొందించారు. ఈ కారు ధర రూ. 7.80 లక్షలుగా ఉంది. కామెట్ బ్లాక్‌స్టార్మ్ కోసం ఇప్పటికే కంపెనీ బుకింగ్‌లు అనుమతి ఇచ్చింది. ఆమోదిత డీలర్ల ద్వారా రూ.11 వేలు చెల్లించి ఈ కారును ప్రీ బుక్ చేసుకోవచ్చు. సాధారణ ఎంజీ కామెట్ కంటే భిన్నంగా ఈ కారు ఉంది. స్పోర్టీ బ్లాక్ థీమ్‌తో చూడగానే ఆకర్షించే విధంగా ఈ కారు ఉంది. ఈ నేపథ్యంలో ఎంజీ కామెట్ బ్లాక్‌స్టార్మ్ ఎడిషన్‌కు సంబంధించిన ముఖ్య వివరాలను తెలుసుకుందాం.
ఎంజీ కామెట్ ప్రత్యేక ఎడిషన్ ‘స్టార్రీ నైట్’ కలర్ స్కీమ్‌లో ఫాగ్ ల్యాంప్స్, ఫ్రంట్ బంపర్, స్కిడ్ ప్లేట్ చుట్టూ ఎరుపు రంగు డిటేలింగ్‌తో చూడగానే ఆకర్షించే విధంగా రూపొందించారు. అలాగే ఈ కారు బోనెట్‌పై ఎంజీ బ్యాడ్జింగ్, ఫెండర్‌పై ‘బ్లాక్‌స్టార్మ్’ బ్యాడ్జ్ ఉన్నాయి. సైడ్ ప్రొఫైల్ స్టీల్ వీల్స్ కోసం ఆల్-బ్లాక్ వీల్ కవర్ల ద్వారా అప్‌డేట్ చేశారు. ఈ కారు డాష్‌బోర్డ్ థీమ్ మారకుండానే (తెలుపు, బూడిద రంగు) ఉన్నప్పటికీ సీట్లు కాంట్రాస్ట్ రెడ్ స్టిచింగ్‌తో కొత్త బ్లాక్ అప్హోల్స్టరీతో రిలీజ్ చేశారు. అలాగే హెడ్‌రెస్ట్‌లపై ‘బ్లాక్‌స్టార్మ్’ బ్యాడ్జ్‌లతో ఆకర్షణీయంగా ఉన్నాయి.
ఎంజీ కామె బ్లాక్ స్టార్మ్ ఎడిషన్ కారు ఇంటీరియర్ విషయంలో పెద్దగా ఎలాంటి మార్పులు చేయలేదు. ఎంజీ కామెట్ బ్లాక్‌స్టార్మ్ 4 స్పీకర్ సౌండ్ సిస్టమ్, మాన్యువల్ ఏసీ, 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25 అంగుళాల డ్రైవర్ డిస్ప్లే, మల్టీ ఎయిర్‌బ్యాగ్‌లు, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, సెన్సార్‌లతో కూడిన బ్యాక్ పార్కింగ్ కెమెరా, హిల్ హోల్డ్ అసిస్ట్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి పీచర్లతో వస్తుంది. ఈ కారు సాధారణ వెర్షన్ మాదిరిగానే 17.3 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ద్వారా 42 బీహెచ్‌పీ శక్తిని, 110 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఎంజీ కామెట్ ఈవీ కారు ఓ సారి ఛార్జ్ చేస్తే 230 కిలో మీటర్ల మైలేజ్‌ను ఇస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








