AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పరోపకారమే పరమ ధర్మం.. మంచితనమే మహా మంత్రం.. మాయాచాప కథ

Magic Carpet Moral Story: దాహంతో అలమటిస్తున్న ఓ ముసలావిడకు నీళ్లు ఇచ్చిన రాము జీవితమే మారిపోయింది. దేవత ఇచ్చిన మాయా చాపతో హిమాలయాల నుంచి అరుదైన మూలిక తెచ్చి రాజకుమారిని రక్షించిన అతడి కథ పిల్లలకు గొప్ప స్ఫూర్తినిస్తుంది. స్వార్థం కోసం కాదు, ప్రజల మేలు కోసం మాయా చాపను ఉపయోగించిన రాము చివరకు రాజు ప్రశంసలు అందుకున్నాడు. సగం రాజ్యాన్ని తిరస్కరించి ప్రజాసేవను ఎంచుకున్న ఈ కథలో గొప్ప నీతి దాగి ఉంది..

పరోపకారమే పరమ ధర్మం.. మంచితనమే మహా మంత్రం.. మాయాచాప కథ
The Magic Carpet Moral Story
Srilakshmi C
|

Updated on: Jun 30, 2026 | 4:48 PM

Share

ఒక చిన్న గ్రామంలో తన వృద్ధ అమ్మమ్మతో కలిసి ఓ పేద బాలుడు జీవించేవాడు. వారికి తినడానికి సరిపడా ఆహారం కూడా ఉండేది కాదు. ఒకరోజు అడవిలో కట్టెల కోసం వెళ్లిన బాలుడు, అలసిపోయి చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్న ఓ ముసలావిడను చూశాడు. ఆమెకు దాహంగా ఉండటంతో తన దగ్గర ఉన్న కొద్దిపాటి నీటిని ఇచ్చి సహాయం చేశాడు. బాలుడి మంచితనానికి సంతోషించిన ఆ ముసలావిడ నిజానికి దివ్యశక్తులు కలిగిన ఒక వన దేవత. రాము మంచితనానికి మెచ్చిన ఆమె తన వద్ద ఉన్న ఓ చాపను బాలుడికి ఇచ్చింది. అదొక మాయా చాప. బహుమతిగా ఇచ్చింది. “ఈ చాపపై నిలబడి నీ కోరికను చెప్పు, అది నెరవేరుతుంది. కానీ దాన్ని ఎప్పుడూ స్వార్థం కోసం ఉపయోగించవద్దు” అని హెచ్చరించింది.

ఈ విషయం రాజుకు తెలిసింది. రాజు ఆ మాయా చాపను స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నించాడు. సైనికులను పంపించి చాపను రాజభవనానికి తీసుకురావించాడు. కానీ రాజు స్వార్థంతో అపారమైన బంగారం, సంపద కోరగానే చాప పనిచేయలేదు. ఎందుకంటే అది మంచితనం ఉన్నవారి చేతిలోనే పనిచేస్తుంది. ఇంతలో రాజు కుమార్తెకు వింత జబ్బు చేస్తుంది. రాజ్యంలో ఉన్న వైద్యులు ఎవరూ ఆమెను నయం చేయలేకపోయారు. ఓ వృద్ధ వైద్యుడు వచ్చి హిమాలయాలపైన ఉన్న ఓ అపూర్వ మూలిక తెచ్చి వైద్యం చేస్తేనే రాజకుమారి ప్రాణాలు దక్కుతాయని చెప్పాడు. అయితే అక్కడికి వెళ్లి రావడం సామాన్య మానవులకు సాధ్యం కాదని చెబుతాడు. దీంతో రాజు రాజ్యంతో చాటింపు వేయిస్తాడు. హిమాలయ పర్వతాలపై ఉన్న మూలికను తీసుకొస్తే.. వారికి తన రాజ్యంలోని సగభాగం ఇస్తానని చెబుతాడు. చాలా మంది ప్రయత్నించి వెనక్కివెళ్లిపోయారు. రాము ఈ విషయం తెలుసుకుని తన మాయా చాపను బయటకు తీశాడు. మనసులో హిమాయాలు తలచుకోగానే గాలిలో ఎగురుతూ క్షణాల్లో అతడిని మంచు పర్వతాలకు చేర్చింది. అక్కడ వెతికి మూలికను తీసుకుని రాజభవనానికి వస్తాడు. రాము తెచ్చిన మూలిక తో వైద్యులు మందు తయారు చేసి ఇచ్చారు. దీంతో రాజకుమారి కొద్దినిమిషాల్లోనే ఆరోగ్యం కుదుటపడి తేలుకుంటుంది.

రాము నిస్వార్థ సేవాభావాన్ని చూసి రాజు తన తప్పును గ్రహించాడు. మాయా చాపను తిరిగి ఇచ్చి బాలుడిని ఘనంగా సత్కరించాడు. అంతేకాకుండా తన మాట ప్రకారం రాజ్యంలో సగ భాగం ఇకపై నీకు సొంతం అవుతుందని చెబుతాడు. కానీ రాము ఎంతో వినయంగా నమస్కరించి.. మహరాజా.. ఓ పేదవాడిగా కష్టాల బరువు నాకు తెలుసు. మీ రాజ్యంలో ఎవరికైనా కష్టం వస్తే అక్కడి వెళ్లి వారికి సాయం చేసే అవకాశం ఇస్తే చాలు అంటాడు. దీంతో రాము మాటలకు రాజు ఆశ్చర్యపోయి తన రాజ్యంలో ప్రధానమంత్రిగా నియమించుకుంటాడు. అప్పటి నుంచి రాము రాజ్యంలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా మాయా చాప సాయంతో అక్కడికి వెళ్లి వారిని ఆదుకునే వాడు. రాజ్యంలోని ప్రజలందరూ అతని దయ, నిజాయితీని ప్రశంసించారు. పరోపకారం చేసే మనసు ఉంటే దైవం ఏదోఒక రూపంలో సహాయం చేస్తుంది.

నీతి

మంచి మనసుతో చేసిన సహాయం ఎప్పటికైనా ఫలిస్తుంది. స్వార్థం కంటే దయ, సేవాభావమే నిజమైన సంపద.

Follow Us