AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘Wiproలో లేఆఫ్‌.. అది నాకు దేవుడిచ్చిన వరం’ విప్రో మాజీ ఉద్యోగిని వీడియో వైరల్

ఐటీ కంపెనీల్లో వరుస లేఆఫ్‌లు ఉద్యోగుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. తాజాగా విప్రోలోనూ భారీగా ఉద్యోగాలు తొలగించారు. ఈ క్రమంలో ఢిల్లీలోని విప్రో (Wipro) సంస్థలో పనిచేసిన ఓ ఉద్యోగిని ఉద్యోగం కోల్పోయిన అనంతరం తన భావోద్వేగ వీడియోను సోషల్ మీడియాలో పంచుకోవడంతో అది కాస్త వైరల్‌గా మారింది.

'Wiproలో లేఆఫ్‌.. అది నాకు దేవుడిచ్చిన వరం' విప్రో మాజీ ఉద్యోగిని వీడియో వైరల్
Wipro Employees Layoff Video
Srilakshmi C
|

Updated on: Jul 02, 2026 | 4:50 PM

Share

ఐటీ దిగ్గజ సంస్థ WIPROలో ఐదున్నరేళ్లకు పైగా పనిచేసిన తర్వాత ఒక్కసారిగా ఉద్యోగం కోల్పోయిన ఓ యువతి తన బాధను నెటిజన్లతో పంచుకుంది. ఈ చర్య తనకు తీవ్ర నిరాశను కలిగించినప్పటికీ, ఇది తన జీవితంలో కొత్త అధ్యాయానికి దేవుడు ఇచ్చిన సంకేతం కావచ్చని ఆశా భావం వ్యక్తం చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియోలో అనుకృతి విద్యార్థి అనే యువతి.. తాను విప్రో ఏఐ సొల్యూషన్స్‌లో మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్స్ కోఆర్డినేటర్‌గా పనిచేసినట్లు తెలిపింది. జూన్ 29న తన మేనేజర్‌, హెచ్‌ఆర్‌తో మీటింగ్‌ జరగగా.. అది సాధారణ సమావేశం మాత్రమే అనుకుని ఆమె హాజరైంది. కానీ తన ఉద్యోగ బాధ్యతలు ఇక విప్రోకి అవసరం లేదని సంస్థను వీడాలని వారు చెప్పడంతో తాను ఒక్కసారిగా షాక్‌ అయినట్లు చెప్పుకొచ్చింది.

‘నేను ఇప్పుడు నిరుద్యోగిని. ఈ రోజు జూన్ 29, 2026. హెచ్‌ఆర్‌, మేనేజర్‌తో సమావేశం జరిగింది. అందులో నా జాబ్‌ అవసరం లేదని, సంస్థను వీడాలని చెప్పారు. నేను ఐదున్నరేళ్లకు పైగా పనిచేసిన సంస్థ నుంచి ఇలా వెళ్లాల్సి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదని’ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఇంతకాలం ఒకే సంస్థలో పనిచేయడంతో ఆ కార్యాలయం తన జీవితంలో భాగమైందని, ఒక్కసారిగా ఉద్యోగం కోల్పోవడం తనకు పెద్ద షాక్‌గా అనిపించిందని చెప్పింది. ఇప్పుడు తన భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియడం లేదని, మళ్లీ కార్పొరేట్ ఉద్యోగం దొరుకుతుందో లేదో? లేక సొంతంగా ఏదైనా వ్యాపారం ప్రారంభించాలో కూడా తెలియదని పేర్కొంది. తాను ఈ పరిస్థితిని ఎదుర్కొంటానని ఎప్పుడూ అనుకోలేదని, ఇక ముందు ఏమి చేయాలో తనకు స్పష్టత లేదని ఆవేదన వ్యక్తం చేసింది. సొంతంగా ఏదైనా ప్రారంభిస్తానో, మరో ఉద్యోగం వెతుకుతానో తెలియదని ఆమె చెప్పింది. ఉద్యోగం పోవడంతో ప్రతి నెలా వచ్చే జీతం ఆగిపోవడం తనకు పెద్ద ఆందోళనగా ఉందని తెలిపింది. ఇకపై నెల నెలా జీతం రాదు. భవిష్యత్తులో ఎక్కువ సంపాదిస్తానో, తక్కువ సంపాదిస్తానో కూడా తెలియదని ఆమె తీవ్ర భావోధ్వేగానికి గురైంది.

ఇవి కూడా చదవండి

అయితే ఈ పరిణామాన్ని సానుకూల దృక్పథంతో చూడాలని ప్రయత్నిస్తున్నానని అనుకృతి తెలిపింది. తాను స్వచ్ఛందంగా ఈ ఉద్యోగాన్ని ఎప్పటికీ వదిలి వెళ్లేదాన్ని కాదని, అందుకే దేవుడు తనను కొత్త మార్గంలో నడిపించేందుకు ఈ పరిస్థితిని తీసుకొచ్చి ఉండవచ్చని చెప్పింది. ఈ ఉద్యోగాన్ని నా ఇష్టంతో వదిలి వెళ్లేదాన్ని కాదనిపిస్తోంది. అందుకే దేవుడు ‘చాలు, ఇక కొత్త దారిలో వెళ్లాల్సిన సమయం వచ్చిందని చెప్పినట్లుగా భావిస్తున్నానని ఆమె చెప్పుకొచ్చింది. ఇక అనుకృతి పోస్టు చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వేలాది మందిని కదిలించింది. ఉద్యోగాలు కోల్పోయిన అనుభవం ఉన్న అనేక మంది ఆమెకు మద్దతు తెలిపారు. కార్పొరేట్ ప్రపంచంలో ఉద్యోగాల కోతలు ఇప్పుడు సాధారణమైపోయాయని, ధైర్యం కోల్పోవద్దని సూచించారు. మరికొందరు దీనిని కొత్త అవకాశంగా తీసుకుని ముందుకు సాగాలని, సొంత వ్యాపారం ప్రారంభించాలని ప్రోత్సహించారు. మీరు తప్పకుండా ఈ పరిస్థితిని అధిగమిస్తారు. మీ భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటున్నానని ఓ యూజర్‌ వ్యాఖ్యానించగా, మరొకరు నేను కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నానని తన బాధను షేర్‌ చేసుకున్నాడు. ఇంకొకరు మీ జీవితంలో మంచి రోజులు ముందున్నాయి. ఇది నిజంగానే కొత్త ప్రారంభానికి సంకేతం కావచ్చని ధైర్యం చెప్పారు.

Follow Us
కారవాన్‌లోనే బోర్డు మీటింగ్.. ఏపీ టూరిజం సరికొత్త ఆలోచన
కారవాన్‌లోనే బోర్డు మీటింగ్.. ఏపీ టూరిజం సరికొత్త ఆలోచన
బూందీ మిక్చర్‌లో కరకరలాడే బల్లి.. స్వీట్‌ షాప్‌పై కేసు, జరిమానా
బూందీ మిక్చర్‌లో కరకరలాడే బల్లి.. స్వీట్‌ షాప్‌పై కేసు, జరిమానా
పిచ్చి పీక్స్.. వ్యూస్ కోసం ట్రైన్‌లో యువకుడు చేసింది చూస్తే..
పిచ్చి పీక్స్.. వ్యూస్ కోసం ట్రైన్‌లో యువకుడు చేసింది చూస్తే..
బ్యాంక్ అకౌంట్లో్ అంతకంటే ఎక్కువ విత్ డ్రా చేస్తే ఇబ్బందులే..
బ్యాంక్ అకౌంట్లో్ అంతకంటే ఎక్కువ విత్ డ్రా చేస్తే ఇబ్బందులే..
ఇదేం మ్యాజిక్ భయ్యా.. మన తెలుగోడి స్కిల్‌కు ఎవరైనా ఫిదా..
ఇదేం మ్యాజిక్ భయ్యా.. మన తెలుగోడి స్కిల్‌కు ఎవరైనా ఫిదా..
ఈ నెలలోనే తొలి ఏకాదశి.. వీరికి ఆ రోజున మహర్దశ పట్టబోతోంది..
ఈ నెలలోనే తొలి ఏకాదశి.. వీరికి ఆ రోజున మహర్దశ పట్టబోతోంది..
పూజలో నేలపై కూర్చోవచ్చా? ఆసనం లేకుండా పూజ చేస్తే ఏమవుతుంది?..
పూజలో నేలపై కూర్చోవచ్చా? ఆసనం లేకుండా పూజ చేస్తే ఏమవుతుంది?..
'Wiproలో లేఆఫ్.. అది దేవుడిచ్చిన వరం' మాజీ ఉద్యోగిని వీడియో వైరల్
'Wiproలో లేఆఫ్.. అది దేవుడిచ్చిన వరం' మాజీ ఉద్యోగిని వీడియో వైరల్
ఏపీలో భారీ వర్షాలు.. ఈ జిల్లాల ప్రజలకు అలర్ట్..
ఏపీలో భారీ వర్షాలు.. ఈ జిల్లాల ప్రజలకు అలర్ట్..
Green Tea Vs Black Tea: వెయిట్ లాస్, షుగర్ కంట్రోల్‌కు ఏది బెస్ట్
Green Tea Vs Black Tea: వెయిట్ లాస్, షుగర్ కంట్రోల్‌కు ఏది బెస్ట్