LPG Cylinder: సామాన్యులకు షాక్.. భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు.. ఎంతంటే.!
అటు పెట్రోల్, డీజిల్.. ఇటు గ్యాస్ సిలిండర్.. అనుకున్నదంతా జరిగింది. దాదాపు ఐదు నెలల తర్వాత పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగితే..
అటు పెట్రోల్, డీజిల్.. ఇటు గ్యాస్ సిలిండర్.. అనుకున్నదంతా జరిగింది. దాదాపు ఐదు నెలల తర్వాత పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగితే.. తాజాగా గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా పెరిగాయి. సామాన్యులకు షాకిస్తూ చమురు సంస్థలు గ్యాస్ సిలిండర్ ధరలను భారీగా పెంచేశాయి. ఈ పెరిగిన ధరలు మంగళవారం నుంచి అమలులోకి వచ్చాయి. ఢిల్లీ, ముంబై, కోల్‌కతాతో పాటు ఇతర నగరాల్లో 14.2 కేజీల వంట గ్యాస్ సిలిండర్ ధరలను రూ. 50 మేరకు పెంచాయి. అలాగే 5 కేజీల గ్యాస్ సిలిండర్ ధర ఇప్పుడు రూ. 349కి చేరుకోగా.. 10 కేజీల సిలిండర్ ధర రూ. 669కి, 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ. 2003.50కి పెరిగింది.
పెరిగిన రేట్లను ఒకసారి పరిశీలిస్తే.. ఢిల్లీ, ముంబైలలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర రూ. 949.50కి చేరుకోగా.. కోల్‌కతాలో రూ. 976, చెన్నైలో రూ. 965, లక్నోలో రూ. 987, పాట్నాలో రూ. 1039కి గ్యాస్ సిలిండర్ ధర చేరుకుంది.
ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. తెలంగాణలో సిలిండర్ ధర రూ. 1002కి చేరుకోగా.. ఆంధ్రప్రదేశ్‌లో అయితే సిలిండర్ ధర రూ. 1008కు పెరిగింది. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల తర్వాత ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు కూడా పెరగడంతో సామాన్యులపై పెను భారం పడనుంది.
2021 అక్టోబర్ నుంచి సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులు లేకపోగా.. ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్‌లో పెరుగుతోన్న క్రూడ్ ఆయిల్ ధరలు, రూపాయి మారకం విలువ లాంటి అంశాలు సిలిండర్ ధరలు పెరుగుదలపై ప్రభావం చూపాయి.