AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Benz EQB: భారత మార్కెట్లోకి బెంజ్‌ ఎలక్ట్రిక్‌ కారు.. స్టన్నింగ్ లుక్‌, దుమ్మురేపే ఫీచర్స్‌.. ధర ఎంతో తెలిస్తే మాత్రం..

ప్రస్తుతం మార్కెట్లో ఎలక్ట్రిక్‌ కార్ల హవా నడుస్తోంది. ప్రభుత్వాలు పెద్ద ఎత్తున రాయితీలు కల్పిస్తున్న తరుణంలో ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ ఊపందుకుంటోంది. ఇప్పటికే చాలా వరకు బడా ఆటోమొబైల్ కంపెనీలు మార్కెట్లోకి ఎలక్ట్రిక్‌ కార్లను తీసుకొచ్చిన విషయం తెలిసిందే...

Benz EQB: భారత మార్కెట్లోకి బెంజ్‌ ఎలక్ట్రిక్‌ కారు.. స్టన్నింగ్ లుక్‌, దుమ్మురేపే ఫీచర్స్‌.. ధర ఎంతో తెలిస్తే మాత్రం..
Benz Eqb
Narender Vaitla
|

Updated on: Dec 03, 2022 | 7:06 AM

Share

ప్రస్తుతం మార్కెట్లో ఎలక్ట్రిక్‌ కార్ల హవా నడుస్తోంది. ప్రభుత్వాలు పెద్ద ఎత్తున రాయితీలు కల్పిస్తున్న తరుణంలో ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ ఊపందుకుంటోంది. ఇప్పటికే చాలా వరకు బడా ఆటోమొబైల్ కంపెనీలు మార్కెట్లోకి ఎలక్ట్రిక్‌ కార్లను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ జాబితాలోకి లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్‌ బెంజ్‌ కూడా వచ్చి చేరింది. ఈ కంపెనీ ‘ఈక్యూబి’ పేరుతో భారత్‌లోకి కొత్త ఎలక్ట్రిక్‌ కారును లాంచ్‌ చేసింది. ఇప్పటికే బుకింగ్‌లను కూడా ప్రారంభించింది. రూ. లక్షన్నర చెల్లించి కారును ముందస్తుగా బుక్‌ చేసుకోవాలని కంపెనీ తెలిపింది.

మెర్సిడెస్ బెంజ్ ఈక్యూబి 300, మెర్సిడెస్ బెంజ్ ఈక్యూబి 350 అనే రెండు వేరియంట్లలో కారును లాంచ్‌ చేశారు. ఈ ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ కారులో 66.5kWh బ్యాటరీని అందించారు. ఏసీ, డీసీ ఛార్జింగ్ సపోర్ట్‌ చేస్తుంది. కేవలం 32 నిమిషాల్లోనే 10 నుంచి 80 శాతం ఛార్జ్‌ అవుతుంది. బ్యాటరీ మీద 8 ఏళ్లు వారంటీని అందిస్తున్నారు. ఒక్కసారి బ్యాటరీని ఛార్జ్‌ చేస్తే నిర్విరామంగా 423 కి.మీలు ప్రయాణిస్తుంది. 11 కిలోవాట్ ఏసీ ఛార్జర్‌తో కేవలం 6.25 గంటల్లోనే ఫుల్ ఛార్జ్‌ అవుతుంది.

ఇదిలా ఉంటే ఈ కారులో ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, బ్లాంక్డ్ ఆఫ్ గ్రిల్, స్పిట్ ఎల్‌ఈడీ టెయిల్ లైట్లు, 18-అంగుళాల అల్లాయ్ వీల్స్, పవర్డ్ టెయిల్‌గేట్, వైర్‌లెస్ ఛార్జింగ్ యూఎస్‌బీ టైప్‌సీ పోర్ట్‌లు, పనోరమిక్ సన్‌రూఫ్తో పాటు 10.25 ఇంచెస్‌ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌, ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్స్‌ లాంటి ఫీచర్లు అందించారు. ఇక ఈ కారు ధర విషయానికొస్తే ఇండియా ఎక్స్‌ షోరూమ్‌ ప్రైజ్‌ రూ. 74.50 లక్షలుగా నిర్ణయించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి