Apaar ID Card: విద్యార్థులకూ ప్రత్యేక ఐడీ నెంబర్.. ఆధార్‌తో పొందడం చాలా సులువు
ప్రస్తుత రోజుల్లో పెరుగుతున్న టెక్నాలజీ నేపథ్యంలో ప్రతి రంగంలో కొత్త సదుపాయాలు అందుబాటులోకి వస్తున్నాయి. ముఖ్యంగా డిజిటల్ ఇండియాలో భాగంగా జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) 2020 కింద విద్యా మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం అపార్ ఐడీ కార్డును ప్రవేశపెట్టాయి. అపార్ ఐడీ అనేది దేశవ్యాప్తంగా విద్యార్థులకు వారి విద్యా రికార్డులతో ఇతర వివరాలు తెలుసుకునేలా ఇచ్చే ప్రత్యేక గుర్తింపు సంఖ్య.

అపార్ ఐడీను వన్ నేషన్ వన్ స్టూడెంట్ ఐడి కార్డ్‌గా పేర్కొంటూ ఉంటారు. ముఖ్యంగా విద్యార్థి విద్యా పురోగతిని పర్యవేక్షించడాన్ని సులభతరం చేస్తుంది. అలాగే విద్యార్థి ఒక విద్యా సంస్థ నుంచి మరొక విద్యా సంస్థకు సజావుగా మారడానికి కూడా సహాయపడుతుంది. అపార్ ఐడీ కార్డు విద్యా, వ్యక్తిగత డేటాను కలిగి ఉంటుంది. అపార్ ఐడీ అనేది ఆటోమేటెడ్ పర్మనెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ. ఈ కార్డు దేశవ్యాప్తంగా పాఠశాల, కళాశాల, విశ్వవిద్యాలయ విద్యార్థులకు ప్రత్యేకమైన ఐడీ నంబర్‌లను అందిస్తుంది. ముఖ్యంగా విద్యా రికార్డులను డిజిటలైజ్ చేయడంతో కీలకపాత్ర పోషిస్తుంది.
వన్ నేషన్ వన్ స్టూడెంట్ ఐడి కార్డు ద్వారా విద్యార్థికి సంబంధిచి మొత్తం స్టూడెంట్ హిస్టరీను అంటే చదువు వివరాలు, విద్యా స్కోర్‌లు, బహుమతులు ఇతర వివరాలను నమోదు చేసే ఓ ప్రత్యేక ఐడీ కార్డు. అపార్ ఐడీ కార్డు ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు డిజిటల్ గుర్తింపుగా పని చేస్తుంది. విద్యా రికార్డులు, క్రెడిట్‌లు, డిగ్రీలకు క్రమబద్ధమైన ప్రాప్యతను అందిస్తుంది. అపార్ ఐడీ కార్డును డిజిటలైజ్ చేసి కేంద్రీకరించవచ్చు. అంటే విద్యార్థి విద్యా రికార్డులు ఒకే చోట సురక్షితంగా అందుబాటులో ఉంటాయి. విద్యార్థులు స్కాలర్‌షిప్‌లు, అవార్డులు, బహుమతులు, ఇతర ధ్రువపత్రాలు వంటి వాటి భౌతిక కాగితపు పత్రాల ఇబ్బంది లేకుండా పొందవచ్చు.అపార్ ఐడీ అనేది ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్య. ఇది ఆధార్ కార్డు మాదిరి జీవితంలో ఓ సారి మాత్రమే పొందవచ్చు.
అపార్ రిజిస్ట్రేషన్ ఇలా
- అపార్ రిజిస్ట్రేషన్ కోసం అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ (ఏబీసీ) బ్యాంక్ వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
- అక్కడ మై అకౌంట్‌పై క్లిక్ చేసి, విద్యార్థి అనే ఎంపికను ఎంచుకోవాలి.
- మీ ఆధార్ నంబర్, ఇతర అవసరమైన వివరాలతో డిజిలాకర్‌లో నమోదు చేసుకోవాలి.
- డిజిలాకర్‌లోకి లాగిన్ అయి కేవైసీ ధ్రువీకరణ కోసం ఆధార్ వివరాలను పంచుకోవడానికి సమ్మతిని అందించాలి.
- పాఠశాల పేరు, తరగతి, కోర్సు వివరాలతో సహా విద్యా సమాచారాన్ని నమోదు చేయాలి.
- వివరాలన్నీ సమర్పించాక మీ అపార్ ఐడీ కార్డు కార్డ్ జనరేట్ అవుతుంది.
- రిజిస్ట్రేషన్ ప్రక్రియ తర్వాత అపార్ ఐడీ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








