సంగారెడ్డి జిల్లా మల్గి గ్రామ శివారులో బీదర్ మున్సిపాలిటీ చెత్త డంపింగ్ యార్డుపై తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తమకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయని మల్గి గ్రామస్థులు గత 15 రోజులుగా చెత్త వాహనాలను అడ్డుకుంటున్నారు. దీనికి ప్రతీకారంగా బీదర్ అధికారులు రోడ్డుపైనే 40 వాహనాల చెత్తను పారబోయడంతో ఇరు రాష్ట్రాల సరిహద్దుల్లో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.