AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: పిచ్చి పీక్స్.. వ్యూస్ కోసం ట్రైన్‌లో యువకుడు చేసింది చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే.. వీడియో వైరల్

రాత్రికి రాత్రే సోషల్ మీడియాలో స్టార్ అయిపోవాలనే పిచ్చి యువత ప్రాణాలను మింగేస్తుంది. వ్యూస్, లైక్స్ కోసం ప్రమాదకరమైన స్టంట్లు చేస్తూ నిండు జీవితాన్ని ఆగం చేసుకుంటున్నారు. అటువంటిదే ఇప్పుడు మరో నెట్టింట వైరల్‌గా మారింది. కదులుతున్న రైలు డోర్ పట్టుకుని తలకిందులుగా వేలాడుతూ ఆ యువకుడు చేసిన స్టంట్ చూస్తే మీరు బిత్తరపోతారు..

Viral Video: పిచ్చి పీక్స్.. వ్యూస్ కోసం ట్రైన్‌లో యువకుడు చేసింది చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే.. వీడియో వైరల్
Youth Performs Dangerous Stunt On Moving Train 1
Krishna S
|

Updated on: Jul 02, 2026 | 4:56 PM

Share

ఈ ఆధునిక యుగంలో అందరికీ రీల్స్ పిచ్చి పట్టుకుంది. లైకులు, వ్యూస్ కోసం పలువురు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇప్పటికే రీల్స్ మోజులో పడి ప్రాణాలు కోల్పోయిన వారు ఎంతోమంది ఉన్నారు. రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోవాలనే పిచ్చి యువతను ఏ స్థాయికి తీసుకెళ్తుందో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం. తాజాగా కదులుతున్న రైలులో ఒక యువకుడు చేసిన అత్యంత ప్రమాదకరమైన స్టంట్ ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. కేవలం 11 సెకన్ల నిడివి ఉన్న ఈ వైరల్ క్లిప్‌లో ఒక యువకుడు కదులుతున్న రైలు డోర్ పట్టుకుని, ఏకంగా తలకిందులుగా వేలాడుతూ కనిపిస్తాడు. ఏదో జిమ్‌లోనో లేదా పార్కులోనో వ్యాయామాలు చేస్తున్నట్లుగా ఎలాంటి భయం లేకుండా ఆ యువకుడు ప్రవర్తించిన తీరు నెటిజన్లను షాక్‌కు గురిచేస్తోంది. రైలు అంత వేగంగా వెళ్తున్నప్పుడు పట్టు జారినా లేదా పక్కనే ఉండే రైల్వే సిగ్నల్ స్తంభాలు తగిలినా.. క్షణాల్లో ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. కానీ ఆ యువకుడు మాత్రం అవేమీ పట్టించుకోకుండా కేవలం రీల్ మీదనే ఫోకస్ పెట్టడం గమనార్హం.

లైక్స్ కోసం జీవితాన్ని పణంగా పెడతారా?

ఇవి కూడా చదవండి

ఈ వీడియో కేవలం ఒక వ్యక్తి చేసిన తప్పు మాత్రమే కాదు.. వ్యూస్ కోసం ప్రాణాలను సైతం లెక్కచేయని నేటి తరం ఆలోచనా విధానానికి ఒక ప్రతిబింబం అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. కేవలం కొన్ని వందల లైక్స్ కోసం భగవంతుడు ఇచ్చిన అమూల్యమైన జీవితాన్ని ఇలాంటి ప్రమాదకరమైన స్టంట్స్‌తో రిస్క్‌లో పెట్టడం ఎంతవరకు వివేకం అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం వల్ల సమాజంలోకి తప్పుడు సందేశం వెళ్తుంది. దీన్ని చూసి మరికొందరు యువకులు ప్రేరణ పొంది ఇలాంటి విన్యాసాలు చేయడానికి ప్రయత్నించి, ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.

ఇప్పుడు మారకపోతే అంతే..

వ్యూస్ కోసం చేసే ఈ పిచ్చి స్టంట్లకు బ్రేక్ వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైల్వే శాఖ ఇలాంటి ప్రమాదకరమైన స్టంట్స్ చేసే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ కొందరిలో మార్పు రావడం లేదు. ప్రతి ఒక్కరూ ఒక్కటి గుర్తుంచుకోవాలి.. సోషల్ మీడియాలో రీల్స్‌ను మళ్లీ మళ్లీ చేసుకోవచ్చు.. కానీ పోయిన ప్రాణాన్ని ఎప్పటికీ తిరిగి తెచ్చుకోలేం.

వీడియో చూడండి..

Follow Us
ఈ పశువుల డాక్టర్ ఇలా ఎందుకు చేయిస్తున్నారో తెలుసా..?
ఈ పశువుల డాక్టర్ ఇలా ఎందుకు చేయిస్తున్నారో తెలుసా..?
కారవాన్‌లోనే బోర్డు మీటింగ్.. ఏపీ టూరిజం సరికొత్త ఆలోచన
కారవాన్‌లోనే బోర్డు మీటింగ్.. ఏపీ టూరిజం సరికొత్త ఆలోచన
బూందీ మిక్చర్‌లో కరకరలాడే బల్లి.. స్వీట్‌ షాప్‌పై కేసు, జరిమానా
బూందీ మిక్చర్‌లో కరకరలాడే బల్లి.. స్వీట్‌ షాప్‌పై కేసు, జరిమానా
పిచ్చి పీక్స్.. వ్యూస్ కోసం ట్రైన్‌లో యువకుడు చేసింది చూస్తే..
పిచ్చి పీక్స్.. వ్యూస్ కోసం ట్రైన్‌లో యువకుడు చేసింది చూస్తే..
బ్యాంక్ అకౌంట్లో్ అంతకంటే ఎక్కువ విత్ డ్రా చేస్తే ఇబ్బందులే..
బ్యాంక్ అకౌంట్లో్ అంతకంటే ఎక్కువ విత్ డ్రా చేస్తే ఇబ్బందులే..
ఇదేం మ్యాజిక్ భయ్యా.. మన తెలుగోడి స్కిల్‌కు ఎవరైనా ఫిదా..
ఇదేం మ్యాజిక్ భయ్యా.. మన తెలుగోడి స్కిల్‌కు ఎవరైనా ఫిదా..
ఈ నెలలోనే తొలి ఏకాదశి.. వీరికి ఆ రోజున మహర్దశ పట్టబోతోంది..
ఈ నెలలోనే తొలి ఏకాదశి.. వీరికి ఆ రోజున మహర్దశ పట్టబోతోంది..
పూజలో నేలపై కూర్చోవచ్చా? ఆసనం లేకుండా పూజ చేస్తే ఏమవుతుంది?..
పూజలో నేలపై కూర్చోవచ్చా? ఆసనం లేకుండా పూజ చేస్తే ఏమవుతుంది?..
'Wiproలో లేఆఫ్.. అది దేవుడిచ్చిన వరం' మాజీ ఉద్యోగిని వీడియో వైరల్
'Wiproలో లేఆఫ్.. అది దేవుడిచ్చిన వరం' మాజీ ఉద్యోగిని వీడియో వైరల్
ఏపీలో భారీ వర్షాలు.. ఈ జిల్లాల ప్రజలకు అలర్ట్..
ఏపీలో భారీ వర్షాలు.. ఈ జిల్లాల ప్రజలకు అలర్ట్..