AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MEIL: న్యూక్లియర్ పవర్ రంగంలోకి ఎంఈఐఎల్.. రూ.13 వేల కోట్ల ఈపీసి కాంట్రాక్ట్ దక్కించుకున్న మేఘా ఇంజనీరింగ్

కర్ణాటక రాష్ట్రంలోని కైగా వద్ద 14 వందల మెగా వాట్ ఎలక్ట్రికల్ (ఎండబ్ల్యూఈ )అణు విద్యుత్ కేంద్ర నిర్మాణానికి న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ అఫ్ ఇండియా (ఎన్పీసిఐఎల్ ) పిలిచిన టెండర్లలో మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రుక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) అగ్రస్థానంలో నిలిచింది. ఈ పీసి పద్దతిలో నిర్మించే ఈ అణువిద్యుత్ కేంద్ర.

MEIL: న్యూక్లియర్ పవర్ రంగంలోకి ఎంఈఐఎల్.. రూ.13 వేల కోట్ల ఈపీసి కాంట్రాక్ట్ దక్కించుకున్న మేఘా ఇంజనీరింగ్
Meil
Subhash Goud
|

Updated on: Jun 26, 2024 | 6:49 PM

Share

కర్ణాటక రాష్ట్రంలోని కైగా వద్ద 14 వందల మెగా వాట్ ఎలక్ట్రికల్ (ఎండబ్ల్యూఈ )అణు విద్యుత్ కేంద్ర నిర్మాణానికి న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ అఫ్ ఇండియా (ఎన్పీసిఐఎల్ ) పిలిచిన టెండర్లలో మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రుక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) అగ్రస్థానంలో నిలిచింది. ఈ పీసి పద్దతిలో నిర్మించే ఈ అణువిద్యుత్ కేంద్ర నిర్మాణ భారీ కాంట్రాక్టును మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రుక్చర్స్ లిమిటెడ్ (ఎం ఈ ఐ ఎల్ ) చేజిక్కించుకుంది. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని అణు ఇంధనశాఖ పరిధిలోని ఎన్పీసిఐఎల్ ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్ (ఈపీసి) పద్దతిలో ఈ రియాక్టర్ల నిర్మాణానికి గత ఏడాది మే నెలలో టెండర్లు పిలిచింది.

అదే ఏడాది అక్టోబర్ 4న టెండర్ల దాఖలుకు తుది గడువుగా నిర్ణయించారు. ఆ తరువాత రోజు అక్టోబర్ 5న సాంకేతిక బిడ్లను తెరిచారు. ఈ ఏడాది జూన్ 26న (బుధవారం) ప్రైస్ బిడ్లను తెరిచారు. ఈ బిడ్ లో తక్కువ ధరను కోట్ చేసి ఎం ఈ ఐ ఎల్ తొలిస్థానంలో నిలిచినట్లు సంస్థ డైరెక్టర్ సి హెచ్ సుబ్బయ్య తెలిపారు. ఈ టెండర్ ప్రక్రియలో ఎల్అండ్‌టీ, బీహెచ్ఈఎల్ కూడా పాల్గొన్నాయి. ఈ రెండు, సంస్థలు ఎక్కువ ధరను కోట్ చేసి రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఎం ఈ ఐ ఎల్ రూ 12,799. 92 కోట్ల ధరను కోట్ చేసి మొదటి స్థానంలో నిలిచింది.

టెండర్ల విధానంలో ఎన్‌పీసీఐఎల్‌ క్వాలిటీ కం కాస్ట్ బేస్డ్ (క్యూ సి బి ఎస్ ) విధానాన్ని ప్రవేశ పెట్టింది. ఈ సంస్థ పిలిచిన టెండర్లలో ఇదే పెద్దది. టెండర్ ఖరారుకు ముందు ఎన్పీసీఐఎల్‌ నాణ్యతా ప్రమాణాలు, ఖర్చు నియంత్రణ ఇతర అంశాలపై అంచనాలు వేసింది. 13 వేల కోట్ల విలువ కలిగిన కాంట్రాక్టు ను ఎం ఈ ఐ ఎల్ తొలిసారిగా దక్కించుకుని అణు ఇంధన రంగంలోకి ప్రవేశించిందని ఎంఈఐఎల్‌ డైరెక్టర్‌ సుబ్బయ్య తెలిపారు. ఇది తమ సంస్థ ప్రయాణంలో ఒక మైలు రాయి అని ఆయన తెలిపారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్