Farmers: రైతులకి పెద్ద ఊరట.. ఇప్పుడు సాగు ఖర్చు తగ్గే అవకాశాలు..!

Farmers: కేంద్ర ప్రభుత్వం ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభంలో రైతులకి శుభవార్త చెప్పింది. డీజిల్ ధరను ఏడు రూపాయలు తగ్గించింది. దీనివల్ల

Farmers: రైతులకి పెద్ద ఊరట.. ఇప్పుడు సాగు ఖర్చు తగ్గే అవకాశాలు..!
Farmers
Follow us

|

Updated on: May 22, 2022 | 4:57 PM

Farmers: కేంద్ర ప్రభుత్వం ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభంలో రైతులకి శుభవార్త చెప్పింది. డీజిల్ ధరను ఏడు రూపాయలు తగ్గించింది. దీనివల్ల రైతులకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఈ సీజన్‌లో పొలాలను దున్నడానికి రైతులు ఎక్కువగా ట్రాక్టర్లను ఉపయోగిస్తారు. దీనికి డీజిల్‌ ఎక్కువగా కావాల్సి ఉంటుంది. ఇప్పుడు డీజిల్ ధర తగ్గడంతో రైతులకి కొంచెం ఉపశమనం కలిగినట్లయింది. ఇకపై రైతులు ట్రాక్టర్లతో దున్నితే డీజిల్‌కు ఎక్కువ ధర చెల్లించాల్సిన అవసరం ఉండదు. దీంతో రైతులను ఆదుకుంటామన్నారు. రైతులు పొదుపు ప్రారంభిస్తే దేశ ఆదాయం కూడా పెరుగుతుంది . డీజిల్ ధరపై ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని రైతులు స్వాగతిస్తున్నారు.

గతంలో పెరిగిన డీజిల్ ధర కారణంగా సాధారణ ప్రజలతో పాటు రైతులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వేసవి కాలంలో కరెంటు సరిగ్గా లేకపోవడంతో రైతులు డీజిల్ పంపులను ఉపయోగించేవారు. దీనికి డీజిల్ అవసరం అవుతుంది. అప్పుడు అధిక ధరలకి డీజిల్‌ కొనుగోలు చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ధర తగ్గడంతో రైతులకు సాగునీటి ఖర్చు కూడా తగ్గినట్లయింది. ఇది రైతులకు ఎంతో ఊరటనిచ్చింది. కేంద్ర ప్రభుత్వం శనివారం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన విషయం తెలిసిందే. లీటర్ పెట్రోల్‌పై రూ.8, డీజిల్‌పై రూ.6 తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన తర్వాత పెట్రోల్ ధర రూ.9.5, డీజిల్ ధర రూ.7 తగ్గింది.

డీజిల్ ధర తగ్గడంతో చేపలపెంపకందారులకి కూడా ఉపశమనం దొరికింది. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో చేపలు పెంచడానికి 24 గంటల విద్యుత్ అవసరం అవుతుంది. అయితే వేసవి కాలంలో కరెంట్‌ కోతల వల్ల రైతులు డీజిల్‌ జనరేటర్లు నడపాల్సి వచ్చేది. ఈ సమయంలో డీజిల్ కోసం ఎక్కువగా ఖర్చు చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు డీజిల్ చౌకగా మారిన తర్వాత వారికి కొంత ఉపశమనం లభిస్తుంది. ఖరీఫ్ సీజన్‌లో వరి నాట్లు వేసే సమయంలో పొలంలో ట్రాక్టర్ గంటల తరబడి నడుస్తుంది. డీజిల్ ఖరీదు అయితే రైతులకు ట్రాక్టర్ కిరాయి కూడా చాలా ఖరీదు అవుతుంది. అయితే ప్రస్తుతం డీజిల్ ధర తగ్గడంతో చిన్న రైతులు తక్కువ ధరకే పొలం సాగు చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని వ్యవసాయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి