AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinema OTT: ఏముంది భయ్యా సినిమా.. రెండు రోజుల్లోనే ఓటీటీని ఊపేస్తుంది.. ధనుష్ మెచ్చిన చిన్న మూవీ..

థియేటర్లలో విడుదలయ్యే చిత్రాల మాదిరిగానే ఇప్పుడు ఓటీటీలోనూ పలు సినిమాలు, వెబ్ సిరీస్ లు దూసుకుపోతున్నాయి. రిలీజ్ అయిన మొదటి రోజు నుంచే పాజిటివ్ రివ్యూస్ అందుకుంటూ ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ మూవీ సైతం ఓటీటీని షేక్ చేస్తుంది.

Cinema OTT: ఏముంది భయ్యా సినిమా.. రెండు రోజుల్లోనే ఓటీటీని ఊపేస్తుంది.. ధనుష్ మెచ్చిన చిన్న మూవీ..
Modha Rathri
Rajitha Chanti
|

Updated on: Sep 20, 2026 | 7:01 AM

Share

ప్రస్తుతం ఓటీటీని ఊపేస్తున్న ఈ చిన్న సినిమా గురించి మీకు తెలుసా.. ? ఈ చిత్రాన్ని తమిళ్ స్టార్ హీరో ధనుష్ ప్రశంసిస్తూ ట్వీట్ కూడా చేశారు. “మీ కుటుంబంతో కలిసి ఈ సినిమాను థియేటర్లలో చూడటం అస్సలు మిస్ అవ్వకండి.” అంటూ రాసుకొచ్చారు ధనుష్. మనం మాట్లాడుకుంటున్న సినిమా పేరు మోద రాత్రి. తొలిసారిగా దర్శకత్వం వహిస్తున్న రాజా కరుప్పస్వామి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మోద రాత్రి’ చిత్రంలో రిషికాంత్ కథానాయకుడిగా నటించారు. అనిష్మా ఈ చిత్రంలో కథానాయికగా నటించారు. ఈ చిత్రానికి భరత్ శంకర్ సంగీతం అందించగా, మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు. ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం ఈ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Cinema : వెంకటేశ్ హీరోగా లవ్ స్టోరీ.. తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్.. తెలుగులో పెద్ద డిజాస్టర్..

ఆగస్ట్ 21న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఒక పెళ్లి అమ్మాయి, అబ్బాయి జీవితాన్ని ఎలాంటి మలుపులు తిప్పింది అనేది సినిమా. రూ. 3 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం రూ. 10 కోట్ల వరకు వసూలు చేసి సంచలనంగా మారింది. అయితే కొత్త సినిమాలు విడుదలవుతున్నప్పటికీ ఈ మూవీ క్రేజ్ మాత్రం తగ్గలేదు.

ఎక్కువ మంది చదివినవి : Folk Song: అబ్బబ్బ ఏమున్నది పాట.. డీజేలో మోత మోగిపోతుందిగా.. వింటే స్టెప్పేయాల్సిందే..

సెప్టెంబర్ 18న ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయిన ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా ప్రతి అమ్మాయి మనసులో మిగిలిపోయిన ఆశలు, ప్రేమను కోల్పోయి నిస్సహాయ స్థితిలో ఉన్న యువతికి అండగా నిలబడిన రిషికాంత్ పాత్రలు జనాలను ఆకట్టుకుంటున్నాయి. కార్తీక్ సుబ్బరాజ్, సింబు తదితరులు ఈ చిత్రాన్ని ప్రశంసించారు.

ఎక్కువ మంది చదివినవి : Udaya Bhanu: పస్తులు ఉండి ఇతరులకు అన్నం పెట్టిన గొప్ప వ్యక్తి ఆయన.. చివరకు అలాంటి పరిస్థితుల్లో.. ఉదయభాను ఎమోషనల్..

ఎక్కువ మంది చదివినవి : Udaya Bhanu: పస్తులు ఉండి ఇతరులకు అన్నం పెట్టిన గొప్ప వ్యక్తి ఆయన.. చివరకు అలాంటి పరిస్థితుల్లో.. ఉదయభాను ఎమోషనల్..

Follow Us