AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వరల్డ్ కప్ గెలిస్తే చంద్రుడిపైకి తీసుకెళ్తాం.. ఆ టీమ్‌కు నాసా క్రేజీ ఆఫర్..

ఫిఫా వరల్డ్ కప్ హోరు ప్రపంచవ్యాప్తంగా పీక్స్‌కు చేరిన వేళ.. అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా అమెరికా టీమ్‌కు ఒక క్రేజీ అప్‌డేట్‌తో ముందుకొచ్చింది. అమెరికా పురుషుల ఫుట్‌బాల్ జట్టు గనుక ఈసారి కప్ కొడితే... హిస్టరీలోనే నిలిచిపోయేలా ఒక ఫుట్‌బాల్‌ను చంద్రుడిపైకి పంపుతామని నాసా చీఫ్ జారెడ్ ఐజాక్‌మన్ ఒక సంచలన ప్రకటన చేశారు.

వరల్డ్ కప్ గెలిస్తే చంద్రుడిపైకి తీసుకెళ్తాం.. ఆ టీమ్‌కు నాసా క్రేజీ ఆఫర్..
A Soccer Ball To The Moon If Team Usa Wins
Krishna S
|

Updated on: Jul 02, 2026 | 3:11 PM

Share

ప్రస్తుతం ప్రపంచాన్ని పుట్‌బాల్ ఫీవర్ ఊపేస్తుంది. 2026 ఫిఫా వరల్డ్ కప్‌లో అమెరికా పురుషుల ఫుట్‌బాల్ జట్టుకు అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ఒక అద్భుతమైన, వినూత్నమైన ప్రోత్సాహకాన్ని ప్రకటించింది. అమెరికా గనుక ఈ మెగా టోర్నమెంట్‌లో విజేతగా నిలిచి ట్రోఫీని కైవసం చేసుకుంటే.. నాసా ఒక ఫుట్‌బాల్‌ను చంద్రుడిపైకి పంపుతుందని నాసా చీఫ్ ఒక ప్రకటనలో తెలిపారు. చంద్రుడిపై బేస్ క్యాంప్ ఏర్పాటుకు సంబంధించిన నాసా ప్రణాళికలను వివరించే ఒక కార్యక్రమంలో నాసా అడ్మినిస్ట్రేటర్ జారెడ్ ఐజాక్‌మన్ ఈ ఆసక్తికరమైన సవాల్‌ను విసిరారు. ‘‘యూఎస్‌ఏ టీమ్.. ఇది మీకు ఒక ఛాలెంజ్. మీ పని మీరు పూర్తి చేసి కప్ గెలవండి.. మేము ఆ ఫుట్‌బాల్‌ను చంద్రుడిపైకి చేరుస్తాం. అమెరికా జట్టుకు మా వైపు నుంచి ఇదొక చిన్న మోటివేషన్’’ అని ఐజాక్‌మన్ వ్యాఖ్యానించారు.

అపోలో 14 రికార్డును బ్రేక్ చేస్తాం..

1971లో జరిగిన అపోలో 14 మిషన్‌లో భాగంగా వ్యోమగామి అలన్ షెపర్డ్ గుట్టుచప్పుడు కాకుండా ఒక గోల్ఫ్ క్లబ్, రెండు గోల్ఫ్ బాల్స్‌ను చంద్రుడిపైకి తీసుకెళ్లి, అక్కడ షాట్లు కొట్టి చరిత్ర సృష్టించారు. ఇప్పుడు అమెరికా జట్టు గెలిస్తే తాము అలన్ షెపర్డ్ రికార్డును మించి సరికొత్త మైలురాయిని క్రియేట్ చేస్తామని ఐజాక్‌మన్ ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇది ఎలా సాధ్యం?

ఒకవేళ అమెరికా జట్టు వరల్డ్ కప్ గెలిస్తే.. నాసా చేపట్టబోయే భవిష్యత్తు లూనార్ మిషన్లలో శాస్త్రీయ పరికరాలతో పాటు ఈ ఫుట్‌బాల్‌ను కూడా పంపుతారు. నాసా మూన్ బేస్ ప్రోగ్రామ్ మేనేజర్ కార్లోస్ గార్సియా-గలాన్ దీనిపై స్పందిస్తూ.. ఫుట్‌బాల్ బరువు చాలా తక్కువగా ఉండటం వల్ల దానిని చంద్రుడిపైకి తీసుకెళ్లడం పెద్ద సమస్యేమీ కాదని స్పష్టం చేశారు. అయితే అంతకంటే ముందు అమెరికా ఆటగాళ్లు మైదానంలో ఎదుర్కోవాల్సిన సవాల్ చాలా పెద్దదని ఆయన నవ్వుతూ వ్యాఖ్యానించారు.

టోర్నీలో దూసుకుపోతున్న అమెరికా

అమెరికా, మెక్సికో, కెనడాలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ 2026 ఫిఫా వరల్డ్ కప్‌లో గ్రూప్ D విజేతగా నిలిచిన టీమ్ USA.. ఇప్పటికే రౌండ్ ఆఫ్ 32 దశకు చేరుకుంది. జూలై 1న కాలిఫోర్నియాలోని శాంటా క్లారాలో బోస్నియా అండ్ హెర్జెగోవినాతో జరిగిన కీలక పోరుతో జట్టు ముందంజ వేసింది. ఇప్పటివరకు అమెరికా పురుషుల జట్టు ఒక్కసారి కూడా వరల్డ్ కప్ గెలవలేదు. అయితే మహిళల జట్టు మాత్రం అత్యధికంగా 4 సార్లు టైటిల్ గెలిచింది. ఈ నేపథ్యంలో నాసా ఇచ్చిన మూన్ ఛాలెంజ్ అమెరికా ఆటగాళ్లలో మరింత ఉత్సాహాన్ని నింపుతుందనడంలో సందేహం లేదు. గతంలో కూడా నాసా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఒక ఫిఫా బాల్‌ను పంపిన సంగతి తెలిసిందే.

Follow Us
సగ్గుబియ్యం వడలు.. ఇలా చేస్తే తింటే వంద రోగాలు మాయం!
సగ్గుబియ్యం వడలు.. ఇలా చేస్తే తింటే వంద రోగాలు మాయం!
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి