బంగారం ధరలు పెరిగినా తక్కువ ధరల్లో జ్యువెలరీస్‌ కొనడం ఎలాగో తెలుసా?

September 19, 2026

Subhash

చపాతీలు చేసిన కొద్దిసేపటికే గట్టిగా మారుతున్నాయా? సాయంత్రం వరకు కూడా మెత్తగా, రుచిగా ఉండాలంటే కొన్ని సింపుల్ కిచెన్ టిప్స్ పాటించాలి.

చపాతీలు మెత్తగా ఉండాలంటే

చపాతీ పిండి కలిపేటప్పుడు సాధారణ నీటికి బదులుగా కొద్దిగా వెచ్చని నీటిని ఉపయోగించండి. లేదంటే కొద్దిగా వేడి పాలు కూడా ఉపయోగించవచ్చు. ఇలా చేస్తే చపాతీలు మరింత మెత్తగా ఉంటాయి.

వెచ్చని నీటితో పిండి కలపండి

పిండి కలిపేటప్పుడు ఒక టీస్పూన్ కొబ్బరి నూనె, సన్‌ఫ్లవర్ ఆయిల్ లేదా నెయ్యి వేసి బాగా కలపండి. ఇది పిండిలో తేమను నిలుపుకోవడంలో సహాయపడుతుంది.

నూనె లేదా నెయ్యి కలపడం

పిండి కలిపిన తర్వాత వెంటనే చపాతీలు చేయకుండా కనీసం 15–20 నిమిషాలు పక్కన ఉంచండి. తడి వస్త్రం లేదా మూతతో కప్పి ఉంచితే పిండి బాగా సెట్ అవుతుంది.

పిండి కలిపిన వెంటనే

చపాతీని ఒత్తేటప్పుడు గోధుమ పిండి ఎక్కువగా చల్లడం వల్ల చపాతీ త్వరగా పొడిగా, గట్టిగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి అవసరమైనంత మాత్రమే పిండిని ఉపయోగించండి.

పిండి ఎక్కువగా చల్లకండి

చపాతీని తక్కువ మంటపై ఎక్కువసేపు కాల్చకండి. ముందుగా తవాను బాగా వేడి చేసి చపాతీని వేయాలి. ఎక్కువసేపు కాల్చడం వల్ల చపాతీలోని తేమ తగ్గి గట్టిగా మారుతుంది.

తవా బాగా వేడిగా ఉండాలి

చపాతీలు కాల్చిన వెంటనే వాటిని క్యాసరోల్‌లో పెట్టండి. లేదా శుభ్రమైన పొడి వస్త్రంలో చుట్టి ఉంచవచ్చు. ఇలా చేస్తే చపాతీలు ఎక్కువసేపు మెత్తగా ఉండేందుకు సహాయపడుతుంది.

చపాతీలను ఇలా భద్రపరచండి

వెచ్చని నీరు, కొద్దిగా నూనె లేదా నెయ్యి, 15–20 నిమిషాల విశ్రాంతి, సరైన మంట.. ఈ చిన్న విషయాలను పాటిస్తే చపాతీలు త్వరగా రబ్బర్‌లా గట్టిపడకుండా మెత్తగా ఉండేలా చేయవచ్చు.

ఈ చిన్న చిట్కాలతో చపాతీలు సాఫ్ట్‌గా