LIC Aadhaar Shila: మహిళలకు ఎల్ఐసీ బంపర్ ఆఫర్.. కేవలం రోజుకు రూ. 87పెట్టుబడితో రూ. 11లక్షలు సంపాదించే అవకాశం..
మహిళల కోసం మరో ప్రత్యేకమైన ప్లాన్ ను తీసుకొచ్చింది. దాని పేరు ఎల్ఐసీ ఆధార్ షిలా. ఈ పాలసీలో పొదుపుతో పాటు బీమా ప్రయోజనాలు ఉంటాయి. దీర్ఘకాలంలో అధిక సంపదను నిర్మించడంతో పాటు ఊహించని సంఘటనల సమయంలో కుటుంబానికి ఆర్థిక రక్షణను అందిస్తుంది. ఈ ఆధార్ షిలా పాలసీ పూర్తి వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

లైఫ్ ఇన్సురెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ) అంటే మన దేశంలో ప్రజానీకానికి భరోసా. ఇప్పటికే అనేక రకాల బీమా సంస్థలు ఉన్నా.. దీనిలో అధికంగా జనాలు పెట్టుబడి పెట్టడానికి మొగ్గుచూపుతారు. ఈ పరిస్థితిని అందిపుచ్చుకోడానికి ఎల్ఐసీ కూడా అత్యంత ఆకర్షక పాలసీలను తీసుకొస్తుంది. అన్ని వర్గాల వారికీ కూడా అందుబాటులో పలు పథకాలను ప్రవేశపెడుతోంది. ఈ క్రమంలోనే మహిళల కోసం మరో ప్రత్యేకమైన ప్లాన్ ను తీసుకొచ్చింది. దాని పేరు ఎల్ఐసీ ఆధార్ షిలా. ఈ పాలసీలో పొదుపుతో పాటు బీమా ప్రయోజనాలు ఉంటాయి. దీర్ఘకాలంలో అధిక సంపదను నిర్మించడంతో పాటు ఊహించని సంఘటనల సమయంలో కుటుంబానికి ఆర్థిక రక్షణను అందిస్తుంది. ఈ ఎల్ఐసీ ఆధార్ షిలా పాలసీ పూర్తి వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఇది ఎల్ఐసీ ఆధార్ షిలా పాలసీ..
ఎల్ఐసీ ఆధార్ షిలా పాలసీ అనేది పొదుపు, జీవిత రక్షణ రెండింటినీ అందించడానికి రూపొందించబడిన ఎండోమెంట్ ప్లాన్. పాలసీ యాక్టివ్ లో ఉండగా పాలసీదారుడు మరణించిన దురదృష్టకర సందర్భంలో ఆ వ్యక్తి కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. బీమా చేయబడిన వ్యక్తి మొత్తం పాలసీ వ్యవధిలో జీవించి ఉంటే, వారు మెచ్యూరిటీ ప్రయోజనాలను పొందుతారు. ఇంకా, ఈ పాలసీ లోన్ సౌకర్యం, మోటారు బీమాను జోడించే ఎంపికను అందించడం ద్వారా లిక్విడిటీ అవసరాలను అందిస్తుంది. ఇది ప్రత్యేకంగా మహిళల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన పాలసీ.
ఎల్ఐసీ ఆధార్ షిలా పాలసీ ప్రయోజనాలు..
- మెచ్యూరిటీ బెనిఫిట్: మీరు తీసుకున్న పాలసీ మెచ్యూరిటీ వ్యవధి తీరిపోతే పూర్తి చెల్లింపును తీసుకోవచ్చు. డెత్ బెనిఫిట్: ఒకవేళ అనుకోని ఘటనలో పాలసీ దారుడి మరణం సంభవిస్తే ఆ వ్యక్తి కుటుంబానికి ఆర్థిక రక్షణను ఈ పథకం అందిస్తుంది.
- సరెండర్ బెనిఫిట్: కొన్ని షరతులలో పాలసీని సరెండర్ చేయడానికి ఇది అనుమతి ఇస్తుంది.
- లాయల్టీ జోడింపులు: మీ పొదుపులను మెరుగుపరచడానికి లాయల్టీ జోడింపులను కూడా ఇది అందిస్తుంది.
- పాలసీ లోన్: మీ పాలసీ విలువ ఆధారంగా రుణ సౌకర్యాన్ని యాక్సెస్ చేయొచ్చు.
- పన్ను ప్రయోజనాలు: ప్రస్తుత పన్ను చట్టాల ప్రకారం పన్ను ప్రయోజనాలు పొందవచ్చు.
- ప్రీమియం చెల్లింపులు: మీ సౌలభ్యం ప్రకారం ప్రీమియం చెల్లింపులు చేయొచ్చు.
ఎల్ఐసీ ఆధార్ షిలా పాలసీకి అర్హతలు ఇవి..
ఈ పాలసీ 8 నుంచి 55 ఏళ్ల మధ్య ఉన్న మహిళలందరికీ అందుబాటులో ఉంటుంది. పాలసీ 10 నుంచి 20 సంవత్సరాల మధ్య కాల వ్యవధిలో మెచ్యూర్ అవుతుంది, గరిష్ట మెచ్యూరిటీ వయస్సు 70 సంవత్సరాలు.
రూ. 11లక్షలు ఇలా సంపాదించొచ్చు..
ఉదాహరణకు, మీరు 15 ఏళ్ల వయస్సు నుంచి 25 ఏళ్ల వరకు రోజుకు రూ. 87 పెట్టుబడి పెడితే, రూ. 31,755 జమ కావడానికి పూర్తి సంవత్సరం పడుతుంది. మరో పదేళ్లపాటు స్థిరంగా ఇన్వెస్ట్ చేయడం ద్వారా, మీరు రూ. 3,17,550 డిపాజిట్ చేసినట్లు అవుతుంది. మీకు 70 ఏళ్లు నిండిన తర్వాత ఈ మొత్తం మెచ్యూర్ అవుతుంది. ఇది మీకు సుమారు రూ. 11 లక్షల మొత్తం చెల్లింపును అందిస్తుంది.
ఎల్ఐసీ ఆధార్ షిలా ప్లాన్ అనేది బహుముఖ ప్రయోజనాలను అందించ స్కీమ్. పొదుపు, బీమా సదుపాయాలను అందిస్తోంది. మీ ఆర్థిక భవిష్యత్తును సురక్షితంగా ఉంచడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



