AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LIC Jeevan Kiran: ఇది కదా ఎల్ఐసీ అంటే.. కొత్త పాలసీ అదిరింది.. గతంలో ఎన్నడూ లేనంతగా ప్రయోజనాలు..

ఎల్ఐసీ జీవీన్ కిరణ్ అనే కొత్త ప్లాన్ ను పరిచయం చేసింది. జూలై 27నే దీనిని మన దేశంలో ఆవిష్కరించింది. ఇది టర్మ్ పాలసీ అయినప్పటికీ మీరు చెల్లించిన మొత్తాన్ని తిరిగి పొందే వీలుంటుంది. అంతేకాక యాక్సిడెంట్ కవర్ కూడా ఉంటుంది.

LIC Jeevan Kiran: ఇది కదా ఎల్ఐసీ అంటే.. కొత్త పాలసీ అదిరింది.. గతంలో ఎన్నడూ లేనంతగా ప్రయోజనాలు..
Lic new plan
Madhu
| Edited By: Ram Naramaneni|

Updated on: Jul 29, 2023 | 9:33 AM

Share

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసీ) మన దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన బీమా సంస్థ. దీనిలో వందలాది పథకాలు ఉన్నా.. ఎప్పుడైనా కొత్త పథకం ప్రారంభిస్తే అందరికీ దానిపై అమితమైన ఆసక్తి ఉంటుంది. దానిలో ఉండే ప్రయోజనాలు ఏంటి? పాలసీ వివరాలు ఏంటి అని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తారు. ఎల్ఐసీ కూడా వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా కొత్త ప్లాన్లను పరిచయం చేస్తోంది. ఇప్పడు ఎల్ఐసీ జీవీన్ కిరణ్ అనే కొత్త ప్లాన్ ను పరిచయం చేసింది. జూలై 27నే దీనిని మన దేశంలో ఆవిష్కరించింది. ఇది టర్మ్ పాలసీ అయినప్పటికీ మీరు చెల్లించిన మొత్తాన్ని తిరిగి పొందే వీలుంటుంది. అంతేకాక యాక్సిడెంట్ కవర్ కూడా ఉంటుంది. వాస్తవానికి టర్మ్ పాలసీల్లో కట్టిన ప్రీమియంలు తిరిగివ్వరు. అయితే దీనిలో కొన్ని మార్పులు చేశారు. ఈ నేపథ్యంలో ఎల్ఐసీ కొత్త ప్లాన్ జీవన్ కిరణ్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

ఎల్‌ఐసీ జీవన్ కిరణ్ ప్లాన్..

ఎల్‌ఐసీ ‘జీవన్ కిరణ్’ అనే ప్లాన్ నాన్-లింక్డ్, నాన్ పార్టిసిటింగ్ పాలసీ. ప్లాన్‌లో రెండు రకాల ఐచ్ఛిక రైడర్‌లు ఉన్నాయి- ప్రమాదవశాత్తు మరణం, వైకల్యం ప్రయోజనం రైడర్, ప్రమాద ప్రయోజన రైడర్. పాలసీదారులు అదనపు ప్రీమియం చెల్లించడం ద్వారా అటువంటి రైడర్‌లను ఎంచుకోవచ్చని ఎల్‌ఐసీ ప్రకటనలో పేర్కొంది. అంతేకాకుండా, 5 సంవత్సరాలలో మెచ్యూరిటీ/డెత్ బెనిఫిట్ పొందేందుకు సెటిల్మెంట్ ఆప్షన్ అందుబాటులో ఉందని పేర్కొంది.

ప్లాన్ ప్రయోజనాలు ఇవి..

మెచ్యూరిటీ.. ప్లాన్ తీసుకున్న వ్యక్తి మెచ్యూరిటీ సమయానికి బతికి ఉంటే పన్నులు మినహాయించి, మీరు చెల్లించిన మొత్తం ప్రీమియం ను వెనక్కి ఇచ్చేస్తారు.

ఇవి కూడా చదవండి

మరణం.. పాలసీ తీసుకున్న వ్యక్తి మధ్యలోనే మరణించిన సందర్భంలో మరణంపై హామీ మొత్తం చెల్లించబడుతుంది. ఆ హామీ మొత్తం ఇలా ఉంటుంది.

  • సాధారణ ప్రీమియం చెల్లింపు పాలసీల వారికి అత్యధికంగా 7 రెట్లు వార్షిక ప్రీమియం లేదా మరణించిన తేదీ వరకు “మొత్తం చెల్లించిన ప్రీమియం”లో 105 శాతం లేదా ప్రాథమిక హామీ మొత్తం.
  • సింగిల్ ప్రీమియం పాలసీలపై సింగిల్ ప్రీమియం లేదా బేసిక్ సమ్ అష్యూర్డ్‌లో 125 శాతం కంటే ఎక్కువ ఇస్తారు.

ఫీచర్లు ఇవి..

  • ఈ ప్లాన్ ప్రీమియం రిటర్న్‌తో లైఫ్ కవర్‌ను అందిస్తుంది.
  • 18 సంవత్సరాల వయస్సు నుంచి 65 సంవత్సరాల వయస్సు వరకు ఎవరైనా ప్లాన్ తీసుకోవచ్చు.
  • మితమైన లైఫ్ కవరేజీ కోసం ప్లాన్‌లో కనీస హామీ మొత్తం రూ. 15 లక్షలు.
  • పాలసీ వ్యవధి 10 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల వరకు ఉంటుంది.
  • ధూమపానం చేయనివారికి, ధూమపానం చేసేవారికి ప్రీమియం రేట్లు భిన్నంగా ఉంటాయి.
  • ప్రీమియం చెల్లింపును సింగిల్ ప్రీమియం ద్వారా లేదా పాలసీ వ్యవధికి చెల్లించాల్సిన సాధారణ ప్రీమియం ద్వారా చేయవచ్చు.
  • సాధారణ ప్రీమియం పాలసీలకు కనీస వాయిదాల ప్రీమియం రూ.3,000, సింగిల్ ప్రీమియం పాలసీలకు రూ.30,000.

ఎలా కొనుగోలు చేయాలంటే..

ఎల్ఐసీ అధికారిక వెబ్‌సైట్‌లో ప్లాన్ ఆన్‌లైన్‌లో అమ్మకానికి అందుబాటులో ఉంది. ఇది ఏజెంట్లు, కార్పొరేట్ ఏజెంట్లు, బ్రోకర్లు, బీమా మార్కెటింగ్ సంస్థలు (ఐఎంఎఫ్) ద్వారా ఆఫ్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..