హోంమంత్రి అనిత అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో పర్యటించారు. వర్షంలోనూ పింఛన్లు పంపిణీ చేస్తూ, పరిసరాల పరిశుభ్రతను పర్యవేక్షించారు. వీధి వ్యాపారి వద్ద మామిడి పండ్లు కొనుగోలు చేసి, స్థానిక టిఫిన్ షాప్ వద్ద గారెలు రుచి చూశారు. అనంతరం పీహెచ్సీ నూతన భవనాన్ని ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు.