Bullet Train Project: బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో ఇండియా రైల్వే మరో రికార్డు.. ప్రపంచ దేశాల సరసన భారత్!
Bullet Train Project: భారత్ మరో అరుదైన రికార్డు సాధించబోతోంది. ముంబై- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో ఇండియన్ రైల్వే మరో రికార్డు సృష్టించేందుకు..
Bullet Train Project: భారత్ మరో అరుదైన రికార్డు సాధించబోతోంది. ముంబై- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో ఇండియన్ రైల్వే మరో రికార్డు సృష్టించేందుకు సిద్ధమైంది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో కీలకమైన ఎక్విప్‌మెంట్‌ను దేశీయంగా తయారు చేయాలని నిర్ణయించింది. అరుదైన సాంకేతిక పరిజ్ఞాన్ని దేశీయంగానే అభివృద్ధి చేసి ప్రపంచ దేశాల సరసన నిలించేందుకు భారత్ సిద్ధం అవుతోంది.
ముంబై-ఢిల్లీ మధ్య 508 కిలోమీటర్లు:
కాగా, ముంబై- అహ్మదాబాద్‌ల మధ్య బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టును భారత్ రైల్వే చేపట్టింది. ముంబై నుంచి ఢిల్లీ మధ్య మొత్తం 508 కిలోమీటర్ల మేర పూర్తి కాగా, వయడక్టు పద్దతిలో బుల్లెట్ రైలు ట్రాక్ నిర్మాణం కొనసాగుతోంది. అయితే నేషనల్ హై స్పీడ్ రైల్ కారిడార్ లిమిటెడ్ సంస్థ ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులు పర్యవేక్షిస్తోంది. ఈ ప్రాజెక్టులో కీలకమైన వయడక్టు నిర్మాణంలో భారీ క్రేన్లు, స్ట్రడల్ క్యారియర్లు, గర్డర్ ట్రాన్స్‌పోర్టర్లు వంటి భారీ ఎక్విప్‌మెంట్‌ని ఉపయోగించాల్సి ఉంటుంది.
ట్రాక్ నిర్మాణంలో కీలక ఎక్వీప్‌మెంట్:
బుల్లెట్ ట్రైన్ ట్రాక్ నిర్మాణంలో కీలకమైన భారీ ఎక్వీప్‌మెంట్‌ను పూర్తి దేశీయంగా తయారు చేస్తున్నారు. తమిళనాడులోని కంచీపురంలో ఉన్న ఎల్ అండ్ టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కర్మాగారంలో తయారు చేస్తున్నారు. బుల్లెట్ ప్రాజెక్టును వేగంగదా పూర్తి చేసే విధంగా1100 టన్నుల సామర్థ్యం కలిగిన భారీ యంత్రాల తయారీ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఇటీవల ఇక్కడ తయారైన యంత్రాలను రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రారంభించారు. బుల్లెట్ ట్రైన్ ట్రాక్‌కి సంబంధించి వయడక్టు నిర్మాణ టెక్నాలజీ ఇప్పటి వరకు టెక్నాలజీలో అగ్రగామిగా ఉన్న సౌత్ కొరియా, ఇటలీ, నార్వే, చైనా దేశాల్లోనే అందుబాటులో ఉంది. ప్రపంచంలో ఎక్కడ బుల్లెట్ రైలు నిర్మాణం జరిగినా ఈ భారీ యంత్రాలు ఈ దేశాల నుంచి సరఫరా కావాల్సిందే.
Flagged off Made in India engineering marvel, a reflection of the 21st Century Mindset. #HighSpeedRailonFastTrack pic.twitter.com/7EzkdPaWFI
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) September 9, 2021