AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Alto K10: దేశంలోనే అత్యంత చవకైన కారు ఆల్టో కె10పై దీపావళి బంపర్‌ ఆఫర్

మారుతీ సుజుకి ఇండియా తన కార్లపై నవరాత్రి, దీపావళి తగ్గింపు ఆఫర్లను తీసుకువచ్చింది. దీని ఎంట్రీ లెవల్ ఆల్టో కె10 కూడా ఈ జాబితాలో చేర్చింది. దేశంలోనే అత్యంత చవకైన కారు కూడా ఇదే. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.3.99 లక్షలు మాత్రమే. ఈ నెలలో కంపెనీ ఈ కారుపై రూ.35,000 నుండి రూ.52,000 వరకు డిస్కౌంట్లు, ఇతర..

Alto K10: దేశంలోనే అత్యంత చవకైన కారు ఆల్టో కె10పై దీపావళి బంపర్‌ ఆఫర్
Maruti Suzuki Alto K10
Subhash Goud
|

Updated on: Oct 05, 2024 | 11:58 AM

Share

మారుతీ సుజుకి ఇండియా తన కార్లపై నవరాత్రి, దీపావళి తగ్గింపు ఆఫర్లను తీసుకువచ్చింది. దీని ఎంట్రీ లెవల్ ఆల్టో కె10 కూడా ఈ జాబితాలో చేర్చింది. దేశంలోనే అత్యంత చవకైన కారు కూడా ఇదే. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.3.99 లక్షలు మాత్రమే. ఈ నెలలో కంపెనీ ఈ కారుపై రూ.35,000 నుండి రూ.52,000 వరకు డిస్కౌంట్లు, ఇతర ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ వేరియంట్‌లపై అధిక తగ్గింపులు ఉన్నాయి. ఇది మాత్రమే కాదు, కంపెనీ కస్టమర్లకు 5000 రూపాయల స్క్రాపేజ్ బోనస్‌ను కూడా ఇస్తోంది.

మారుతి ఆల్టో కె10 ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లు

ఆల్టో K10 కారు కంపెనీ అప్‌డేట్ చేసిన ప్లాట్‌ఫారమ్ Heartect ఆధారంగా రూపొందించింది. ఈ హ్యాచ్‌బ్యాక్ కొత్త-జెన్ K-సిరీస్ 1.0L డ్యూయల్ జెట్, డ్యూయల్ VVT ఇంజన్‌ను కలిగి ఉంది. ఈ ఇంజన్ 49kW(66.62PS)@5500rpm, గరిష్ట టార్క్ 89Nm@3500rpm వద్ద ఉత్పత్తి చేస్తుంది. దాని ఆటోమేటిక్ వేరియంట్ 24.90 km/l మైలేజీని ఇస్తుందని, మాన్యువల్ వేరియంట్ 24.39 km/l మైలేజీని ఇస్తుందని కంపెనీ పేర్కొంది. దాని CNG వేరియంట్ మైలేజ్ 33.85 kmpl.

ఇవి కూడా చదవండి

ఆల్టో కె10లో 7 అంగుళాల ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. S-Presso, Celerio, Wagon-Rలలో కంపెనీ ఇప్పటికే ఈ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను అందించింది. ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కాకుండా, ఈ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ యూఎస్‌బీ, బ్లూటూత్, ఆక్స్ కేబుల్‌ను కూడా సపోర్ట్ చేస్తుంది. స్టీరింగ్ వీల్‌కు కూడా కొత్త డిజైన్ అందించింది. ఇందులో, ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మౌంటెడ్ కంట్రోల్ స్టీరింగ్‌పైనే అందించింది కంపెనీ.

ఈ హ్యాచ్‌బ్యాక్ ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (EBD), రివర్స్ పార్కింగ్ సెన్సార్‌తో పాటు యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS)ని పొందుతుంది. దీనితో పాటు, ఆల్టో కె10 ప్రీ-టెన్షనర్ మరియు ఫోర్స్ లిమిట్ ఫ్రంట్ సీట్ బెల్ట్‌ను పొందుతుంది. ఇది సురక్షితమైన పార్కింగ్ కోసం రివర్స్ పార్కింగ్ సెన్సార్లతో కూడా అందుబాటులో ఉంటుంది. కారులో స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్, హై స్పీడ్ అలర్ట్‌తో పాటు అనేక ఇతర భద్రతా ఫీచర్లు కూడా ఉన్నాయి. మీరు దీన్ని 6 రంగు ఎంపికలలో స్పీడీ బ్లూ, ఎర్త్ గోల్డ్, సిజ్లింగ్ రెడ్, సిల్కీ వైట్, సాలిడ్ వైట్, గ్రానైట్ గ్రేలో కొనుగోలు చేయవచ్చు.

ఇది కూడా చదవండి: Gold Price Increase: యుద్ధ సమయంలో రూ.26 వేలు పెరిగిన బంగారం ధర.. కారణం ఏంటంటే..

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి