AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lawrence: రాజకీయాల్లో లారెన్స్ యూటర్న్?

Lawrence: రాజకీయాల్లో లారెన్స్ యూటర్న్?

Phani CH
|

Updated on: Jul 02, 2026 | 10:52 AM

Share

రాజకీయాల్లోకి వస్తున్నానని ప్రకటించిన రాఘవ లారెన్స్ తాజాగా తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గం నుంచి పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. పార్టీ కోసం పనిచేసిన క్షేత్రస్థాయి కార్యకర్తల అవకాశాలను తాను దూరం చేయనని పేర్కొన్నారు. అయితే భవిష్యత్తులో రాజకీయాల్లోకి తప్పకుండా వస్తానని వీడియో ద్వారా మరోసారి స్పష్టం చేశారు.

‘అమ్మ ఓకే చెప్పింది! నేనూ రెడీ.. రాజకీయాల్లోకి వస్తున్నా అంటూ.. నిన్న కాక మొన్న ఓ వీడియో రిలీజ్‌ చేసిన రాఘవ లారెన్స్‌.. రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చి… దుమ్ములేపుతాడనే తమిళ తంబీలు అనుకున్నారు. విజయ్‌ దళపతి పార్టీలో చేసి.. విజయ్‌ ఖాళీ చేసిన తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తాడనే ఆయన ఫ్యాన్స్‌ కూడా గట్టిగా అనుకున్నారు. కానీ కట్ చేస్తే.. ఇప్పుడు రాఘవ యూటర్న్‌ కొట్టాడు. మరో వీడియో రిలీజ్ చేసిన ఆయన.. అందులో తాను మాట్లాడిన మాటలతో ఇప్పుడు తమిళ నాట వైరల్ అవుతున్నాడు. జయ్‌ ఖాళీ చేసిన తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గం నుంచి తాను పోటీ చేయడం లేదంటూ రాఘవ లారెన్స్ తన వీడియోలో కుంబడద్దలు కొట్టినట్టుగా చెప్పుకొచ్చారు. పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడుతున్న క్షేత్రస్థాయి కార్యకర్తలకు కాకుండా.. తానే నేరుగా ఈ స్థానం దక్కించుకుని పోటీ చేయడం రాజకీయ ధర్మం కాదని తన వీడియోలో లారెన్స్ చెప్పుకొచ్చాడు. రుచ్చి ఈస్ట్ నుంచి తప్పుకున్నంత మాత్రాన తాను రాజకీయాల నుంచి వెనక్కి తగ్గినట్లు కాదని అన్నాడు. ఫ్యూచర్‌లో ఖచ్చితంగా రాజకీయాల్లోకి వస్తానని లారెన్స్ క్లారిటీ ఇచ్చాడు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Suriya: రాజకీయాల్లోకి సూర్య? క్లారిటీ ఇదే..

Maa Inti Bangaram: గుడ్ న్యూస్.. OTTలోకి ‘మా ఇంటి బంగారం’ మూవీ

ఫిల్మ్ ఇండస్ట్రీకి మోదీ గుడ్‌న్యూస్!ఇక ఊరూరా థియేటర్లే!

Nandini Reddy: సమంత ప్రెగ్నెంట్ అని తెలిశాకే.. ఆ సీన్లన్నీ షూట్ చేశాం..

OTT గైడ్.. పెద్ది, అబ్సెషన్ తో పాటు.. ఈ వారం ఏం వస్తున్నాయంటే

Follow Us