AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Green Tea Vs Black Tea: బరువు తగ్గేందుకు, షుగర్ కంట్రోల్‌కు ఏది బెస్ట్? అసలు తేడా ఇదే..

చాలా మందికి చాయ్ తాగనిదే రోజు ప్రారంభంకాదు. ఉదయాన టీ తాగిన తర్వాతే ఇంకో పని మొదలుపెడుతారు. అయితే ఆరోగ్య కారణాలతో సాధారణ పాలతో తయారు చేసే చాయ్‌ని తాగడం చాలా మంది తగ్గించేశారు. ఆరోగ్యం కోసం గ్రీన్ టీ లేదా బ్లాక్ టీ తాగుతున్నారు. ఈ రెండింటిలోనూ ఆరోగ్యానికి మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉంటాయి. అయితే బ్లడ్ షుగర్ నియంత్రణ, బరువు తగ్గేందుకు ఈ రెండింటిలో ఏది ఎక్కువ మేలు చేస్తుందన్న సందేహం చాలా మందిలో ఉంది.

Green Tea Vs Black Tea: బరువు తగ్గేందుకు, షుగర్ కంట్రోల్‌కు ఏది బెస్ట్? అసలు తేడా ఇదే..
Green Tea Vs Black Tea
Janardhan Veluru
|

Updated on: Jul 02, 2026 | 3:58 PM

Share

ఉదయం నిద్రలేచిన వెంటనే కప్పు టీతో రోజును ప్రారంభించడం చాలా మందికి అలవాటు. అయితే సాధారణ పాలు, చక్కెరతో చేసే చాయ్ తాగేవారి సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. ఆరోగ్య ప్రయోజనాల కోసం చాలా మంది గ్రీన్ టీ లేదా బ్లాక్ టీ తాగుతున్నారు. మరీ ముఖ్యంగా బ్లడ్ షుగర్ నియంత్రణ, గుండె ఆరోగ్యం, బరువు తగ్గాలనుకునే వారు ఎక్కువగా గ్రీన్ టీ లేదా బ్లాక్ టీ వైపే మొగ్గుచూపుతున్నారు. అయితే ఈ రెండింటిలో ఏది ఎక్కువ ఆరోగ్య ప్రయోజనం ఇస్తుందన్న సందేహం చాలా మందిలో ఉంటుంది.

గ్రీన్ టీ ప్రయోజనాలు ఏంటి..?

గ్రీన్ టీలో కాటెచిన్స్ (Catechins) అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలో ఏర్పడే హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే శరీరంలో వాపులను తగ్గించి, మెటాబాలిజంను వేగవంతం చేస్తాయి. గ్రీన్ టీ ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో సహాయపడుతుందని కొన్ని పరిశోధనల్లో తేలింది. దీంతో రక్తంలోని చక్కెరను కణాలు సమర్థంగా వినియోగించుకునే అవకాశం పెరుగుతుంది. అందుకే బ్లడ్ షుగర్ నియంత్రణలో గ్రీన్ టీ కొంత మెరుగైన ఫలితాలను ఇవ్వగలదని నిపుణులు సూచిస్తున్నారు. అదనంగా, క్రమం తప్పకుండా గ్రీన్ టీ తాగడం బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది.

బ్లాక్ టీ ప్రయోజనాలు ఏంటి..?

టీ ఆకులను పూర్తిగా ఆక్సీకరణ ప్రక్రియకు గురిచేయడం వల్ల తయారయ్యే బ్లాక్ టీలో థియాఫ్లేవిన్స్, థియారుబిగిన్స్ అనే ప్రత్యేక యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో, శరీర కణాలను రక్షించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కొన్ని అధ్యయనాలు బ్లాక్ టీ కూడా బ్లడ్ షుగర్ నియంత్రణకు దోహదపడుతుందని సూచిస్తున్నాయి. అయితే ఈ విషయంలో బ్లాక్ టీ కంటే గ్రీన్ టీ ప్రభావం కొంత ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. అయితే గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో బ్లాక్ టీ కూడా బాగా పనిచేస్తుంది.

ఇవి కూడా చదవండి

ఏ టీని ఎలా తయారు చేయాలి?

గ్రీన్ టీ లేదా బ్లాక్ టీ వల్ల పూర్తి ఆరోగ్య ప్రయోజనాలు పొందాలంటే దాన్ని సరైన విధంగా తయారు చేయడం కూడా చాలా ముఖ్యం.

గ్రీన్ టీ: నీటిని మరిగించి కొద్దిగా చల్లారిన తర్వాత గ్రీన్ టీ ఆకులను లేదా టీ బ్యాగ్‌ను 2 నుంచి 3 నిమిషాలు నానబెట్టాలి. ఎక్కువసేపు మరిగిస్తే పోషకాలు తగ్గిపోవడంతో పాటు చేదు రుచి వస్తుంది.

బ్లాక్ టీ: వేడి నీటిలో టీ ఆకులను లేదా టీ బ్యాగ్‌ను 3 నుంచి 5 నిమిషాలు ఉంచితే రుచి, సువాసనతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు కూడా బాగా విడుదల అవుతాయి.

బరువు తగ్గడానికి ఏది బెస్ట్?

బరువు తగ్గాలనుకునే వారికి గ్రీన్ టీ కొంత ఎక్కువ మేలు చేస్తుంది. ఎందుకంటే ఇందులోని కాటెచిన్స్, కెఫీన్ కలయిక శరీర జీవక్రియ(మెటబాలిజం) ను వేగవంతం చేసి కొవ్వు కరిగే ప్రక్రియకు సహాయపడుతుంది. అయితే కేవలం టీ తాగడం వల్ల మాత్రమే బరువు తగ్గడం సాధ్యం కాదు. సమతుల్య ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం కూడా అవసరం.

గ్రీన్ టీ, బ్లాక్ టీ రెండింటిలోనూ మంచి ఆరోగ్యానికి ఉపయోగపడే యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. బ్లడ్ షుగర్ నియంత్రణ, బరువు తగ్గడంలో గ్రీన్ టీ కొంత ఎక్కువ మేలు చేసే అవకాశముండగా.. గుండె ఆరోగ్య పరిరక్షణలో బ్లాక్ టీ కూడా సమానంగా ఉపయోగపడుతుంది. మీరు ఏ టీని ఎంచుకున్నా చక్కెర కలపకుండా తాగితేనే ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చు. మధుమేహం లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తమ వైద్యుడి సలహాతో ఆహారంలో మార్పులు చేసుకోవడం మంచిది.

Also Read: ఉడికించిన గుడ్డును ఇలా తింటే.. 30 రోజుల్లో జరిగే మ్యాజిక్ ఇదే..!

Follow Us