SIP Investments: ఆ ఐదు పథకాల్లో ఇన్వెస్ట్‌ చేస్తే 42 శాతం అధిక ఆదాయం.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి మరి..

పెట్టుబడిదారులు ఇటీవల కాలంలో స్మాల్‌ క్యాప్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తే అధిక లాభాలు ఆర్జించవచ్చని మార్కెట్‌ నిపుణులు పేర్కొంటున్నారు. స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్-లేదా దలాల్ స్ట్రీట్‌లోని స్మాల్ క్యాప్ సెగ్మెంట్‌పై దృష్టి సారించిన మ్యూచువల్ ఫండ్‌లు ఆగస్టులో రూ. 4,265 కోట్లకు రికార్డు స్థాయిలో ఇన్‌ఫ్లోలు నమోదయ్యాయి. ఈ విభాగంలో వరుసగా ఐదో నెలలో కూడా ఇన్‌ఫ్లోలు వచ్చాయి.

SIP Investments: ఆ ఐదు పథకాల్లో ఇన్వెస్ట్‌ చేస్తే  42 శాతం అధిక ఆదాయం.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి మరి..
Mutual Funds
Follow us
Srinu

|

Updated on: Sep 23, 2023 | 7:00 PM

రిటైల్ ఇన్వెస్టర్లు తమ డబ్బును మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెడుతూ ఉంటారు. ఇందులో కూడా సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌ ద్వారా పెట్టుబడిను ఇష్టపడుతూ ఉంటారు. అయితే  మార్కెట్ అస్థిరత సమయంలో కూడా మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడిదారులకు రాబడి అందించడంతో ఈ ప్లాన్‌లు పెట్టుబడిదారులకు సాయం చేయవు. అయితే పెట్టుబడిదారులు ఇటీవల కాలంలో స్మాల్‌ క్యాప్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తే అధిక లాభాలు ఆర్జించవచ్చని మార్కెట్‌ నిపుణులు పేర్కొంటున్నారు. స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్-లేదా దలాల్ స్ట్రీట్‌లోని స్మాల్ క్యాప్ సెగ్మెంట్‌పై దృష్టి సారించిన మ్యూచువల్ ఫండ్‌లు ఆగస్టులో రూ. 4,265 కోట్లకు రికార్డు స్థాయిలో ఇన్‌ఫ్లోలు నమోదయ్యాయి. ఈ విభాగంలో వరుసగా ఐదో నెలలో కూడా ఇన్‌ఫ్లోలు వచ్చాయి. మొదటి ఐదు పథకాలు తమ పెట్టుబడిదారులకు రివార్డ్‌ని అందజేస్తున్నాయి. వార్షిక రాబడి 31-42 శాతంగా ఉంటుంది. కాబట్టి ఈ స్మాల్‌ క్యాప్‌ ఫండ్స్‌ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

స్మాల్ క్యాప్ ఫండ్స్

మ్యూచువల్ ఫండ్ పథకాలు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆధారంగా లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, మల్టీ క్యాప్ స్కీమ్‌లుగా వర్గీకరిస్తారు. 500 కోట్ల కంటే తక్కువ మార్కెట్ క్యాప్ ఉన్న స్మాల్ క్యాప్ కంపెనీల నిధులను స్మాల్ క్యాప్ ఫండ్స్గా పిలుస్తారు. సెబీ ప్రకారం స్మాల్ క్యాప్ పథకాలు తమ మొత్తం ఆస్తుల్లో కనీసం 80 శాతం స్మాల్ క్యాప్ కంపెనీల్లో పెట్టుబడి పెట్టాలి. నిబంధనల ప్రకారం,  స్మాల్ క్యాప్ ఫండ్స్ మార్కెట్ క్యాప్‌లో 251వ ర్యాంక్ నుంచి ప్రారంభమయ్యే కంపెనీలలో పెట్టుబడి పెడతాయి. స్మాల్ క్యాప్ ఫండ్స్ అధిక స్థాయి రిస్క్‌ను కలిగి ఉంటాయి. అయితే కంపెనీల వ్యాపారంలో వేగంగా వృద్ధి చెందుతుందనే అంచనాలు ఉన్నాయి. ఫండ్ హౌస్‌లు వారి వృద్ధి అంచనా ఆధారంగా పెట్టుబడి కోసం కంపెనీలను గుర్తిస్తాయి

క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్

గత ఐదు సంవత్సరాలలో క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్  సగటు ఎస్‌ఐపీ రాబడి సంవత్సరానికి 42.69 శాతంగా ఉంది. ఈ పథకంలో నెలవారీ రూ.10,000 పెట్టుబడి పెడితే ఏళ్లలో రూ.16.82 లక్షలకు పెరిగింది. ఈ పథకంలో కనీస పెట్టుబడి రూ. 5000. కనిష్ట ఎస్‌ఐపీ రూ. 1000.

ఇవి కూడా చదవండి

నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్

గత 5 సంవత్సరాలలో నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ సగటు ఎస్‌ఐపీ రాబడి సంవత్సరానికి 35.8 శాతంగా ఉంది. ఈ పథకంలో నెలవారీ రూ.10,000 పెట్టుబడి విలువ 5 ఏళ్లలో రూ.14.35 లక్షలకు పెరిగింది. ఈ పథకంలో కనీస పెట్టుబడి రూ. 5000. కనిష్ట ఎస్‌ఐపీ రూ. 1000.

హెచ్‌ఎస్‌బీసీ స్మాల్ క్యాప్ ఫండ్

ఐదు సంవత్సరాల్లో హెచ్‌ఎస్‌బీసీ స్మాల్ క్యాప్ ఫండ్ సగటు ఎస్‌ఐఈ రాబడి సంవత్సరానికి 31.82 శాతంగా ఉంది. ఈ పథకంలో నెలవారీ రూ.10,000 పెట్టుబడి విలువ ఐదేళ్లలో రూ.13.08 లక్షలకు పెరిగింది. ఈ పథకంలో కనీస పెట్టుబడి రూ. 5000. కనిస్ట ఎస్‌ఐపీ రూ. 1000గా ఉంటుంది. 

హెచ్‌డీఎఫ్‌సీ స్మాల్ క్యాప్ ఫండ్

ఐదు సంవత్సరాల్లో హెచ్‌డీఎఫ్‌సీ స్మాల్ క్యాప్ ఫండ్ సగటు ఎస్‌ఐపీ రాబడి సంవత్సరానికి 31.16 శాతంగా ఉంటుంది. ఈ పథకంలో నెలవారీ రూ.10,000 పెట్టుబడి విలువ ఐదేళ్లలో రూ.12.88 లక్షలకు పెరిగింది. ఈ పథకంలో కనీస పెట్టుబడి రూ. 100. కనిష్ట ఎస్‌ఐపీ రూ.100గా ఉంటుంది.

యూనియన్ స్మాల్ క్యాప్ ఫండ్

ఐదు సంవత్సరాలలో యూనియన్ స్మాల్ క్యాప్ ఫండ్ సగటు ఎస్‌ఐపీ రాబడి సంవత్సరానికి 30.41 శాతంగా ఉంది. ఈ పథకంలో నెలవారీ రూ.10,000 పెట్టుబడి విలువ ఐదేళ్లల్లో ఏళ్లలో రూ.12.65 లక్షలకు పెరిగింది. ఈ పథకంలో కనీస పెట్టుబడి రూ. 1,000గా ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి