AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Silver: వెండి ఆభరణాలు నల్లబడితే అపశకునమా..? దీని వెనుకున్న సైన్స్ గురించి తెలుసా..?

Silver Jewellery: వెండి నగలు నల్లగా మారడాన్ని అపశకునంగా కొందరు భావిస్తారు.. ఇలా నల్లగా మారడం శరీరంలో ఏదైనా సమస్యకు సంకేతంగా మరికొందరు భావిస్తారు. అయితే వెండి నగలు ఇలా నల్లగా రంగు మారడం వెనుక శాస్త్రీయ కారణాలు ఉంటాయని కొందరికే తెలుసు. గాలిలోని సల్ఫర్ సమ్మేళనాలు, చెమట, కాలుష్యం, సౌందర్య సాధనాల్లోని రసాయనాల ప్రభావంతో వెండిపై నల్లటి పొర ఏర్పడుతుంది. సరైన భద్రపరిచే విధానం, క్రమం తప్పకుండా శుభ్రం చేయడం ద్వారా వెండి నగల మెరుపు ఎక్కువ కాలం ఉంటుంది.

Silver: వెండి ఆభరణాలు నల్లబడితే అపశకునమా..? దీని వెనుకున్న సైన్స్ గురించి తెలుసా..?
Silver Jewellery
Janardhan Veluru
|

Updated on: Jun 29, 2026 | 4:41 PM

Share

మనం రోజూ ఉపయోగించే వెండి నగలు కొంతకాలం తర్వాత నల్లగా మారిపోవడం చూస్తుంటాం. చాలామంది దీన్ని అపశకునంగానో లేదా శరీరంలో ఏదైనా సమస్యకు సంకేతంగానో భావిస్తుంటారు. అయితే వెండి ఇలా నల్లగా మారడానికి సైన్స్ కారణమని కొందరికి మాత్రమే తెలుసు. గాలిలో ఉండే కొన్ని రసాయనాలతో పాటు.. చెమట, కాలుష్యం, కాస్మోటిక్ ఐటమ్స్ కూడా వెండి ఆభరణాలు కొంతకాలానికి నల్లబడటానికి కారణం అవుతాయి. వెండి ఎందుకు నల్లబడుతుంది? దాన్ని ఎలా నివారించాలి? ఇప్పుడు తెలుసుకుందాం.

వెండి వస్తువులు గాలిలో ఉండే హైడ్రోజన్ సల్ఫైడ్ వాయువుతో చర్య జరుపుతాయి. దీని వల్ల వెండి ఉపరితలంపై సిల్వర్ సల్ఫైడ్ అనే నల్లటి పొర ఏర్పడుతుంది. మన చెమటలో సల్ఫర్ సమ్మేళనాలు, లవణాలు, ఇతర రసాయనాలు కూడా ఉంటాయి. కొంతమందిలో హార్మోన్ల మార్పులు లేదా శరీరంలోని ఆమ్లత్వం ఎక్కువగా ఉండటం వల్ల వారు ధరించిన వెండి నగలు ఇతరుల కంటే త్వరగా నల్లబడుతాయి.

అలాగే పర్ఫ్యూమ్‌లు, బాడీ స్ప్రేలు, లోషన్లు, సబ్బులు, షాంపూలు వంటి కాస్మిటిక్స్‌లో ఉండే రసాయనాలు వెండి ఆభరణాలపై పడితే దాని మెరుపు తగ్గి త్వరగా నల్లటి రంగులోకి మారుతుంది. అలాగే తీరప్రాంతాల్లో అధిక తేమ, వాహనాల పొగ, పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్య వాయువులు కూడా వెండి నల్లరంగులోకి మారే ప్రక్రియను వేగవంతం చేస్తాయి.

ఇవి కూడా చదవండి

స్వచ్ఛమైన వెండి కూడా నల్లబడుతుందా?

స్వచ్ఛమైన (99.9%) వెండి చాలా నెమ్మదిగా మాత్రమే నల్లబడుతుంది. అయితే నగల తయారీలో ఎక్కువగా 925 స్టెర్లింగ్ సిల్వర్ ఉపయోగిస్తారు. ఇందులో 92.5% వెండి, 7.5% రాగి వంటి ఇతర లోహాలు ఉంటాయి. ఈ రాగి గాలిలోని సల్ఫర్‌తో వేగంగా చర్య జరపడం వల్ల వెండి నగలు త్వరగా నల్లబడతాయి. ఉల్లిపాయలు, వెల్లుల్లి, ఉడికించిన గుడ్లలో సల్ఫర్ సమ్మేళనాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే వెండి ఉంగరాలు, వెండి గాజులు ధరించి వీటిని తరిగినా లేదా వాడినా కొన్నిసార్లు వెండి త్వరగా నల్లబడే అవకాశం ఉంటుంది.

వెండి నగలు నల్లబడకుండా ఉండాలంటే..?

