LIC: జీవిత బీమా తీసుకుంటున్నారా.. ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోండి.. ఆ పొరపాట్లు మాత్రం అసలు చేయకండి..

Life insurance policy: భవిష్యత్తు భద్రత కోసం చాలా మంది జీవిత బీమా పాలసీలను ఎంచుకుంటారు. మనకు వచ్చే ఆదాయం, వయసు, భవిష్యత్తు ఆలోచన ఆధారంగా కవరేజీని ఎంచుకోవల్సి ఉంటుంది. బీమా చేసే వ్యక్తి ఎంచుకున్న ప్రీమియం చెల్లించడానికి భారం కాకుండా ఉండేలా..

LIC: జీవిత బీమా తీసుకుంటున్నారా.. ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోండి.. ఆ పొరపాట్లు మాత్రం అసలు చేయకండి..
Lic Scheme
Follow us
Amarnadh Daneti

|

Updated on: Jan 12, 2023 | 9:10 AM

Life insurance policy: భవిష్యత్తు భద్రత కోసం చాలా మంది జీవిత బీమా పాలసీలను ఎంచుకుంటారు. మనకు వచ్చే ఆదాయం, వయసు, భవిష్యత్తు ఆలోచన ఆధారంగా కవరేజీని ఎంచుకోవల్సి ఉంటుంది. బీమా చేసే వ్యక్తి ఎంచుకున్న ప్రీమియం చెల్లించడానికి భారం కాకుండా ఉండేలా ఉంటే ఆ వ్యక్తి పూర్తికాలం పాలసీని కొనసాగించే అవకాశం ఉంటుంది. స్థోమతకు మించి ప్రీమియాన్ని ఎంచుకున్నట్లయితే పూర్తికాలం చెల్లించలేక, మధ్యలోనే పాలసీని ఆపేసే పరిస్థితులు ఏర్పడతాయి. అందుకే పాలసీని ఎంచుకునేటప్పుడు అన్ని విషయాలను ఆలోచించుకోవాలి. బీమా చేసే వ్యక్తి ఎంచుకున్న కవరేజీ, కాలపరిమితి ఆధారంగా చెల్లించాల్సిన ప్రీమియాన్ని లెక్కిస్తారు. జీవిత బీమా అనేది బీమా సంస్థ, పాలసీ తీసుకునే వ్యక్తి మధ్య జరిగే ఒప్పందం. వ్యక్తి జీవితకాలంలో పాలసీదారు చెల్లించిన ప్రీమియానికి బదులుగా బీమా చేసిన వ్యక్తి మరణించినప్పుడు నామినీకి బీమా కవరేజీని చెల్లించడానికి సంస్థ హామీ ఇస్తుంది. పాలసీ తీసుకునేటప్పుడు తప్పనిసరిగా దరఖాస్తులో బీమా చేసే వ్యక్తి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితులను తప్పనిసరిగా తెలియజేయాలి. దీర్ఘకాలిక వ్యాధులు ఏవైనా ఉన్నట్లయితే ముందుగానే దరఖాస్తులో తెలియజేయాలి. వ్యక్తి యొక్క ఆరోగ్య పరిస్థితి, వయస్సు ఆధారంగా అనేక రకమైన పాలసీలు అందుబాటులో ఉన్నాయి. పాలసీ చేసే వ్యక్తి అవసరాలకు అనుగుణంగా దీర్ఘ కాలిక పాలసీని ఎంచుకోవాలా, స్వల్ప కాలపరిమితిలో పాలసీని ఎంచుకోవాలా అనేది నిర్ణయించుకోవాలి.పాలసీ తీసుకునే వ్యక్తులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.

పాలసీ కాలపరిమితి

జీవిత బీమా పాలసీ యొక్క కాలపరిమితిని ఎంచుకోవడం చాల ఆముఖ్యం. పదవీ విరమణ వయస్సులోంచి ప్రస్తుత బీమా చేసే వ్యక్తి వయసను ను తీసివేయాలి. ఉదాహరణకు ప్రస్తుత వయసు 30 సంవత్సరాలు అనుకోండి.. 60 ఏళ్లకు పదవీ విరమణ చేయాలనుకుంటే పాలసీ వ్యవధిని 60-30= 30 సంవత్సరాలకు తక్కువ కాకుండా ఉండేలా ఎంచుకోవాలి.

పాలసీ ఎందుకు చేస్తున్నారో స్పష్టత

పాలసీ తీసుకునేటప్పుడు ఏ అవసరాల కోసం తీసుకుంటున్నామో స్పష్టత ఉండాలి. కుటుంబ ఆర్థిక భద్రతను కాపాడటం వ్యక్తి యొక్క ప్రాథమిక లక్ష్యం అయితే.. తక్కువ ప్రీమియంతో అధిక కవరేజీని అందించే టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను ఎంచుకోవడం మంచిది.

ఇవి కూడా చదవండి

బీమాలో కవరేజి ఎంత..

