Nandini Reddy: సమంత ప్రెగ్నెంట్ అని తెలిశాకే.. ఆ సీన్లన్నీ షూట్ చేశాం..
సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన మా ఇంటి బంగారం సినిమా విజయోత్సవ వేడుకల్లో దర్శకురాలు నందినీ రెడ్డి షూటింగ్ సమయంలో ఎదురైన అనుభవాలను పంచుకున్నారు. పాటలు, యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలో ఎదురైన సవాళ్లతో పాటు సమంత అంకితభావాన్ని కొనియాడారు. అయితే వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ప్రచారాలపై అధికారికంగా ధృవీకరించిన సమాచారం ఉన్నప్పుడే నమ్మాలని నిపుణులు సూచిస్తున్నారు.
టాలీవుడ్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ సూపర్ హిట్ మూవీ మా ఇంటి బంగారం. సామ్ భర్త రాజ్ నిడిమోరు కథ అందించగా.. డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వం వహించారు. ఇటీవల థియేటర్లలో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుని కలెక్షన్ల వర్షం కురిపించింది. ముఖ్యంగా ఈ సినిమా యాక్షన్ సీన్లలో సామ్ యాక్టింగ్, పెర్ఫార్మెన్స్ పై ప్రశంసలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ఈ సినిమా సక్సెస్ మీట్ లో సామ్ బేబీ బంప్ వైరల్ కావడంతో ఆమె తల్లి కాబోతుందనే న్యూస్ నెట్టింట చక్కర్లు కొట్టింది. ఇక ఆ మూవీ థాంక్స్ మీట్ లో సామ్ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది. అలాగే మా ఇంటి బంగారం సినిమా తర్వాత తాను కొన్ని రోజులు విరామం తీసుకోనున్నట్లు తెలిపారు. అయితే ఈ మూవీ షూటింగ్ సమయంలోనే సమంత ఈ గుడ్ న్యూస్ తనకు చెప్పారని.. ఎవరికీ చెప్పొద్దన్నారని దర్శకురాలు నందినిరెడ్డి వెల్లడించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఈ మూవీ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తస్సాదియా సాంగ్ ను మొదట నాలుగు రోజులు షూటింగ్ చేద్దామనుకున్నామని.. కానీ సామ్‌కు జ్వరం రావడంతో.. ఆ సాంగ్ షెడ్యూల్‌ను రెండు రోజుల్లో కుదించాల్సి వచ్చిందంటూ నందినీ రెడ్డి చెప్పుకొచ్చింది. ఆ తరువాత కూడా సమంతకు తరుచూ జ్వరం వస్తుండడంతో… తానే ఒక రోజు అడిగానని.. అప్పుడు సామ్ తాను ప్రెగ్నెంట్ అనే విషయాన్ని బయటపెట్టిందని నందినీ చెప్పుకొచ్చింది. అంతేకాదు ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని కోరిందని నందనీ గుర్తు చేసుకుంది. సమంత ప్రెగ్నెంట్ అని తెలియగానే తాను డ్యాన్స్ మాస్టర్ దగ్గరకు వెళ్లి.. ఆమెకు ఆరోగ్యం బాలేదు.. తనతో ఎక్కువగా రిహార్సల్స్ చేయించొద్దు అని చెప్పానని నందినీ చెప్పుకొచ్చింది. చిన్న చిన్న స్టెప్పులతోనే కంటిన్యూ చేద్దామని చెప్పానని.. ఆ పాటను సమంత సిక్ నెస్ తోనే పూర్తి చేసిందని నందనీ చెప్పుకొచ్చింది. అలాగే యాక్షన్ సీన్స్, కార్ యాక్సిడెంట్ సీన్, ఛేజింగ్ సీన్స్ కూడా తర్వాత షూట్ చేసినవే అని ఆమె అన్నారు. ఎప్పుడూ 3.30 తర్వాత నీడలో షూట్ చేశామని.. ఆమె ఎక్కువగా ఒత్తిడికి గురికాకుండా చూసుకున్నామని నందినిరెడ్డి అన్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
OTT గైడ్.. పెద్ది, అబ్సెషన్ తో పాటు.. ఈ వారం ఏం వస్తున్నాయంటే
బంగారాన్ని విరజిమ్ముతున్న అగ్ని పర్వతం!
పొలంలో బంగారు నిధులు.. కౌలుకు తీసుకునేందుకు రైతుల పోటీ
బెల్ట్ షాపులకు షాక్ ట్రీట్మెంట్.. మద్యం అమ్మితే కరెంట్ కట్!
కాల్ లిఫ్ట్ చేయలేదని మహిళను వేధించిన డెలివరీ బాయ్!
కూలీని వరించిన అదృష్టం.. గనిలో దొరికిన రూ.40 లక్షల విలువైన వజ్రం
స్టోర్ రూంలో వింత శబ్దాలు వెళ్లి చూసిన ఇంటి యజమాని గుండె గుభేల్!
గుండెను పిండేసే ఘటన పొలం దున్నేందుకు కాడెద్దుగా మారిన యువకుడు

