AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

FMCG Companies: కొత్త ఆలోచనలు చేస్తున్న ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు.. ధరలు పెంచకుండా క్వాంటిటీ తగ్గిస్తున్నాయి..

దేశంలో పెరుగుతున్న ధరలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గుతోంది. దీంతో ఎఫ్‌ఎంసీజీ(FMCG) కంపెనీలు అమ్మకాలు తగ్గుతున్నాయి...

FMCG Companies: కొత్త ఆలోచనలు చేస్తున్న ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు.. ధరలు పెంచకుండా క్వాంటిటీ తగ్గిస్తున్నాయి..
Groceries
Srinivas Chekkilla
|

Updated on: May 22, 2022 | 5:03 PM

Share

దేశంలో పెరుగుతున్న ధరలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గుతోంది. దీంతో ఎఫ్‌ఎంసీజీ(FMCG) కంపెనీలు అమ్మకాలు తగ్గుతున్నాయి. దీంతో కంపెనీలు కొత్త ఆలోచనలు చేస్తున్నాయి. ధరలు పెంచకుండా ప్యాకెట్లలో సరకు పరిమాణాన్ని తగ్గిస్తున్నాయి. ఇటీవల పలు కంపెనీలు నూడుల్స్‌(noodles), సబ్బులు(Soaps), చిప్స్‌(Chips), బిస్కెట్లు(biscuits), చాక్లెట్లు(chocolates) వంటి ఉత్పత్తుల ధరలను కొనసాగించడానికి పరిమాణం తగ్గించేశాయి. ప్రకటనలు, మార్కెటింగ్‌ ఖర్చులు, కొత్త ఉత్పత్తుల విడుదల వాయిదా వేయడం వంటివి చేస్తున్నాయి. ధరల పెరుగుదల ధాటికి సామాన్యుడు బెంబేలెత్తుతున్నాడు. ఇదే సమయంలో ముడివస్తువుల ధరలు భారీగా పెరిగినా, ఆ భారం మొత్తాన్ని వినియోగదారులకు బదిలీ చేస్తే విక్రయాలు క్షీణిస్తాయనే భావనతో తయారీ కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను కొంతమేర పెంచుతున్నాయి. ఫలితంగా కంపెనీల మార్జిన్‌లు పడిపోయినట్లు మార్చి త్రైమాసిక ఫలితాల్లో స్పష్టమైంది.

తయారీ, సరకు రవాణా, ప్యాకేజింగ్‌ వ్యయాలు అధికమైనందున ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు ఇప్పటికే సబ్బుల నుంచి వంట నూనెలు, బిస్కెట్‌ల వరకు అన్నింటి ధరలు ఎంతో కొంత పెంచాయి. ఎఫ్‌ఎమ్‌సీజీ ఉత్పత్తుల తయారీలో పామాయిల్‌ కీలక ముడి పదార్థం. ఈ ధర కనుక కాస్త తగ్గితే, కంపెనీలకు ఉపశమనం కలుగుతుంది. సాధారణంగా ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు గ్రామీణ, సామాన్య వినియోగదారులే లక్ష్యంగా తక్కువ ధర, చిన్న పరిమాణంలో తమ ఉత్పత్తుల ప్యాకెట్‌లను విక్రయిస్తాయి. పట్టణాలు, నగరాల్లో తలసరి ఆదాయం అధికంగా ఉండటం వల్ల వినియోగదారుల కొనుగోలు శక్తి ఎక్కువగానే ఉంటుంది. ఇక్కడ పెద్ద ప్యాకెట్లు ఎక్కువగా అమ్ముడుపోతాయి. అయితే ధరల పెరుగుదలతో ఇంటి బడ్జెట్‌ను అదుపులో ఉంచేందుకు పట్టణ వినియోగదారులూ ప్రయత్నిస్తున్నారు.

ఒకేసారి పెద్ద ప్యాకెట్‌ కొనుగోలు చేయకుండా.. తక్కువ యూనిట్‌ ధర ఉండే చిన్న ప్యాక్‌లకు మొగ్గుచూపుతున్నారు. కంపెనీలు చిన్న ప్యాకెట్ల ధరలు పెంచకుండా.. వాటిలో సరకు పరిమాణం తగ్గిస్తున్నాయి. రూ.1, రూ.5, రూ.10 వంటి ధరల్లోనే ఆయా ఉత్పత్తులను అందించేందుకు ఇలా చేస్తున్నాయి. కొన్ని పెద్ద ప్యాక్‌లపై ధరలు పెంచడంతో పాటు సరికొత్తగా మధ్యశ్రేణి ప్యాక్‌లను తీసుకొస్తున్నాయి. వ్యయాల నియంత్రణకు ఎఫ్‌ఎమ్‌సీజీ దిగ్గజాలు హెచ్‌యూఎల్‌, మారికో, డాబర్‌, ఇమామీ, బ్రిటానియా ఇండస్ట్రీస్‌లు తీవ్రంగా కష్టపడుతున్నాయి. చిన్నవి, పెద్ద ప్యాక్‌ల మధ్యలో సరికొత్త బరువులో ప్యాక్‌లను ఆవిష్కరిస్తున్నట్లు హిందుస్థాన్‌ యునిలీవర్‌ చెబుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్‌ వార్తలకు ఇక్కడ క్లిక్ చేయండి…

Follow Us
దేశం కోసం యూనిఫామ్ వేసిన ధోనీ..గౌరవ పదవికి ఇచ్చే జీతం ఎంతో తెలుసా
దేశం కోసం యూనిఫామ్ వేసిన ధోనీ..గౌరవ పదవికి ఇచ్చే జీతం ఎంతో తెలుసా
కిడ్నీలో రాళ్లున్నా పాలు తాగడం సురక్షితమా? నిజం తెలుసుకుంటే..
కిడ్నీలో రాళ్లున్నా పాలు తాగడం సురక్షితమా? నిజం తెలుసుకుంటే..
నాలుగు నెలల క్రితం భర్తను చంపి ఇంట్లోనే పూడ్చిపెట్టిన భార్య..
నాలుగు నెలల క్రితం భర్తను చంపి ఇంట్లోనే పూడ్చిపెట్టిన భార్య..
బంగారం ఈ టైమ్‌లో అమ్మితే డబ్బే డబ్బు
బంగారం ఈ టైమ్‌లో అమ్మితే డబ్బే డబ్బు
హైదరాబాదీలకు అలర్ట్.. మీరు తినే ఉస్మానియా బిస్కెట్లలో విషం..
హైదరాబాదీలకు అలర్ట్.. మీరు తినే ఉస్మానియా బిస్కెట్లలో విషం..
సీఎంలతో ప్రధాని మోదీ కీలక భేటీ.. ఇంధన భద్రతపై భరోసా..
సీఎంలతో ప్రధాని మోదీ కీలక భేటీ.. ఇంధన భద్రతపై భరోసా..
ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ ఎన్నిసార్లు మార్చుకోవచ్చు..?
ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ ఎన్నిసార్లు మార్చుకోవచ్చు..?
యూట్యూబ్‌ను ఊపేస్తున్న 'కోసింది కొయగూర' సాంగ్
యూట్యూబ్‌ను ఊపేస్తున్న 'కోసింది కొయగూర' సాంగ్
లోకేష్‌ ఇంట్లో దొరికిన AK47.. కట్ చేస్తే దిమ్మతిరిగే ట్విస్ట్
లోకేష్‌ ఇంట్లో దొరికిన AK47.. కట్ చేస్తే దిమ్మతిరిగే ట్విస్ట్
ఆ వీడియో బయటికి తీసి నాపై కుట్ర చేస్తున్నారు.. యాంకర్ ఎమోషనల్

ధురంధర్‌ను కూడా వెనక్కి నెట్టిన ప్రియాంక సినిమా
ధురంధర్‌ను కూడా వెనక్కి నెట్టిన ప్రియాంక సినిమా
సిగరెట్ తాగుతూ శ్లోకాలు పఠించడంపై బేషరతు క్షమాణ చెప్పిన మ్యాడీ
సిగరెట్ తాగుతూ శ్లోకాలు పఠించడంపై బేషరతు క్షమాణ చెప్పిన మ్యాడీ
పెళ్లి చేస్తానని.. యావర్‌ ను రూ.23 లక్షలకు ముంచిన వ్యక్తి
పెళ్లి చేస్తానని.. యావర్‌ ను రూ.23 లక్షలకు ముంచిన వ్యక్తి
స్టార్ డైరెక్టర్‌కు హైకోర్టు మొట్టికాయలు
స్టార్ డైరెక్టర్‌కు హైకోర్టు మొట్టికాయలు
స్టార్ డైరెక్టర్‌కు భారీ టోకరా.. కోట్లలో ముంచేసిన కేటుగాళ్లు
స్టార్ డైరెక్టర్‌కు భారీ టోకరా.. కోట్లలో ముంచేసిన కేటుగాళ్లు
గాఢ నిద్రలో రైతు.. పక్కనే తిష్ట వేసుకుని కూర్చున్న మృత్యువు..
గాఢ నిద్రలో రైతు.. పక్కనే తిష్ట వేసుకుని కూర్చున్న మృత్యువు..
నగరంలో గ్యాస్‌ కష్టాలకు ఇదే సాక్ష్యం.. డెలివరీ వాహనంపై దాడి
నగరంలో గ్యాస్‌ కష్టాలకు ఇదే సాక్ష్యం.. డెలివరీ వాహనంపై దాడి