వ్యక్తి ఎంచుకున్న పాలసీ కవరేజ్ ఎంత అనేదానిపై ప్రీమియం ఆధారపడి ఉంటుంది. సాధారణంగా వార్షిక ఆదాయానికి కనీసం పది రెట్లు జీవిత బీమా కవరేజిని కలిగి ఉండాలి.

అదనపు ప్రయెజనాలు

జీవిత బీమా పాలసీతో పాటు అదనపు రుసుము చెల్లించి క్రిటికల్ ఇల్నల్ రైడర్, యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ రైడర్ వంటివాటిని యాడ్ చేసుకోవచ్చు. నామమాత్రపు ప్రీమియంలను చెల్లించడం ద్వారా వీటిని ఎంపిక చేసుకోవచ్చు.

విషయాలన్ని స్పష్టంగా చెప్పాలి

పొగాకు లేదా ఆల్కహాల్ తీసుకుంటే, లేదా ప్రమాదకర పరిశ్రమలో పని చేస్తే, ఈ వివరాల గురించి జీవిత బీమా సంస్థకు పాలసీ తీసుకునే ముందే తెలియజేయాలి. పాలసీ తీసుకునే వ్యక్తి అనారోగ్యంతో ఉన్నా, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నా ముందే తెలియజేయాలి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయాలను తెలియజేయాలి. ముందే వాస్తవాలు తెలియజేయకపోతే.. బీమా క్లెయిమ్‌లో ఇబ్బందులు పడే అవకాశం ఉండొచ్చు.

నిబంధనలు  మొత్తం తెలుసుకోవాలి

పాలసీ తీసుకునేటప్పుడు షరతులను తప్పనిసరిగా చదవాలి. అన్ని విషయాలు ముందుగానే తెలుసుకోవాలి.

చిన్న వయస్సులోనే పాలసీ తీసుకోండి

చిన్న వయస్సులో ఉన్నప్పుడే పాలసీ తీసుకుంటే చెల్లించాల్సిన ప్రీమియంలు తక్కువగా ఉంటాయి. అందువల్ల, మీరు సంపాదించడం ప్రారంభించిన వెంటనే మీ జీవిత బీమా పాలసీని కొనుగోలు చేస్తే ప్రీమియం భారంగా అనిపించదు.

మరిన్ని  బిజినెస్ వార్తల కోసం చూడండి..

అది.. అదుంటే.. నిందించిన వారికి సమాధానం చెప్పొచ్చు.! సమంత పోస్ట్!
అది.. అదుంటే.. నిందించిన వారికి సమాధానం చెప్పొచ్చు.! సమంత పోస్ట్!
అందవిహీనంగా మారే రోగంతో బాధపడుతున్న హీరోయిన్.! వీడియో..
అందవిహీనంగా మారే రోగంతో బాధపడుతున్న హీరోయిన్.! వీడియో..
వైల్డ్ ఫైర్‌ పుష్ప రాజ్ కి బెస్ట్ విషెస్.. నంద్యాల వైసీపీ Ex-MLA
వైల్డ్ ఫైర్‌ పుష్ప రాజ్ కి బెస్ట్ విషెస్.. నంద్యాల వైసీపీ Ex-MLA
శంకర్‌తో గొడవకు పోయి.. హిట్టు సినిమా వదులుకున్న షారుఖ్.!
శంకర్‌తో గొడవకు పోయి.. హిట్టు సినిమా వదులుకున్న షారుఖ్.!
అక్కడి పురాతన గుడిలో సినిమా మొదలు.? రామ్ చరణ్ సెంటిమెంట్ ఆ.!
అక్కడి పురాతన గుడిలో సినిమా మొదలు.? రామ్ చరణ్ సెంటిమెంట్ ఆ.!
54 ఏళ్ల వయసులో.. హాట్ నటితో ఘాటు ప్రేమాయణం.! నెక్స్ట్ పెళ్లా.?
54 ఏళ్ల వయసులో.. హాట్ నటితో ఘాటు ప్రేమాయణం.! నెక్స్ట్ పెళ్లా.?
వివాదంలో రామ్‌ చరణ్ అయ్యప్ప ఐక్యవేదిక సీరియస్| రికార్డుల వేటమొదలు
వివాదంలో రామ్‌ చరణ్ అయ్యప్ప ఐక్యవేదిక సీరియస్| రికార్డుల వేటమొదలు
భారత్‌-జర్మనీ మధ్య సుస్థిర అభివృద్ధికి రోడ్‌మ్యాప్‌..!
భారత్‌-జర్మనీ మధ్య సుస్థిర అభివృద్ధికి రోడ్‌మ్యాప్‌..!
రాజకీయాలకు పోసాని గుడ్‌బై.. ఇకపై ఆఖరి శ్వాస వరకు..
రాజకీయాలకు పోసాని గుడ్‌బై.. ఇకపై ఆఖరి శ్వాస వరకు..
పుష్ప2 కోసం ఏకంగా నలుగురు మ్యూజిక్ డైరెక్టర్స్.! సుక్కు దెబ్బ అది
పుష్ప2 కోసం ఏకంగా నలుగురు మ్యూజిక్ డైరెక్టర్స్.! సుక్కు దెబ్బ అది