Hyundai I-20: ఐ 20 నయా వెర్షన్ రిలీజ్ చేసిన హ్యూందాయ్.. ఫీచర్లు, ధర తెలిస్తే షాక్..
హ్యూందాయ్ కంపెనీ రిలీజ్ చేసిన ఐ 20 కారును చాలా మంది ఇష్టపడుతున్నారు. హ్యూందాయ్ కంపెనీ కార్లల్లో ఐ 20 ఓ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఈ నేపథ్యంలో హ్యూందాయ్ కార్ల ప్రియులను మరింత ఆకట్టుకునే ఐ 20 కారును అప్‌డేట్ చేస్తూ నయా ఫీచర్స్‌తో ఐ 20 ఎన్ కారును రిలీజ్ చేసింది. ఈ హ్యూందాయ్ ఐ 20 ఎన్ కారు ఫీచర్లు, ధర వంటి విషయాలను ఓ సారి తెలుసుకుందాం.
భారతదేశం కారు అంటే ఓ స్టేటస్ సింబల్‌లా ఫీలవుతుంటారు. ముఖ్యంగా ఇంటిళ్లపాది హ్యాపీగా టూర్లకు వెళ్లాలన్నా.. బయటకు వెళ్లాలన్నా కారు తప్పనిసరిగా మారింది. ముఖ్యంగా మధ్యతరగతి ఉద్యోగస్తులకు కారు అనేది ఓ కలగా ఉంటుంది. ఈ కలను నెరవేర్చుకోవడానికి తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు వచ్చే కార్లను ఇష్టపడుతూ ఉంటారు. అన్ని కార్ల కంపెనీలు కూడా భారతీయ కొనుగోలుదారులను దృష్టిలో పెట్టుకుని తక్కువ ధరల్లోనే ఎక్కువ ఫీచర్లు ఉండే కార్లను రిలీజ్ చేస్తున్నాయి. వీటిల్లో హ్యూందాయ్ కంపెనీ రిలీజ్ చేసిన ఐ 20 కారును చాలా మంది ఇష్టపడుతున్నారు. హ్యూందాయ్ కంపెనీ కార్లల్లో ఐ 20 ఓ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఈ నేపథ్యంలో హ్యూందాయ్ కార్ల ప్రియులను మరింత ఆకట్టుకునే ఐ 20 కారును అప్‌డేట్ చేస్తూ నయా ఫీచర్స్‌తో ఐ 20 ఎన్ కారును రిలీజ్ చేసింది. ఈ హ్యూందాయ్ ఐ 20 ఎన్ కారు ఫీచర్లు, ధర వంటి విషయాలను ఓ సారి తెలుసుకుందాం.
హ్యూందాయ్ ఐ 20 ఎన్ కారు ప్రారంభ ధర రూ.9.90 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. అంటే ఆయా రాష్ట్రాల ట్యాక్స్‌ల ఆధారంగా ధరలు కాస్త పెరగవచ్చు. ఈ హ్యూందాయ్ ఐ20 ఎన్ కారు ఫీచర్ల విషయానికి వస్తే ఈ కారు సిగ్నేచర్ డీఆర్‌ఎల్‌తో కూడిన ఎల్‌ఈడీ హెడ్ ల్యాంప్, పారామెట్రిక్ డిజైన్ ఫ్రంట్ గ్రిల్, ఎన్ బ్రాండింగ్‌తో 16 అంగుళాల సహా అనేక అప్‌డేట్స్‌తో ఈ కారు కచ్చితంగా వినియోగదారులను ఆకట్టుకుంటుందని హ్యూందాయ్ ప్రతినిధులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా ఈ కారు మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో పాటు డ్యుయల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్‌తో పని చేస్తుంది. సాధారణంగా ఐ 20 కార్లు అంటే దాని స్పోర్టీ లుక్ కోసం చాలా మంది కొనుగోలు చేస్తూ ఉంటారు. కాబట్టి ఐ 20 ఎన్ కారులో అదే స్పోర్టీ లుక్‌తో కారును డిజైన్ చేశారు.
ఐ 20 ఎన్ కారు 1.0 లీటర్ల టర్బో జీడీఐ ఇంజిన్ ద్వారా శక్తిని పొందుతుంది. ఈ కారు గరిష్టంగా 120 పీఎస్ శక్తిని, 172 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ముఖ్యంగా ఈ కారు 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్లు, 7 స్పీడ్ డ్యుయల్ క్లచ్ ట్రాన్సిమిషన్లతో పని చేస్తుంది. ముఖ్యంగా ఈ కారు ఎన్6, ఎన్ 8 ట్రిమ్స్‌తో వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. అలాగే భద్రతా విషయానికి వస్తే ఈ కారు 6 ఎయిర్ బ్యాగ్స్‌తో వస్తుంది. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ స్టెబులిటీ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్, వెహికల్ స్టెబులిటీ మేనేజ్‌మెంట్ వంటి స్టాండర్డ్ భద్రతా లక్షణాలు ఈ కారు ప్రత్యేకతలు. పాయింట్ సీట్ బెల్టుతో పాటు సీట్ బెల్టు రిమైండర్ ఆకర్షణీంగా ఉంటాయి. అలాగే ఈ కారు డిజైన్ అందరినీ ఆకట్టుకునేలా ఉండడంతో నలుగురిలో మీ ప్రత్యేకత తెలుస్తుంది. ముఖ్యంగా ఈ కారు కలర్ ప్యాట్రన్ అందిరినీ ఆకర్షిస్తుంద. హ్యూందాయ్ ఐ 20 ఎన్ కారు కొత్త అబిస్ బ్లాక్ కలర్‌తో సహా 5 మోనోటిన్, రెండు డ్యుయల్ టోన్ కలర్ ఆప్సన్స్‌లో కొనుగోలు అందుబాటులో ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..