Maruti EV Car: త్వరలోనే మార్కెట్‌లోకి మారుతీ ఈవీ కారు.. రిలీజ్ ఎప్పుడంటే..?
భారతదేశంలో ప్రముఖ కార్ల తయారీ కంపెనీ అయిన మారుతీ సుజుకి ఇండియా లిమిటెడ్ ఈవీఎక్స్ పేరుతో భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లోకి ప్రవేశించనుంచింది. ఈ కాన్సెప్ట్ వెర్షన్ మొదట ఆటో ఎక్స్పో 2023లో ప్రదర్శించారు. అయితే ఈ కార్ల ప్రొడక్షన్ వెర్షన్ మాత్రం 2025 మధ్యలో ప్రారంభిస్తారని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

భారతదేశంలో ప్రముఖ కార్ల తయారీ కంపెనీ అయిన మారుతీ సుజుకి ఇండియా లిమిటెడ్ ఈవీఎక్స్ పేరుతో భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లోకి ప్రవేశించనుంచింది. ఈ కాన్సెప్ట్ వెర్షన్ మొదట ఆటో ఎక్స్పో 2023లో ప్రదర్శించారు. అయితే ఈ కార్ల ప్రొడక్షన్ వెర్షన్ మాత్రం 2025 మధ్యలో ప్రారంభిస్తారని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఈవీ కార్లు ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉంది. మారుతీ సుజుకీ ఈవీఎక్స్ కార్లను భారతదేశంలో తయారు చేసి, దేశీయంగా అందుబాటులో ఉంచి, అనంతరం ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేసే అవకాశం ఉంది. ఇటీవల మారుతి ఈవీఎక్స్‌కు సంబంధించి టెస్ట్ మ్యూల్ భారతీయ రోడ్లపై పరీక్షిస్తున్నప్పుడు గుర్తించారు. కాబట్టి మారుతీ సుజుకీ ఈవీఎక్స్‌కు సంబంధించిన మరిన్ని విషయాలను తెలుసుకుందాం.
వైరల్ అవుతున్న వీడియోలో ఎలక్ట్రిక్ ఎస్‌యూవీను గుర్తించవచ్చు. ఇది కొలతల పరంగా గ్రాండ్ విటారాకు చాలా దగ్గరగా కనిపిస్తుంది. అయితే ఈవీఎక్స్ కొత్త ఆల్-ఎలక్ట్రిక్ ప్లాట్‌ఫారమ్ పై ఆధారపడినందున ఆఫర్లో క్యాబిన్ స్థలం గ్రాండ్ విటారా కంటే మెరుగ్గా ఉంటుందని భావిస్తున్నారు. కొత్త ప్లాట్‌ఫారమ్ ఎలక్ట్రిక్ స్కేట్ బోర్డ్ ప్లాట్ ఫారమ్‌గా ఉంటుంది. ముఖ్యంగా ఈ కారులో ఫ్లోర్బోర్డ్ బ్యాటరీలను కలిగి ఉంటుంది. ఇది క్యాబిన్ లోపల ఉన్నవారి కోసం స్థలాన్ని తెరవడంలో సహాయపడుతుంది.
మారుతీ ఈవీఎక్స్ బ్యాటరీ ప్యాక్ విషయానికి వస్తే సుమారు 60 కేడబ్ల్యూహెచ్‌తో వస్తుంది. అలాగే ఈ కారు క్లెయిమ్ చేసిన పరిధి 550 కిలోమీటర్లుగా ఉంటుంది. మారుతి సుజుకి తక్కువ శ్రేణితో చిన్న బ్యాటరీ ప్యాక్‌ను అందించే అవకాశం కూడా ఉంది కొలతల పరంగా మారుతి సుజుకి ఈవీఎక్స్ పొడవు 4,300 ఎంఎం, వెడల్పు 1,800 ఎంఎంతో వస్తుంది. వీల్ బేస్ పరిమాణం, గ్రౌండ్ క్లియరెన్స్‌ను మారుతి సుజుకి వెల్లడించలేదు. ఈవీఎక్స్ ప్రొడక్షన్ వెర్షన్ కాన్సెప్ట్ వెర్షన్ నుంచి చాలా భిన్నంగా కనిపిస్తుంది. వీ ఆకారపు హెడ్ ల్యాంప్‌ల స్థానంలో ఎల్ఈడీ ప్రొజెక్టర్ యూనిట్లతో సరళంగా కనిపించే హెడ్‌ల్యాంప్‌లు ఆకర్షణీయంగా ఉన్నాయి. వెనుక వైపున ఎల్ఈడీ లైట్‌బార్‌లో సొగసైన టెయిల్ ల్యాంప్ సెటప్ వస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








