AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maa Inti Bangaram: గుడ్ న్యూస్.. OTTలోకి 'మా ఇంటి బంగారం' మూవీ

Maa Inti Bangaram: గుడ్ న్యూస్.. OTTలోకి ‘మా ఇంటి బంగారం’ మూవీ

Phani CH
|

Updated on: Jul 02, 2026 | 10:49 AM

Share

సమంత ప్రధాన పాత్రలో నటించిన మా ఇంటి బంగారం థియేటర్లలో ఘన విజయాన్ని సాధించిన తర్వాత ఓటీటీ విడుదలపై ఆసక్తి నెలకొంది. చిత్ర బృందం ప్రకటించిన బాక్సాఫీస్ విజయంతో పాటు, డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను జియో హాట్‌స్టార్ దక్కించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఓటీటీ విడుదల తేదీపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది.

దాదాపు మూడేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత సిల్వర్ స్క్రీన్ పై కనిపించిన సమంత.. కనిపించీ కనిపించగానే సూపర్ డూపర్ హిట్టు కొట్టేసింది. నందిని రెడ్డి దర్శకత్వంలో ఆమె నటించిన తన లేటెస్ట్ మూవీ మా ఇంటి బంగారంతో ఇప్పుడు టాలీవుడ్‌లో రీసౌండ్ చేస్తోంది. జూన్ 19 రిలీజైన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఫస్ట్ డే నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. మొదటి రోజే ఏకంగా రూ. 13 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఆ తర్వాత కూడా జోరు కొనసాగించడంతో సామ్ సినిమాకు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు వచ్చాయి. ఇప్పటివరకు సమంత సినిమాకు రూ. 73 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఇక ఓవర్సీస్ లోనూ మా ఇంటి బంగారం సినిమాకు రికార్డు కలెక్షన్లు వస్తున్నాయి. అక్కడ ఇప్పటికే ఈ మూవీ కలెక్షన్లు 2 మిలియన్ డాలర్లను క్రాస్ చేసిందని ఈ మూవీ టీం చెప్పింది. ప్రస్తుతం పోటీగా సినిమాలేవీ లేకపోవడంతో సామ్ సినిమాకు ఇంకా భారీ కలెక్షన్లు వస్తున్నాయి. ఇదే క్రమంలో చాలా మంది సామ్ సినిమాను ఓటీటీలో చూడాలని ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో మా ఇంటి బంగారం సినిమా ఓటీటీ రిలీజ్ పై సోషల్ మీడియాలో ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వినిపిస్తోంది. మా ఇంటి బంగారం.. మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్ స్టార్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం నిర్మాతలకు భారీ మొత్తం అందించినట్లు తెలుస్తోంది. థియేట్రికల్ రన్ పూర్తైన 4 నుంచి 6 వారాల తర్వాతనే సినిమాను ఓటీటీ లోకి తీసుకురావాలని డీల్ కుదిరినట్లు తెలుస్తోంది. ఈ లెక్కన చూసుకుంటే జులై లాస్ట్ వీక్‌లో కానీ ఆగస్ట్ మొదటి వారంలో సమంత సినిమా స్ట్రీమింగ్ కు వచ్చే అవకాశముందని తెలుస్తోంది. త్వరలోనే దీనిపై మరింత క్లారిటీ రానుంది. మా ఇంటి బంగారం సినిమా విషయానికి వస్తే.. ట్రాలాలా పిక్చర్స్ బ్యానర్ మీద సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. సుమారు రూ. 30 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ ఇప్పుడు 100 కోట్ల దిశగా పరుగులు పెడుతోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఫిల్మ్ ఇండస్ట్రీకి మోదీ గుడ్‌న్యూస్!ఇక ఊరూరా థియేటర్లే!

Nandini Reddy: సమంత ప్రెగ్నెంట్ అని తెలిశాకే.. ఆ సీన్లన్నీ షూట్ చేశాం..

OTT గైడ్.. పెద్ది, అబ్సెషన్ తో పాటు.. ఈ వారం ఏం వస్తున్నాయంటే

Follow Us