Bike Buying Tips: పండుగ సీజన్‌లో బైక్‌ను కొనాలనుకుంటున్నారా? కొనుగోలు టైమ్‌లో ఈ టిప్స్ తీసుకోకపోతే ఇక అంతే..!
గ్రామీణ ప్రాంతాల్లో తగిని రవాణా సౌకర్యాలు అందుబాటులో లేకపోవడంతో గ్రామీణులు కచ్చితంగా ఇంటికి ఒకటి నుంచి రెండు ద్విచక్ర వాహనాలు వాడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కంపెనీలు కూడా అందరికీ అందుబాటు ధరల్లో ఉండేలా వాహనాలను రిలీజ్ చేయడంతో వాహనాల వినియోగం పెరిగింది. అయితే ప్రస్తుతం పెరిగిన టెక్నాలజీ కారణంగా ద్విచక్ర వాహనాల ధరలు కూడా క్రమేపి పెరిగాయి. ఈ నేపథ్యంలో పండుగలకు కంపెనీలు ఆఫర్లు ఇస్తూ వినియోగాదారులకు ఆకట్టుకుంటున్నాయి.
భారతదేశంలో వాహనాల వినియోగం విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా ప్రతి చిన్న అవసరానికి ద్విచక్ర వాహనం తప్పనిసరైంది. గతంలో సైకిల్స్ ద్వారా అవసరాలు తీర్చుకునే ప్రజలు క్రమేపి ద్విచక్ర వాహన వినియోగానికి అలవాటు పడ్డారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో తగిని రవాణా సౌకర్యాలు అందుబాటులో లేకపోవడంతో గ్రామీణులు కచ్చితంగా ఇంటికి ఒకటి నుంచి రెండు ద్విచక్ర వాహనాలు వాడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కంపెనీలు కూడా అందరికీ అందుబాటు ధరల్లో ఉండేలా వాహనాలను రిలీజ్ చేయడంతో వాహనాల వినియోగం పెరిగింది. అయితే ప్రస్తుతం పెరిగిన టెక్నాలజీ కారణంగా ద్విచక్ర వాహనాల ధరలు కూడా క్రమేపి పెరిగాయి. ఈ నేపథ్యంలో పండుగలకు కంపెనీలు ఆఫర్లు ఇస్తూ వినియోగాదారులకు ఆకట్టుకుంటున్నాయి. కాబట్టి పండుగ ఆఫర్లు ఇచ్చినప్పుడు బైక్ కొనుగోలు చేసే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో? ఓ సారి తెలుసుకుందాం.
బడ్జెట్‌ను నిర్ణయించుకోవడం
ప్రస్తుతం పెరిగిన ధరల్లో నేపథ్యంలో మన బడ్జెట్‌కు అనుగుణంగా ఉండేలా వాహనాలను ఎంచుకోవడం ముఖ్యం. అంతేకాకుండా ఆ వాహనాలు మన అవసరాలను ఏ మాత్రం తీరుస్తాయో? లెక్కలు వేసుకుని కొనుగోలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. మార్కెట్‌లో ఉండే విస్తృత ఎంపికల నేపథ్యంలో మీ అవసరాలు ఏంటో? కచ్చితంగా నిర్ణయించుకునే బైక్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
మోడల్ ఎంపిక
మీ ప్రాధాన్యత వినియోగం ఆధారంగా మోటర్‌సైకిల్ ఎంచుకోవాలి. ముఖ్యంగా సాధారణ వినియోగదారులకు అధిక మైలేజ్‌ను ఇచ్చేలా మార్కెట్‌లో బోలెడన్ని ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా యువత మైలేజ్ విషయాన్ని పట్టించుకోరు. వాళ్లు కేవలం మోటర్ సైకిల్ స్టైల్‌ను చూసి కొనుగోలు చేస్తారు. కాబట్టి ఎవరి అవసరానికి తగినట్లు వారు మోటర్ సైకిల్‌ను ఎంపిక చేసుకోవడం ముఖ్యం.
సమగ్ర పరిశోధన
మనకు ఎలాంటి వాహనం కావాలో నిర్ణయం తీసుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి మార్కెట్‌లో అందుబాటులో ఉన్న ఇతర కంపెనీల మోడల్స్‌ను కూడా బేరీజు వేయాలి. ముఖ్యంగా మంచి ఆఫర్స్ కోసం ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ మార్గాల్లో అన్వేషించడం చాలా ముఖ్యం. ముఖ్యంగా మీరు గ్రామీణ ప్రాంతాల్లోని వారైతే వాహనాల కొనుగోలు మెట్రో నగరాలకు వెళ్లడం మంచింది. ఎందుకంటే అక్కడ విస్తృత శ్రేణుల్లో వాహనాలు అందుబాటులో ఉండడమే కాకుండా అదిరిపోయే ఆఫర్లను కూడా పొందవచ్చు. ముఖ్యంగా కొంతమంది డీలర్లు వ్యాపారాన్ని పెంచుకోవడంతో పాటు టార్గెట్‌లను చేరుకోవడానికి మంచి ఆఫర్లను ఇస్తారు. కాబట్టి అలాంటి వారి గురించి తెలుసుకని వారి వద్ద బైక్‌ను కొనుగోలు చేస్తే తక్కువ ధరకే బైక్ లభిస్తుంది.
ఇతర చార్జీలపై అవగాహన
సాధారణంగా బైక్‌ను కొనుగోలు చేసే సమయంలో వాళ్లు మనకు కేవలం ఎక్స్ షోరూమ్ ధరను మాత్రమే పేర్కొంటారు. అయితే వీటికి అదనంగా ట్యాక్సులతో పాటు ఇతర యాక్ససరీస్ చార్జీలు వేస్తారు. కాబట్టి ఆయా చార్జీలపై అవగాహనతో ఉండడం చాలా ముఖ్యం. ముఖ్యంగా బీమా ఖర్చులు ఏ డీలర్లు తక్కువ వేస్తున్నారో? చూసుకోవడం చాలా ముఖ్యం. అలాగే సులభ వాయిదాల పద్ధతిలో బైక్ కొనుగోలు చేయాలనుకునే ఏ డీలర్ ఏ ఫైనాన్స్ కంపెనీతో ఒప్పంద కుదుర్చుకున్నాడో? ఆ కంపెనీల మనకు మార్కెట్‌లో ఇతర కంపెనీలకంటే తక్కువ వడ్డీకే బైక్ రుణం ఇస్తుందో? లేదో? తనిఖీ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి