Petrol-Diesel Price Today: దేశంలో పెట్రోల్‌ డీజిల్‌ ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో స్వల్ప మార్పులు..!

Petrol-Diesel Price Today: వాహనదారులకు కొంత ఊరట కలిగిస్తున్నాయి పెట్రోల్‌, డీజిల్‌ ధరలు. గత కొన్ని రోజులుగా పరుగులు పెట్టిన ధరలు.. ఇప్పుడు స్థిరంగా..

Petrol-Diesel Price Today: దేశంలో పెట్రోల్‌ డీజిల్‌ ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో స్వల్ప మార్పులు..!
Follow us
Subhash Goud

|

Updated on: Sep 11, 2021 | 8:15 AM

Petrol-Diesel Price Today: వాహనదారులకు కొంత ఊరట కలిగిస్తున్నాయి పెట్రోల్‌, డీజిల్‌ ధరలు. గత కొన్ని రోజులుగా పరుగులు పెట్టిన ధరలు.. ఇప్పుడు స్థిరంగా కొనసాగుతున్నాయి. గత వారంలో స్వల్పంగా తగ్గుముఖం పట్టి.. అప్పటి నుంచి నిలకడగా ఉన్నాయి. చమురు ధరలు వంద రూపాయలు దాటిపోవడంతో ధరలను తగ్గించాలని వాహనదారులు గగ్గోలు పెడుతున్నారు. ముందే నిత్యవసర సరుకులు, గ్యాస్‌ ధరలు పెరుగుతుండటంతో భారంగా మారుతున్న సామాన్య జనాలకు.. ఈ పెట్రోల్‌ ధరలు నడ్డి విరుస్తున్నాయి. తాజాగా శనివారం (సెప్టెంబర్‌ 11) పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ కొద్దిగా పెట్రోల్ ధరల్లో స్వల్ప మార్పులు కనిపించాయి. ఇదిలా ఉండగా, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల్లో మార్పుల వల్ల దేశీయ చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరల్లో హెచ్చు తగ్గులు చోటు చేసుకుంటున్నాయి.

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు..

► దేశ రాజధాని ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ. 101.19 గా ఉండగా, లీటర్ డీజిల్ ధర రూ. 88.62లు ఉంది.

► దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.107.26 ఉండగా, లీటర్ డీజిల్ ధర రూ.96.19గా ఉంది.

► కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.101.62 ఉండగా, డీజిల్ ధర రూ. 91.71గా ఉంది.

► చెన్నైలో పెట్రోల్ ధర రూ. 98.96ఉండగా, డీజిల్ ధర రూ.93.26గా ఉంది.

► బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.104.70 ఉండగా, డీజిల్ ధర రూ.94.04గా ఉంది.

తెలంగాణలో..

► తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.26గా ఉండగా, లీటర్ డీజిల్ ధర రూ. 96.69గా ఉంది.

► కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 104.99గా ఉండగా, లీటర్ డీజిల్ ధర ధర రూ.96.93కు లభిస్తోంది.

► ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 106.53గా ఉండగా, డీజిల్ ధర రూ. 97.31గా ఉంది.

► మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.105.54గా ఉండగా, డీజిల్ ధర రూ.97.09గా ఉంది.

► వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 104.95 ఉండగా, లీటర్ డీజిల్ ధర రూ.96.39గా ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లో..

► విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.108.06 ఉండగా, లీటర్ డీజిల్ ధర రూ.98.93గా ఉంది.

► విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.106.71 ఉండగా, డీజిల్ ధర రూ. 97.65 గా ఉంది.

► విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.58గా ఉండగా, డీజిల్ ధర రూ.98.46కు లభిస్తోంది.

► కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.04గా ఉండగా, డీజిల్ ధర రూ.98గా ఉంది.

► గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.06గా ఉండగా, డీజిల్ ధర రూ.98.93గా ఉంది.

కాగా, ప్రస్తుతం ఉన్న ధరలు పెరగకుండా నిలకడగా ఉండటం ఊరట కలిగిస్తున్నాయి. వందకుపైగా నమోదవుతున్న ధరలు.. ఇంకాస్తా దిగివస్తే ఎంతో మేలంటున్నారు వాహనదారులు. ఇప్పటికే పెరిగిన ధరలతో తడిసిమోపెడవుతోందని, ధరలు ఎంత పెరిగినా.. వాహనాలను తీయక తప్పని పరిస్థితి నెలకొందని అంటున్నారు.

ఇవీ కూడా చదవండి:

Gold Price Today: బంగారం ప్రియులకు షాకింగ్‌.. మళ్లీ పెరిగిన పసిడి ధరలు.. ఏ నగరంలో ఎంత ధర ఉందంటే..!

Nissan Bumper Offer: కారు కొనేవారికి అదిరిపోయే ఆఫర్‌.. రూ.1 లక్ష వరకు తగ్గింపు.. 2 గ్రాముల బంగారం.. వివరాలివే!