వైద్య రంగంలో విప్లవం.. వాసన చూసి క్యాన్సర్‌ను గుర్తిస్తున్న కుక్కలు.. ఒక్క నిమిషంలో 72 సాంపిల్స్
బెంగళూరుకు చెందిన డాగ్నోసిస్ స్టార్టప్, కుక్కల ఘ్రాణశక్తిని AI సాంకేతికతతో కలిపి క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తించే వినూత్న విధానాన్ని అభివృద్ధి చేస్తోంది. క్లినికల్ అధ్యయనాల్లో అధిక ఖచ్చితత్వాన్ని నమోదు చేసిన ఈ విధానం తక్కువ ఖర్చుతో ప్రాథమిక క్యాన్సర్ స్క్రీనింగ్‌కు ఉపయోగపడే అవకాశముందని పరిశోధకులు చెబుతున్నారు. అయితే ఇది ప్రస్తుతం వైద్య పరీక్షలకు ప్రత్యామ్నాయం కాదు.
అవును. “క్యాన్సర్ నిర్ధారణలో కొత్త అధ్యాయం మొదలైంది! సాధారణంగా ఇంటిని కాపాడే కుక్కలు, ఇప్పుడు ప్రాణాలు కాపాడే డాక్టర్ల పాత్ర పోషిస్తున్నాయి. అవును, “మనిషికి క్యాన్సర్ ఉందని తెలిసేలోపే… కుక్కలు వాసన చూసి దానిని పసిగడుతున్నాయి. అది కూడా పెద్ద పెద్ద మెషీన్లు, భారీ ఖర్చుతో కూడిన టెస్టులు అవసరం లేకుండా… కేవలం వాసన చూసి క్యాన్సర్‌ను పసిగట్టేస్తున్నాయి! ఇప్పటివరకు సైన్స్ ఫిక్షన్‌లా అనిపించిన ఈ అద్భుతం ఇప్పుడు నిజమవుతోంది! మరి, ఇంతకీ ఇది ఎలా సాధ్యం? కుక్కలకు ఈ అద్భుత శక్తి ఎలా వస్తుంది? వైద్య రంగంలో ఇది ఎలాంటి విప్లవం సృష్టించబోతోంది? ఇప్పుడు తెలుసుకుందాం!” బెంగళూరుకు చెందిన ‘డాగ్నోసిస్’ (Dognosis) అనే స్టార్టప్, కుక్కలకున్న అద్భుతమైన ఘ్రాణ శక్తికి, ఆధునిక కృత్రిమ మేధ (AI) సాంకేతికతను జోడించి ఈ సంచలన ప్రయోగాన్ని చేస్తోంది. ఇక్కడ 16 కుక్కలకు AI సాయంతో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. మనిషి శ్వాసలో ఉండే ‘VOCs’ ((Volatile Organic Compounds)) అనే ప్రత్యేకమైన వాసనల మార్పులను కుక్కలు సులభంగా పసిగడతాయి. మనుషుల కంటే కుక్కలకు వందల రెట్లు ఎక్కువ ఘ్రాణ శక్తి ఉండటమే దీనికి కారణం.” “ఈ ప్రయోగం ఎంత ప్రభావవంతమైనదో నిరూపించడానికి కర్ణాటకలోని ఆరు ఆస్పత్రుల్లో 3,275 మందిపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించారు. జర్నల్ ఆఫ్ క్లినికల్ ఆంకాలజీలో ప్రచురితమైన ఈ అధ్యయనం ప్రకారం, ప్రాథమిక దశలో ఉన్న క్యాన్సర్‌ను కూడా 90 శాతానికి పైగా ఖచ్చితత్వంతో గుర్తించగలిగారు. ప్రతి 10 మంది క్యాన్సర్ రోగుల్లో 9 మందిని ఇవి కచ్చితంగా గుర్తించాయి. ముఖ్యంగా, ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజెస్‌లో ఉన్న ప్రారంభ స్థాయి క్యాన్సర్‌లను కూడా ఇవి పసిగట్టగలిగాయి.”ముఖ్యంగా, ఒక్క నిమిషంలోనే 72 శ్వాస నమూనాలను (Breath Samples) పరీక్షించి, ఫలితాలను చెప్పడం దీని ప్రత్యేకత. “భారతదేశంలో క్యాన్సర్ స్క్రీనింగ్‌కు అయ్యే భారీ ఖర్చును ఇది తగ్గిస్తుంది. ప్రస్తుతం మనదేశంలో క్యాన్సర్ నిర్ధారణకు 20 వేల నుండి 65 వేల వరకు ఖర్చు అవుతోంది. ఈ కొత్త పద్ధతి వల్ల ఆ ఖర్చులో పదో వంతుకే ప్రాథమిక స్క్రీనింగ్ చేసే అవకాశం ఉందని డాగ్నోసిస్ ప్రతినిధి తెలిపారు. భవిష్యత్తులో ప్రభుత్వ భాగస్వామ్యంతో అమలు చేస్తే ప్రజలకు ఉచితంగా కూడా అందించే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో పైలట్ ప్రాజెక్టుల కోసం చర్చలు జరుగుతున్నాయి.” ముఖ్యంగా, క్యాన్సర్‌ను ప్రారంభ దశలో గుర్తిస్తే చికిత్స విజయవంతమయ్యే అవకాశాలు పెరగడంతో పాటు రోగులపై ఆర్థిక భారం కూడా గణనీయంగా