రైలు ప్రయాణికులకు షాకింగ్‌ న్యూస్‌.. ఇక అలా చేస్తే రెట్టింపు జరిమానా

June 29, 2026

Subhash

రైలులో టికెట్ లేకుండా ప్రయాణించే వారికి భారతీయ రైల్వే గట్టి షాక్ ఇచ్చింది. జరిమానాల నియమాలను సవరించింది.

టికెట్ లేకుండా ప్రయాణించే వారికి

ఇప్పటివరకు టికెట్ లేకుండా పట్టుబడితే కనీస జరిమానా రూ.250 ఉండేది. కానీ కొత్త నిబంధనల ప్రకారం దీన్ని ఏకంగా రూ.500 కి పెంచారు.

రెట్టింపైన జరిమానా

టికెట్ లేకుండా ప్రయాణిస్తే కేవలం రూ.500 పెనాల్టీ మాత్రమే కాదు, మీరు ప్రయాణించిన దూరానికి అయ్యే అసలు రైలు టికెట్ ఛార్జీని కూడా కలిపి వసూలు చేస్తారు.

అదనపు ఛార్జీలు కూడా

 రైల్వే చట్టం 1989 లోని సెక్షన్ 137, 138 లలో మార్పులు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ సరికొత్త నిర్ణయాన్ని తీసుకుంది. దీంతో టికెట్‌ లేకుండా ప్రయాణించే వారు జాగ్రత్తగా ఉండాలి.

కొత్త చట్టం ప్రకారం మార్పులు

మహిళల కోసం ప్రత్యేకించిన కోచ్‌లలోకి అనుమతి లేకుండా పురుషులు ప్రవేశిస్తే ఇకపై రూ.2500 జరిమానా విధిస్తారు. పదే పదే తప్పు చేస్తే జైలు శిక్ష కూడా తప్పదు.

లేడీస్ కోచ్‌లలోకి పురుషులు ప్రవేశిస్తే?

వేరొకరి పేరు మీద ఉన్న టికెట్‌తో ప్రయాణిస్తూ పట్టుబడితే ఆ టికెట్‌ను రద్దు చేయడమే కాకుండా కనీసం రూ.500 జరిమానా విధిస్తారు. అందుకే జాగ్రత్తగా ఉండండి.

ఇతరుల టికెట్లపై ప్రయాణం నేరం

రైళ్లు లేదా రైల్వే స్టేషన్ పరిసరాల్లో అనధికారికంగా వస్తువులు అమ్మడం, భిక్షాటన చేయడం, మద్యం సేవించి గొడవలు సృష్టిస్తే రూ.5000 వరకు జరిమానా లేదా జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

న్యూసెన్స్ చేస్తే

ధనవంతులు కావాలని అందరికీ ఉంటుంది. కానీ, అది రాత్రికి రాత్రే జరగదు. జీవితంలో సక్సెస్ సాధించిన వ్యక్తులు ప్రతిరోజూ పాటించే 5 ముఖ్యమైన అలవాట్లు ఇవే.

ధనవంతులు