గుడ్‌న్యూస్.. భారీగా తగ్గనున్న ఈ కంపెనీ కార్ల ధరలు! కొత్త కార్ కొనాలనుకునేవారికి పండగే
భారత్-యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చర్చలు కీలక దశలో ఉన్నాయి. దీని ఫలితంగా EU నుండి దిగుమతి చేసుకునే కార్లపై సుంకాలు 110 శాతం నుండి 40 శాతానికి తగ్గే అవకాశం ఉంది. ఈ నిర్ణయం వోక్స్‌వ్యాగన్, మెర్సిడెస్, BMW వంటి యూరోపియన్ లగ్జరీ కార్ల ధరలను భారత్‌లో భారీగా తగ్గిస్తుంది.

కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకో అదిరిపోయే శుభవార్త. కొన్ని కంపెనీల ధరలు భారీగా తగ్గే అవకాశం ఉంది. అందుకు కారణం భారత్, యూరప్‌తో చేసుకునే ఒప్పందాలే. భారత్, యూరప్ మధ్య జరుగుతున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పంద చర్చలు ఇప్పుడు కీలక దశలో ఉన్నాయి. EU నుండి దిగుమతి చేసుకునే కార్లపై సుంకాలను 110 శాతం నుండి 40 శాతానికి తగ్గించాలని భారత్ యోచిస్తున్నట్లు వర్గాల సమాచారం.
ఈ పథకం కింద 27 యూరోపియన్ యూనియన్ దేశాల నుండి ఎంపిక చేసిన వాహనాలపై పన్నులను వెంటనే తగ్గించడానికి ప్రభుత్వం అంగీకరించిందని రెండు వర్గాలు రాయిటర్స్‌కు తెలిపాయి . సుమారు 1.626 మిలియన్ల యూరోల కంటే ఎక్కువ దిగుమతి ధర కలిగిన వాహనాలకు వర్తిస్తాయని గమనించాలి. ఈ ప్రభుత్వ నిర్ణయం యూరోపియన్ కార్ల తయారీదారులకు భారత్‌లో వేరే కార్ల కంపెనీలతో పోటీ పడేందుకు మెరుగైన అవకాశాన్ని అందిస్తుంది.
అయితే ఈ 40 శాతం పన్నును కూడా క్రమంగా 10 శాతానికి తగ్గించే ప్రణాళికలు ఉన్నాయి. భారత ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వోక్స్‌వ్యాగన్, మెర్సిడెస్-బెంజ్, BMW వంటి యూరోపియన్ ఆటోమొబైల్ కంపెనీలకు లాభం చేకూర్చనుంది. అలాగే వీటి ధరలు ఇండియాలో భారీగా తగ్గే అవకాశం ఉంది. ఇప్పటివరకు అధిక రేట్లు కంపెనీలకు తలనొప్పిగా ఉన్నాయి, కానీ ప్రభుత్వ నిర్ణయం గణనీయమైన ఉపశమనం కలిగించవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
