AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గ్యాస్ సిలిండర్ పోతే కనెక్షన్ కట్ అవుతుందా..? 99శాతం మందికి తెలియని అసలు నిజాలు ఇవే..

సాధారణంగా ఇళ్లలో ఎల్పీజీ సిలిండర్లను వాడేటప్పుడు చాలామంది వాటి భద్రత గురించి పెద్దగా పట్టించుకోరు. కానీ కొన్నిసార్లు ఖాళీ సిలిండర్లు లేదా నిండుగా ఉన్న సిలిండర్లు దొంగతనానికి గురవుతుంటాయి. అలాంటప్పుడు చాలామంది కనెక్షన్ ఎక్కడ కట్ అవుతుందో అని కంగారుపడుతుంటారు. అయితే సిలిండర్ పోయినప్పుడు కనెక్షన్ రద్దవుతుందా..? కొత్త సిలిండర్ రావాలంటే ఎంత జరిమానా కట్టాలి? అనే విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

గ్యాస్ సిలిండర్ పోతే కనెక్షన్ కట్ అవుతుందా..? 99శాతం మందికి తెలియని అసలు నిజాలు ఇవే..
Lpg Cylinder Lost Rules
Krishna S
|

Updated on: Jul 02, 2026 | 4:47 PM

Share

గత కొన్నాళ్లుగా పెరిగిన ఎల్పీజీ సిలిండర్ల ధరలతో సామాన్యులు ఇప్పటికే ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవలే చమురు కంపెనీలు కమర్షియల్ గ్యాస్ ధరలను కొంత తగ్గించినప్పటికీ.. గృహ వినియోగ గ్యాస్ ధరల్లో పెద్దగా మార్పు రాలేదు. ఇదిలా ఉంటే.. ఒకవేళ ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ చోరీ అయినా.. లేదా పోగొట్టుకున్నా ఏం చేయాలి? గ్యాస్ కనెక్షన్ రద్దవుతుందా? అనే సందేహాలు చాలామందిలో ఉన్నాయి. అయితే గ్యాస్ సిలిండర్ పోయినంత మాత్రాన మీ గ్యాస్ కనెక్షన్ రద్దు కాదు. సరఫరా కూడా నిలిపివేయడం జరగదు. అయితే దీనికి సంబంధించి వినియోగదారులు కొన్ని చట్టపరమైన ప్రక్రియను ఖచ్చితంగా పూర్తి చేయాల్సి ఉంటుంది.

సిలిండర్ పోయినప్పుడు వెంటనే చేయాల్సిన పనులు..

ఒకవేళ మీ సిలిండర్ చోరీ అయితే వెంటనే ఇవి ఫాలో అవ్వాలి..

పోలీస్ కంప్లైంట్: సిలిండర్ మిస్ అయిన వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇవ్వాలి. ఫిర్యాదు చేసేటప్పుడు సిలిండర్ ప్రత్యేక సంఖ్యను ఖచ్చితంగా తెలపాలి. దీనివల్ల ఒకవేళ దొంగిలించిన సిలిండర్‌ను ఎక్కడైనా విక్రయిస్తుంటే పట్టుకోవడం సులభం అవుతుంది. చోరీకి సంబంధించిన వివరాలను, ఇన్సిడెంట్ ఎలా జరిగిందో మీ గ్యాస్ ఏజెన్సీకి వాతపూర్వకంగా తెలియజేయాలి.

ఇవి కూడా చదవండి

సబ్మిట్ చేయాల్సిన ముఖ్యమైన పత్రాలు

  • గ్యాస్ బుక్
  • గ్యాస్ కనెక్షన్ ఎవరి పేరు మీద ఉందో వారి గుర్తింపు కార్డు
  • పోలీసుల ఎఫ్ఐఆర్ కాపీ

సిలిండర్ పోగొట్టుకుంటే జరిమానా ఎంత?

