AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: కారవాన్‌లో బోర్డు మీటింగ్.. ఏపీ ప్రభుత్వం సరికొత్త ఆలోచన..

ఏపీ ప్రభుత్వం సరికొత్త ఆలోచన చేసింది. కారవాన్‌లోనే బోర్డు మీటింగ్ పెట్టుకునేలా సరికొత్త ఆలోచన అమల్లోకి తెచ్చింది. ఈ మేరకు ఏపీ టూరిజం అభివృద్ది సంస్థ కొత్త సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది. తాజాగా ఈ సేవలు ప్రారంభించారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

Andhra Pradesh: కారవాన్‌లో బోర్డు మీటింగ్.. ఏపీ ప్రభుత్వం సరికొత్త ఆలోచన..
Ap
T Nagaraju
| Edited By: |

Updated on: Jul 02, 2026 | 4:48 PM

Share

ఏపిలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఇప్పటికే పర్యటక రంగానికి పరిశ్రమ హోదా ఇచ్చింది. పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆహ్వానిస్తుంది. బాపట్ల జిల్లాలోని సూర్యలంక బీచ్ ను బ్లూ ఫాగ్ బీచ్ అభివృద్ది చేస్తామని మంత్రి కందుల దుర్గేష్ చెబుతున్నారు. ఇక్కడ వంద కోట్ల రూపాయలతో అభివృద్ది పనులు జరుగుతున్నాయి. మరోవైపు రాష్ట్రంలో కారవాన్ టూరిజాన్ని ప్రమోట్ చేస్తున్నారు. వైజాగ్ తో పాటు సూర్యలంక వద్ద కూడా కారవాన్ లను అందుబాటులో ఉంచారు. ఈ క్రమంలోనే ఏపి టూరిజం అభివృద్ది సంస్థ ఛైర్మన్ నూకసాని బాలాజి సరికొత్త ఆలోచన చేశారు.

విజయవాడ నుండి సూర్యలంక కారవాన్ లో ప్రయాణిస్తూ బోర్డు మీటింగ్ నిర్వహించారు. సాధారణంగా పెద్ద పెద్ద హోటల్స్ లేదా కార్పోరేట్ కార్యాలయాల్లో మాత్రమే బోర్డు మీటింగ్స్ జరుగుతుంటాయి. అయితే కారవాన్ లో బోర్డు మీటింగ్ ఏర్పాటు చేసి అందరిని ఛైర్మన్ బాలాజీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఏపిటిడిసి ఛైర్మన్ బాలాజీతో పాటు డైరెక్టర్లు, సిఎస్ అజయ్ జైన్, ఏపి టూరిజం అథారటీ సీఈవో పద్మావతి కారవాన్ లో ప్రయాణిస్తూ టూరిజం అభివృద్దికి ఏయే చర్యలు తీసుకోవాలో చర్చించారు. ప్రత్యేకంగా అలకరించిన కారవాన్ లో కావడంతో స్థానికులు కూడా ఆసక్తిగా తిలకించారు. ఏపిలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే చర్యల్లో భాగంగానే బోర్డు మీటింగ్ వినూత్నంగా ఏర్పాటు చేసినట్లు ఛైర్మన్ బాలాజీ చెప్పారు. విజయవాడ పున్నమి రిసార్ట్స్ నుండి బయలు దేరిన కారవాన్ రెండున్నర గంటల తర్వాత సూర్యలంక బీచ్ కు చేరుకుంది. అక్కడ ఏపిటిడిసి సిబ్బంది బోర్డు సభ్యులకు ఘన స్వాగతం పలికారు.

కార్పోరేట్ సంస్థలకు కారవాన్ లను ఇచ్చేందుకు ఏపిటిడిసి సిద్దం చేసింది. కారవాన్ టూరిజాన్ని ప్రోత్సహించడంతో పాటు వివిధ ప్రముఖ పర్యాటక స్థలాలకు కారవాన్ లో వెళ్లేలాగా ప్రణాళికలు రూపొందించారు. సూర్యలంక బీచ్ వద్ద బోర్డు మీటింగ్ లో తీసుకున్న నిర్ణయాలను చైర్మన్ బాలాజీ, సిఎస్ అజయ్ జైన్ మీడియాకు వెల్లడించారు. సోలార్ బోట్లను ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. కొత్త హోటల్స్ పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు.

Follow Us
కారవాన్‌లోనే బోర్డు మీటింగ్.. ఏపీ టూరిజం సరికొత్త ఆలోచన
కారవాన్‌లోనే బోర్డు మీటింగ్.. ఏపీ టూరిజం సరికొత్త ఆలోచన
బూందీ మిక్చర్‌లో కరకరలాడే బల్లి.. స్వీట్‌ షాప్‌పై కేసు, జరిమానా
బూందీ మిక్చర్‌లో కరకరలాడే బల్లి.. స్వీట్‌ షాప్‌పై కేసు, జరిమానా
పిచ్చి పీక్స్.. వ్యూస్ కోసం ట్రైన్‌లో యువకుడు చేసింది చూస్తే..
పిచ్చి పీక్స్.. వ్యూస్ కోసం ట్రైన్‌లో యువకుడు చేసింది చూస్తే..
బ్యాంక్ అకౌంట్లో్ అంతకంటే ఎక్కువ విత్ డ్రా చేస్తే ఇబ్బందులే..
బ్యాంక్ అకౌంట్లో్ అంతకంటే ఎక్కువ విత్ డ్రా చేస్తే ఇబ్బందులే..
ఇదేం మ్యాజిక్ భయ్యా.. మన తెలుగోడి స్కిల్‌కు ఎవరైనా ఫిదా..
ఇదేం మ్యాజిక్ భయ్యా.. మన తెలుగోడి స్కిల్‌కు ఎవరైనా ఫిదా..
ఈ నెలలోనే తొలి ఏకాదశి.. వీరికి ఆ రోజున మహర్దశ పట్టబోతోంది..
ఈ నెలలోనే తొలి ఏకాదశి.. వీరికి ఆ రోజున మహర్దశ పట్టబోతోంది..
పూజలో నేలపై కూర్చోవచ్చా? ఆసనం లేకుండా పూజ చేస్తే ఏమవుతుంది?..
పూజలో నేలపై కూర్చోవచ్చా? ఆసనం లేకుండా పూజ చేస్తే ఏమవుతుంది?..
'Wiproలో లేఆఫ్.. అది దేవుడిచ్చిన వరం' మాజీ ఉద్యోగిని వీడియో వైరల్
'Wiproలో లేఆఫ్.. అది దేవుడిచ్చిన వరం' మాజీ ఉద్యోగిని వీడియో వైరల్
ఏపీలో భారీ వర్షాలు.. ఈ జిల్లాల ప్రజలకు అలర్ట్..
ఏపీలో భారీ వర్షాలు.. ఈ జిల్లాల ప్రజలకు అలర్ట్..
Green Tea Vs Black Tea: వెయిట్ లాస్, షుగర్ కంట్రోల్‌కు ఏది బెస్ట్
Green Tea Vs Black Tea: వెయిట్ లాస్, షుగర్ కంట్రోల్‌కు ఏది బెస్ట్