  • వాడిన తర్వాత మెత్తటి పత్తి గుడ్డతో శుభ్రంగా తుడవాలి. గాలి చొరబడని జిప్‌లాక్ కవర్ లేదా ప్లాస్టిక్ డబ్బాలో భద్రపరచాలి. గాలి తగలకుండా ఉంటే అవి నల్లబడవు.
  • స్నానం, స్విమ్మింగ్ పూల్ లేదా కెమికల్స్ ఉపయోగించే సమయంలో వెండి నగలు తొలగించాలి. నీటిలోని కెమికల్స్ వల్ల కూడా వెండి పాడవుతుంది.
  • పర్ఫ్యూమ్, బాడీ స్ప్రే, క్రీములు వేసుకున్న వెంటనే వెండి నగలు ధరించకుండా ఉండాలి.

నల్లబడిన వెండిని ఎలా శుభ్రం చేయాలి?

నల్లబడిన వెండి వస్తువులను బేకింగ్ సోడా, కొద్దిగా నిమ్మరసం లేదా ప్రత్యేక సిల్వర్ క్లీనర్‌తో మెత్తటి వస్త్రం లేదా మృదువైన బ్రష్ సహాయంతో శుభ్రం చేస్తే మళ్లీ మెరుపు వస్తుంది. టూత్‌పేస్ట్‌ను ఉపయోగించినా.. గట్టిగా రుద్దడం వల్ల వెండి ఉపరితలంపై గీతలు పడే అవకాశం ఉంటుంది. అందువల్ల జాగ్రత్తగా ఉపయోగించడం మంచిది.

వెండి నల్లగా మారడం అనేది సహజమైన రసాయన ప్రక్రియ మాత్రమే. దీనికి అపశకునాలు లేదా మూఢనమ్మకాలతో సంబంధం లేదు. సరైన విధంగా భద్రపరచడం, తరచూ శుభ్రం చేయడం ద్వారా వెండి నగల మెరుపును చాలా కాలం పాటు కాపాడుకోవచ్చు.

Also Read: సాధారణ కాలేజీ అమ్మాయికి రూ.2 కోట్ల ప్యాకేజీ.. దేవశ్రీ విజయ రహస్యం ఇదే..

Follow Us
వెండి ఆభరణాలు నల్లబడితే అపశకునమా..? దీని వెనుకున్న సైన్స్..
వెండి ఆభరణాలు నల్లబడితే అపశకునమా..? దీని వెనుకున్న సైన్స్..
సహాయం చేసినవారిని కాలం మర్చిపోదు.. మాయా చాప నీతి కథ
సహాయం చేసినవారిని కాలం మర్చిపోదు.. మాయా చాప నీతి కథ
ఇలాంటోళ్లతో మా గడ్డపై అడుగుపెడితే.. ఇంగ్లాండ్ మాజీల ట్రోల్స్..
ఇలాంటోళ్లతో మా గడ్డపై అడుగుపెడితే.. ఇంగ్లాండ్ మాజీల ట్రోల్స్..
ఏటీఎం ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. కేంద్ర ప్రభుత్వం మరో అప్డేట్
ఏటీఎం ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. కేంద్ర ప్రభుత్వం మరో అప్డేట్
షార్ట్ వీడియో.. బిగ్‌ ప్రాబ్లమ్స్‌.. చూడడం తగ్గించకపోతే..
షార్ట్ వీడియో.. బిగ్‌ ప్రాబ్లమ్స్‌.. చూడడం తగ్గించకపోతే..
పారిజాతం పుష్పాలు 9 రకాలా? కిందపడిన పూలనే పూజలో ఎందుకు వాడాలి..
పారిజాతం పుష్పాలు 9 రకాలా? కిందపడిన పూలనే పూజలో ఎందుకు వాడాలి..
ఓబీసీ రిజర్వేషన్లపై బెంగాల్ సర్కార్ కీలక నిర్ణయం..!
ఓబీసీ రిజర్వేషన్లపై బెంగాల్ సర్కార్ కీలక నిర్ణయం..!
అతన్ని పక్కనబెట్టి.. వైభవ్‌ని ఆడించాలా? మీకసలు మైండ్ ఉందా?
అతన్ని పక్కనబెట్టి.. వైభవ్‌ని ఆడించాలా? మీకసలు మైండ్ ఉందా?
పిక్నిక్ వచ్చిన లేడీస్.. కార్ వెనుక అదిరిపోయే సెటప్.. కట్‌చేస్తే
పిక్నిక్ వచ్చిన లేడీస్.. కార్ వెనుక అదిరిపోయే సెటప్.. కట్‌చేస్తే
50 సినిమాల్లో ఒకే హీరోతో 40కి పైగా నటించింది.. కట్ చేస్తే
50 సినిమాల్లో ఒకే హీరోతో 40కి పైగా నటించింది.. కట్ చేస్తే