సిలిండర్ అనేది ప్రభుత్వ ఆస్తి. కాబట్టి వినియోగదారుడి నిర్లక్ష్యం వల్ల అది పోతే గ్యాస్ కంపెనీలు జరిమానా విధిస్తాయి. నిబంధనల ప్రకారం వినియోగదారుడు రూ.1,000 నుండి రూ.3,000 వరకు జరిమానా చెల్లించాల్సి రావచ్చు. ఒకవేళ సిలిండర్‌తో పాటు రెగ్యులేటర్ కూడా పోగొట్టుకుంటే.. ఈ ఫైన్ అమౌంట్ ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. ఏజెన్సీని బట్టి ఈ మొత్తంలో స్వల్ప మార్పులు ఉంటాయి.

కొత్త సిలిండర్ ఎలా వస్తుంది?

మీరు ఈ పత్రాలన్నింటినీ సమర్పించిన తర్వాత గ్యాస్ ఏజెన్సీ అధికారులు వాటిని వెరిఫై చేస్తారు. అంతా సవ్యంగా ఉండి, మీరు నిర్దేశిత జరిమానా లేదా డిపాజిట్ మొత్తాన్ని చెల్లించిన తర్వాత ఏజెన్సీ మీకు కొత్త సిలిండర్‌ను ఇస్తుంది. అయితే ఈ ప్రాసెస్ అంతా పూర్తి కావడానికి కొంత సమయం పడుతుంది.

Follow Us
బూందీ మిక్చర్‌లో కరకరలాడే బల్లి.. స్వీట్‌ షాప్‌పై కేసు, జరిమానా
బూందీ మిక్చర్‌లో కరకరలాడే బల్లి.. స్వీట్‌ షాప్‌పై కేసు, జరిమానా
పిచ్చి పీక్స్.. వ్యూస్ కోసం ట్రైన్‌లో యువకుడు చేసింది చూస్తే..
పిచ్చి పీక్స్.. వ్యూస్ కోసం ట్రైన్‌లో యువకుడు చేసింది చూస్తే..
బ్యాంక్ అకౌంట్లో్ అంతకంటే ఎక్కువ విత్ డ్రా చేస్తే ఇబ్బందులే..
బ్యాంక్ అకౌంట్లో్ అంతకంటే ఎక్కువ విత్ డ్రా చేస్తే ఇబ్బందులే..
ఇదేం మ్యాజిక్ భయ్యా.. మన తెలుగోడి స్కిల్‌కు ఎవరైనా ఫిదా..
ఇదేం మ్యాజిక్ భయ్యా.. మన తెలుగోడి స్కిల్‌కు ఎవరైనా ఫిదా..
ఈ నెలలోనే తొలి ఏకాదశి.. వీరికి ఆ రోజున మహర్దశ పట్టబోతోంది..
ఈ నెలలోనే తొలి ఏకాదశి.. వీరికి ఆ రోజున మహర్దశ పట్టబోతోంది..
పూజలో నేలపై కూర్చోవచ్చా? ఆసనం లేకుండా పూజ చేస్తే ఏమవుతుంది?..
పూజలో నేలపై కూర్చోవచ్చా? ఆసనం లేకుండా పూజ చేస్తే ఏమవుతుంది?..
'Wiproలో లేఆఫ్.. అది దేవుడిచ్చిన వరం' మాజీ ఉద్యోగిని వీడియో వైరల్
'Wiproలో లేఆఫ్.. అది దేవుడిచ్చిన వరం' మాజీ ఉద్యోగిని వీడియో వైరల్
ఏపీలో భారీ వర్షాలు.. ఈ జిల్లాల ప్రజలకు అలర్ట్..
ఏపీలో భారీ వర్షాలు.. ఈ జిల్లాల ప్రజలకు అలర్ట్..
Green Tea Vs Black Tea: వెయిట్ లాస్, షుగర్ కంట్రోల్‌కు ఏది బెస్ట్
Green Tea Vs Black Tea: వెయిట్ లాస్, షుగర్ కంట్రోల్‌కు ఏది బెస్ట్
ఫిక్స్డ్ డిపాజిట్లు చేస్తున్నారా..? మొదట ఈ విషయాలు తెలుసుకోండి..
ఫిక్స్డ్ డిపాజిట్లు చేస్తున్నారా..? మొదట ఈ విషయాలు తెలుసుకోండి..