తగ్గుతుందని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. ఎక్కువ ప్రమాదంలో ఉన్నవారిని గుర్తించి తదుపరి వైద్య పరీక్షలకు పంపించడమే తమ ఉద్దేశమని చెప్పారు. అధునాతన వైద్య సదుపాయాలు అందుబాటులో లేని గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో కూడా ఈ సాంకేతికతను ఉపయోగించవచ్చని సంస్థ తెలిపింది. భారీ మౌలిక సదుపాయాలు అవసరం లేకపోవడం వల్ల తక్కువ ఆదాయం ఉన్న ప్రాంతాల్లోనూ పెద్దఎత్తున క్యాన్సర్ స్క్రీనింగ్ నిర్వహించవచ్చని పేర్కొంది. బెంగళూరుకు దగ్గరలోని నీలమంగళలో ఉన్న డాగ్నోసిస్ (Dognosis) అనేది ఒక సాధారణ ల్యాబ్ కాదు. ఒక రౌండ్ ఆకారంలో ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన ట్రైనింగ్ సిస్టమ్. ఇక్కడ క్లోయీ (Chloe) అనే బీగిల్ జాతి కుక్క ప్రధాన ఆకర్షణ. ఆమెకు EEG హెల్మెట్, సెన్సార్ హార్నెస్ వంటి పరికరాలు అమర్చి, 12 స్టేషన్లలోని శ్వాస సాంపిల్స్‌ను వాసన చూపిస్తారు. క్యాన్సర్ ఉన్న సాంపిల్‌ను గుర్తించిన వెంటనే అది ఆగిపోతుంది. ఈ కుక్కలు.. క్యాన్సర్ మాత్రమే కాదు, మలేరియా, పార్కిన్సన్ వంటి వ్యాధులను కూడా వాసన ద్వారా గుర్తించగలవు.” “అయితే, కుక్క ఏం గుర్తించిందో మనం ఎలా తెలుసుకోవాలి? దీని కోసం డాగ్నోసిస్ ఆధునిక AI మరియు మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీని ఉపయోగిస్తోంది. కుక్క ప్రవర్తన, శ్వాస, మెదడు స్పందనలను సెన్సార్ల ద్వారా రికార్డ్ చేసి, ప్రతి కుక్కకు ఒక ‘డిజిటల్ ట్విన్’ లేదా ‘స్నిఫ్ డైరీ’(Sniff Diary)ని తయారు చేస్తున్నారు. ఒక వ్యక్తి పది నిమిషాల పాటు మాస్క్ ద్వారా శ్వాస తీసుకుంటే, ఆ సాంపిల్ ద్వారా క్యాన్సర్ ఉందో లేదో కుక్కలు పసిగట్టేస్తాయి.” ఇక “ఈ స్టార్టప్ ఇప్పటికే 3,000 మందిపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించింది. PET-CT స్కాన్ వంటి ఖరీదైన పరీక్షలకు ముందు ఒక ప్రాథమిక చెక్‌గా ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఒకవైపు లక్షల రూపాయల మెషీన్లు, మరోవైపు కేవలం వాసనతో నిర్ణయం తీసుకునే ఒక కుక్క. ఇది సంప్రదాయ వైద్యానికి ప్రత్యామ్నాయం కానప్పటికీ,భవిష్యత్తులో మన ఇంట్లోనే ఉండే ఒక స్క్రీనింగ్ కిట్‌గా ఇది మారబోతోంది. మనుషుల పట్ల అత్యంత విశ్వాసంగా ఉండే కుక్కలు, ఇప్పుడు ప్రాణాలు కాపాడే డాక్టర్‌లా మారడం నిజంగా గర్వించదగ్గ విషయం. భవిష్యత్తులో మనుషుల ప్రాణాలను కాపాడటంలో ఈ ‘బెస్ట్ ఫ్రెండ్స్’ ఎంతటి విప్లవాన్ని సృష్టించబోతున్నారో చూడాలి!”
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ధురందర్‌కి పోటీగా సినిమా తీసిన పాకిస్తాన్.. దాని పరిస్థితి ఎంత దారుణం అంటే
కిలాడీ కస్టమర్.. బిల్లు ఎగ్గొట్టేందుకు సీక్రెట్ ప్లాన్.. సీసీటీవీ చూసి షాకైన అధికారులు!
స్టూడెంట్ చెంపపై కొట్టిన టీచర్.. పాపం.. ఆ విద్యార్థి చెవికి
వాసన చూసి క్యాన్సర్‌ను గుర్తిస్తున్న కుక్కలు
కిలాడీ కస్టమర్.. బిల్లు ఎగ్గొట్టేందుకు సీక్రెట్ ప్లాన్..
స్టూడెంట్ చెంపపై కొట్టిన టీచర్.. పాపం.. ఆ విద్యార్థి చెవికి
బంగారాన్ని విరజిమ్ముతున్న అగ్ని పర్వతం!
పొలంలో బంగారు నిధులు.. కౌలుకు తీసుకునేందుకు రైతుల పోటీ
బెల్ట్ షాపులకు షాక్ ట్రీట్మెంట్.. మద్యం అమ్మితే కరెంట్ కట్!
కాల్ లిఫ్ట్ చేయలేదని మహిళను వేధించిన డెలివరీ బాయ్!

