Hero Cycles: మొదటి బ్యాచ్ మేడ్ ఇన్ ఇండియా ఈ-బైక్‌లను ఐరోపాకు ఎగుమతి చేసిన హీరో సైకిల్స్

Hero Cycles: హీరో సైకిల్స్ తన మొదటి బ్యాచ్ మేడ్ ఇన్ ఇండియా ఈ-బైక్‌లను ఐరోపాకు విజయవంతంగా అందించినట్లు భారత హీరో మోటార్స్ కంపెనీ (హెచ్‌ఎంసి) గ్రూప్ తెలిపింది.

Hero Cycles: మొదటి బ్యాచ్ మేడ్ ఇన్ ఇండియా ఈ-బైక్‌లను ఐరోపాకు ఎగుమతి చేసిన హీరో సైకిల్స్
Hero Cycles E Bike
Follow us
KVD Varma

|

Updated on: Jun 26, 2021 | 10:31 PM

Hero Cycles: హీరో సైకిల్స్ తన మొదటి బ్యాచ్ మేడ్ ఇన్ ఇండియా ఈ-బైక్‌లను ఐరోపాకు విజయవంతంగా అందించినట్లు భారత హీరో మోటార్స్ కంపెనీ (హెచ్‌ఎంసి) గ్రూప్ తెలిపింది. హెచ్‌ఎన్‌ఎఫ్ బ్రాండ్ ఆఫ్ హీరో ఇంటర్నేషనల్ (హెచ్‌ఐటి) కింద యూరోపియన్ యూనియన్ (ఇయు) మార్కెట్లో దూసుకుపోవాలని భావిస్తున్నట్టు కంపెనీ ఈ వారంలో తెలిపింది. అందుకు అనుగుణంగానే సుమారు 200 యూనిట్ల మొదటి బ్యాచ్ జర్మనీకి పంపిణీ చేశారు. భవిష్యత్తులో యూరోపియన్ యూనియన్ కోసం మరిన్ని యూనిట్లు సిద్ధం చేయడానికి కంపెనీ సమాయత్తం అవుతోంది. చైనా కాకుండా ఇతర మార్కెట్ లకు విశ్వసనీయ సరఫరాదారుగా మారడానికి కంపెనీకి ఒక అవకాశం వచ్చిందని హెచ్ఎంసి ఒక ప్రకటనలో తెలిపింది.

హీరో ఇంటర్నేషనల్ యూరోపియన్ బైక్, హెచ్ఎంసి ఇ-బైక్ ఆర్మ్ మాట్లాడుతూ 2025 నాటికి 300 మిలియన్ల యూరోల ఆదాయాన్ని సాధించడమే కంపెనీ లక్ష్యం అన్నారు. భారతదేశంలో తయారైన మొట్టమొదటి హెచ్‌ఎన్‌ఎఫ్ బ్రాండెడ్ బైక్ యూరోపియన్ తీరాలకు చేరుకుంది. ఇది కంపెనీకి చాలా గొప్పవిషయం. ఐరోపాలో మార్కెట్‌ను చేజిక్కించుకునే సామర్థ్యాన్ని ఇది ప్రదర్శిస్తుందని లండన్‌కు చెందిన హీరో ఇంటర్నేషనల్ సిఇఒ జెఫ్ వైస్ అన్నారు. భవిష్యత్తులో ఇ-బైక్‌లు 2030 నాటికి ఐరోపాలో 15 మిలియన్ యూనిట్లకు చేరుకుంటాయని భావిస్తున్నారు. ”ఈ విభాగంలో హీరో మార్కెట్ లీడర్‌గా ఎదగాలని మేము విశ్వసిస్తున్నాము. అధిక-నాణ్యత ఇ -హీరో ఉత్పాదక సామర్ధ్యంతో ఈ లక్ష్యాన్ని కచ్చితంగా సాధించగలం. ముఖ్యంగా లుధియానాలోని 100 ఎకరాల సైకిల్ వ్యాలీతో హెచ్‌ఎన్‌ఎఫ్ ఇంజనీరింగ్, డిజైన్ నైపుణ్యాన్ని కలిపే బైక్‌లు యూరోప్ లో సంచలనం సృష్టిస్తాయి.” అంటూ జెఫ్ వైస్ చెప్పారు. కోవిడ్-19 మహమ్మారి వల్ల కలిగే సైకిల్ సరఫరా చైన్ అంతరాయాలను యూరప్‌కు తన తాజా బ్యాచ్ ఇ-బైక్‌లతో అధిగామించగలిగినట్టు కంపెనీ అభిప్రాయపడింది. బైక్‌లు, ఇ-బైక్‌ల కోసం వినియోగదారుల డిమాండ్ ఇక్కడ ఎక్కువగానే ఉందని కంపెనీ చెబుతోంది.

బైక్‌లు మరియు ఇ-బైక్‌ల కోసం పెరుగుతున్న ఈ డిమాండ్‌ను తీర్చడానికి, హీరో తన డిజిటల్ సప్లై చైన్ కంపెనీ హీరో సప్లై చైన్ (హెచ్‌ఎస్‌సి) ను లాజిస్టిక్స్ మేనేజ్‌మెంట్, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్‌లో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసిందని చెప్పారు. హీరో తాజా వెంచర్, స్పర్, ఇంట్లో సైకిళ్ల కోసం కీలకమైన భాగాలను తయారు చేస్తుంది. మా పోటీదారులు చాలా మంది సరఫరాతో ఇబ్బందులు పడుతున్నప్పుడు, హెచ్‌ఎస్‌సితో భాగస్వామ్యం ఈ అధిక డిమాండ్ ఉన్న కాలంలో కూడా బైక్‌లు, ఇ-బైక్‌లకు నిరంతరాయంగా సరఫరా చేయడానికి అనుమతిస్తుందని కంపెనీ తన ప్రకటనలో తెలిపింది.

Also Read: Banks : కరోనా సమయంలో లాభాలు ఆర్జించిన బ్యాంకులు ఇవే..! ఎస్బీఐ నుంచి మొదలుపెడితే చాలా బ్యాంకులు..?

Skoda Kushaq: జూన్‌ 28 నుంచి స్కోడా కుషాక్ బుకింగ్‌లు; డెలివరీలు ఎప్పుడంటే..?