March Bank Holidays: బ్యాంకు కస్టమర్లకు అలర్ట్.. మార్చి నెలలో ఎన్ని రోజులు బ్యాంకులు మూసి ఉంటాయో తెలుసా?
March Bank Holidays: బ్యాంకులకు సెలవులు ఉన్నప్పటికీ ఆన్‌లైన్ లావాదేవీలు, ఇతర ఆర్థికపరమైన పనులకు ఎలాంటి ఆటంకం ఉండదు. మార్చిలో 14 రోజులపాటు బ్యాంకులకు సెలవులు ఉన్నప్పటికీ, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ సేవలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయి. అలాగే యూపీఐ, ఏటీఎం సేవలకు ఎలాంటి అంతరాయం ఉండదు..

ప్రతినెల బ్యాంకులకు సెలవులు ఉంటాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతినెలలో బ్యాంకుల సెలవుల జాబితాను విడుదల చేస్తుంటుంది. అయితే బ్యాంకు పనులు చేసుకునే వారు ప్రతి నెల ఏయే రోజుల్లో బ్యాంకులకు సెలవు ఉంటుందన్న విషయాన్ని ముందస్తుగా గుర్తించి ప్లాన్ చేసుకోవడం చాలా ముఖ్యం. మరి ఫిబ్రవరి నెల ముగియనుంది. మార్చి నెల రానుంది. వచ్చే నెలలో ఏయే రోజుల్లో బ్యాంకులకు సెలవు ఉంటుందో చూద్దాం.
- మార్చి 2 (ఆదివారం): సాధారణంగా దేశ వ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.
- మార్చి 5 (బుధవారం): పంచాయతీ రాజ్ దివస్ సందర్భంగా ఒడిశా, పంజాబ్, సిక్కిం రాష్ట్రాల్లోని బ్యాంకులకు సెలవు.
- మార్చి 7 (శుక్రవారం): చాప్చర్ కుట్ పండుగ. మిజోరంలోని బ్యాంకులు మూసి ఉంటాయి.
- మార్చి 8 (శనివారం): రెండో శనివారం సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు.
- మార్చి 9 (ఆదివారం): సాధారణంగా దేశ వ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.
- మార్చి 13 (గురువారం): హోలీకా దహన్ సందర్భంగా డెహ్రాడూన్, రాంచి, కాన్పూర్, లక్నో లోని బ్యాంకులకి సెలవు.
- మార్చి 14 (శుక్రవారం): హోలీ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకులకు సెలవు.
- మార్చి 16 (ఆదివారం): ఈ రోజుల దేశ వ్యాప్తంగా బ్యాంకులు మూసి ఉంటాయి.
- మార్చి 22 (శనివారం): బీహార్ డే సందర్భంగా బిహార్‌లోని బ్యాంకులకు సెలవు.
- మార్చి 23 (ఆదివారం): భగత్‌సింగ్ వర్థంతి, సహీద్ దివస్ కూడా ఈ రోజే.
- మార్చి 25 (మంగళవారం): డోల్ జాత్రా పండగ. అసోం, బంగాల్, జమ్మూకశ్మీర్, దిల్లీలో; ధులండి సందర్భంగా రాజస్థాన్‌లోని బ్యాంకులు మూసి ఉంటాయి.
- మార్చి 28 (శుక్రవారం): జమాత్-ఉల్-విదా సందర్భంగా ఛత్తీస్‌గఢ్‌లో, షబ్-ఎ-ఖద్ర్ పండగ సందర్భంగా జమ్మూకశ్మీర్‌లోని బ్యాంకులకు సెలవు.
- మార్చి 30 (ఆదివారం): ఉగాది పండగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకల్లో బ్యాంకులకు సెలవు. మహారాష్ట్రలో గుడి పడ్వా చేసుకుంటారు. ఇక్కడ కూడా బ్యాంకులు మూసి ఉంటాయి.0
- మార్చి 31 (సోమవారం): ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులకు సెలవు.
అయితే బ్యాంకులకు సెలవులు ఉన్నప్పటికీ ఆన్‌లైన్ లావాదేవీలు, ఇతర ఆర్థికపరమైన పనులకు ఎలాంటి ఆటంకం ఉండదు. మార్చిలో 14 రోజులపాటు బ్యాంకులకు సెలవులు ఉన్నప్పటికీ, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ సేవలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయి. అలాగే యూపీఐ, ఏటీఎం సేవలకు ఎలాంటి అంతరాయం ఉండదు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




