ఇక నుంచి అలాంటివేమి కుదరవు..ఒక్కరోజే ఛాన్స్‌..కేంద్రం యాక్షన్‌ ప్లాన్‌

June 30, 2026

Subhash

మీరు ఇండేన్, భారత్ గ్యాస్ లేదా హెచ్‌పీ గ్యాస్ వాడుతున్నారా? అయితే జూలై 1 నుండి అమలు కాబోయే ఈ కొత్త నిబంధనలను ఖచ్చితంగా తెలుసుకోండి.

ఇండేన్, భారత్ గ్యాస్ 

కేంద్ర 'వన్ హౌస్‌హోల్డ్, వన్ గ్యాస్ కనెక్షన్' విధానాన్ని కఠినతరం చేస్తోంది. ఇంట్లో పైప్‌డ్ నేచురల్ గ్యాస్ ఉంటే, ఎల్‌పీజీ సిలిండర్ కనెక్షన్‌ను ఇకపై ఉంచుకోలేరు.

 రెండు కనెక్షన్లు కుదరవు

కొత్త నిబంధనల ప్రకారం, మీ ఇంటికి PNG కనెక్షన్ వచ్చిన 30 రోజులలోపు మీ పాత ఎల్‌పీజీ కనెక్షన్‌ను రద్దు చేసుకోవాలి. లేదంటే మీ ఎల్‌పీజీ సేవలు ఆటోమేటిక్‌గా నిలిచిపోతాయి.

30 రోజుల డెడ్‌లైన్ రూల్

మీ ప్రాంతంలో పీఎన్‌జీ నెట్‌వర్క్ ఉండి, మీరు కనెక్షన్ తీసుకున్న తర్వాత ఎల్‌పీజీ సిలిండర్ బుకింగ్ లేదా రీఫిల్లింగ్ చేయడానికి ఆయిల్ కంపెనీలు (IOCL, BPCL, HPCL) అనుమతించవు.

రీఫిల్లింగ్‌పై పూర్తి లాక్

LPG కనెక్షన్ సరెండర్ చేసేటప్పుడు 'ట్రాన్స్‌ఫర్ వోచర్' తీసుకోవచ్చు. భవిష్యత్తులో PNG లేని ప్రాంతానికి బదిలీ అయితే, మళ్లీ పాత కనెక్షన్‌ను పునరుద్ధరించుకోవచ్చు.

ఇల్లు మారే వారికి ఊరట..

ముఖ్యంగా ప్రధానమంత్రి ఉజ్వల యోజన (PMUY) లబ్ధిదారులు జూన్ 30 లోగా తమ ఎల్‌పీజీ ఖాతాకు ఈ-కేవైసీ పూర్తి చేయాలి. అలా చేయని వారికి జూలై 1 నుండి గ్యాస్ సబ్సిడీ ఆగిపోయే ప్రమాదం ఉంది.

గడువు

గ్యాస్ డెలివరీలో మోసాలను అరికట్టేందుకు ఓటీపీ ప్రాసెస్ తప్పనిసరి చేశారు. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీని డెలివరీ బాయ్‌కు చెబితేనే సిలిండర్ ఇస్తారు. 

ఓటీపీ చెబితేనే

నిబంధనల ఉల్లంఘన వల్ల గ్యాస్ కనెక్షన్ కట్ అవ్వకుండా ఉండాలంటే.. వెంటనే ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా లేదా మీ గ్యాస్ డీలర్‌ను కలిసి ఈ కేవైసీ, కనెక్షన్ సరెండర్ చేయండి.

యాక్షన్ ప్లాన్